ఛీ .. ఛీ సిగ్గేస్తోంది మంత్రి రోజా తీరుపై మహిళల ఆగ్రహం

Publish Date:Jul 5, 2022

Advertisement

ఆమె స్వతహాగా సినిమానటి ... ఒకప్పటి హీరోయిన్... నటన ఆమె వృత్తి ... అందువలన ఆమె ప్రవర్తన అలా ఉందని కాదు. అలాగే, నటీనటులు, హీరోలు, హీరొయిన్’లు అంతా ఒకేలా , సభ్యత, సంస్కారం మరిచి  అంతే అసభ్యంగా ప్రవర్తిస్తారని అసలే కాదు. కానీ, ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న, మాజీ నటీ, ప్రస్తుతం మంత్రి రోజా కాస్త చాలా బోల్డ్ టైపు లేడీ, ఎవరినీ లెక్కచేసే రకం కాదు. అది ఎవరో ఆమెకు ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. ఆమె స్వయంగా తనకు తాను ఇచ్చి పుచ్చుకున్న  కితాబు . ఆపైన సుదీర్గ కాలం ‘జబరస్త్’ టీవీ షో లో జడ్జిగా,పగలబడి నవ్వడం (కొంత మంది గిట్టని వాళ్ళు వెకిలిగా, అసభ్యంగా,అసహ్యంగా నవ్వడం అని కూడా అంటారు) బాగా ప్రాక్టీసు చేశారు.

సరే, ఆ షో ‘ఎలా ఉంటుంది .. ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యంగా ఉంటుంది అనేది వేరే  విషయం వేరే చర్చ. కొంత మంది  అయితే బూతు కామెడి షో లన్నిట్లోకి ‘జబర్దస్త్’ ఖతర్నాక్ నెంబర్ వన్, షో అని అంటారు.అలాగే,  బూతు కామెడి షోలకు  ‘జబర్దస్త్’ పెట్టింది పేరని అంటారు. సరే, ఎవరు ఏమనుకున్నా, ఆ షోను జనం విరగబడి చూస్తున్నారు అనుకోండి అది వేరే విషయం. లోకో భిన్న రుచి హి.. ఎవరి ఎవరి టేస్ట్ వారిది. కొంత మందికి అలాంటి కామెడీనే బాగుంతుంది. అందులో రోజా ఒకరు. 

అయితే ఆమె, మరో సెలబ్రిటీ అయితే అదోరకం.. కానీ, ఆమె ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి  పైగా ‘గౌరవ’ మంత్రి... సో ఆమె  గౌరవం. ఆమెకు మాత్రమే సొంతం కాదు. శ్రీ శ్రీ అన్నట్లుగా, ‘మీమీ వ్యక్తిగత జీవితాలు, మీమీ సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్నట్ల్గు ఆమెను ప్రవర్తనను ప్రశ్నించ వలసి వస్తోందని అంటున్నారు. 

ఆమె నటిగా ఉన్నత కాలం, జబర్దస్త్ షో .. జడ్జిగా ఉన్నంతకాలం పూర్వాశ్రయంలో ఆమె ఏమి  చేశారు అనేది, ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ, ఇప్పడు ఆమె కేవలం ఒక నటి, జబర్దస్త్ షో .. జడ్జి మాత్రమే కాదు, ఒక గౌరవప్రదమైన స్థానలో ఉన్న మహిళా. ఒక మంత్రి. సో.. ఆమె కొంత హుందాగా, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆశించడంలో తప్పులేదని సంన్యులు బావిస్తున్నారు. అయితే,  అదేమీ దురదుష్టమో. పాత వాసనలు ఆమెను వదలడం లేదులా  వుంది. వెనకటి వేషాలే వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమే, గతంలో జబర్దస్త్ వేషాల గురించి విమర్శలు వచ్చినప్పుడు, ఆమె, నటన తమ వృత్తని. దర్శకులు చెప్పిన విధంగా నటించడమే తమ కర్తవ్యమని, నట జీవితం వేరు, నిజ జీవితం వేరు .. రెంటిని ముడి పెట్టి చూడరాదని, తమ ప్రవర్తనను సమర్ధించుకున్నారు.

అయితే. రోజా మంత్రి అయినా, ఆమె ప్రవర్తనలో, మాట తీరులో మార్పు రాలేదనేది, ఇప్పడు ఆమె పై వస్తున్న ప్రధాన విమర్శ. నిజానికి, ఆమె మంత్రిగా చేసేది, చేయగలిగింది ఏదీ లేదు. ఆమాట కొస్తే  జగన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులకు ఉన్న విలువ ఏ పాటిదో వేరే చెప్ప నక్కర లేదు, అందుకే, హేమాహేమీలకే దిక్కులేదు, రోజా అనగా ఎంత, అని ఆమె అనుచరులే, ఆమె ముఖం మీద కాకున్నా, చాటుగా నవ్వుకుంటున్నారు. 

అయితే ఇప్పడు ఇంతలా ఆమె గురించి మాట్లాడుకోవడానికి, భీమవరంలో జరిగిన మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు శత జయంతి వేడుకల వేదిక పై ఆమె ప్రవర్తించిన తీరే కారణమని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధనమంత్రి, ముఖ్యంత్రి సమక్షంలో ఆమె ప్రవర్తన  మంత్రి పదవికి హుందా తెచ్చేలా లేదని విమర్శకులు అంటున్నారు. నిజం ఎవరో విమర్శించారని కాదు, ప్రధానమంత్రితో సెల్ఫి తీసుకోవాలనే కోరిక సహజంగా ఎవరికైనా ఉంటుంది. అయితే, అందుకు సమయం, సందర్భం ఉంటుందనే స్పృహ లేకుండా, ఆమె మంత్రి అనే విషయం  మరిచి పోయినట్లు ఆమె ప్రవర్తన ఉందని విమర్శకులు తప్పు పడుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి  చికాకు పడే వరకు,ఆమె సెల్ఫి ‘గోల’ ఆపక పోవడం విమర్శలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు.  

అదొకటి అలా ఉంటే, మంత్రి అయిన తర్వాత, ఇటీవల కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు,  ఆమెను ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆమె ఇమేజ్ ని మరింతగా దిగజారుస్తున్నాయని, సిగ్గుతో తలవంచు కుంటున్నామని సామాన్య మహిళలు కూడా అంటున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రేపులు పెరిగిపోతున్నాయని, అంటే, ఏంటి, ఒకటి రెండు రేపులకే అంత ఇదై పోవాల, గోల చెయాల అంటూ ఆమె ఇచ్చిన సమాధానం, మహిళలు తల వచుకునేలా ఉందని మహిళలే ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. చివరకు, అల్లూరి జయింతి ఉత్సావాలను ఆమె తమ ప్రవర్తనతో  అపవిత్రం చేశారని.. కార్యక్రమం స్పూర్తిని అగౌరవ పరిచే విధంగా మంత్రి రోజా ప్రవర్తన ఉందని, ప్రతిపక్షాలు కాదు ప్రజలు,ముఖ్యంగా మహిళలు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. ఇక ముందైనా, రోజా, పాత వాసనలు వదిలిచుకోవడం మంచిదని లేదంటి మంత్రి పదవి పోయినా మరకలు మాత్రం అలాగే ఉంటాయని, ఆమె మంచికోరేవారే అంటున్నారు. ఆమె వింటారా?

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.