గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎంత తిరుగుతున్నా వారికి జనం నుంచి నిరసనలే తప్ప ఆదరణ కానరావడం లేదు. తాజాగా జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక నిరసన సెగ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు గట్టిగా తగిలింది.
ఎంతైనా ఆర్థిక మంత్రి కదా.. అడ్డగోలుగా నిబంధనల కళ్లు గప్పి మరీ రాష్ట్రానికి అప్పులు తీసుకువచ్చిన మంత్రి కదా.. అలాగే జనాన్ని కూడా తన గణిత ప్రావీణ్యతతో ప్రజలను నమ్మించేయగలనని భావించారు. కానీ ఆయనకు ఆ గణాంకాలతోనే గట్టి క్లాస్ తీసుకుంది ఓ మహిళ. వివరాలిలా ఉన్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కర్నూలు జల్లా డోన్ నియోజకవర్గంలో పర్యటించారు.
30వ వార్డులోని ఓ మహిళ ఇంటికి వెళ్లిన ఆయన ఆమెకు ప్రభుత్వ పరంగా అందిన లబ్ధిని అంకెలతో సహా వివరించారు. అయితే ఆమె ప్రభుత్వం చేసిందేముందని, ఇందులో ఘనత ఏముందని ఎదురు ప్రశ్నించింది. దీంతో ఆమెకు మరింత వివరంగా చెప్పేందుకు ప్రయత్నించిన జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా ఆమె కుటుంబానికి 98 లక్షల 140 రూపాయలు ముట్టిందని లెక్కలు వేసి మరీ వివరించారు.
దీంతో ఆ మహిళ జగనన్న చేదోడు పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకూ తమకు అది రాలేదని నిలదీశారు. అంతే కాకుండా తన కుటుంబానికి 98140 రూపాయలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రావడంలో ప్రభుత్వం గొప్పేముందని ఎదురు ప్రశ్నించారు. ఇచ్చింది లక్ష లోపు.. పన్నుల రూపంలో వసూలు చేసింది
రెండు లక్షల పైమాటేనని ఆమె గణాంకాలతో సహా వివరించారు. కంగు తిన్న మంత్రి బుగ్గన ధరల పెరుగుదల, పన్నుల వాత తమ ప్రభుత్వం ఒక్కటే కాదనీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఈ పరిస్థితి ఉందనీ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆమె చెత్త పన్ను, ఈ పన్ను, ఆ పన్నూ ఏమిటంటూ నిలదీశారు. దీంతో బుగ్గన అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి కదిలారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/women-clarifies-that-jagans-welfare-schemes-were-no-use-39-141023.html
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.