పెళ్లి రోజున అరెస్ట్.. భార్య ములాఖత్’కు నో .. భగ్గుమంటున్న మహిళలు

Publish Date:Sep 16, 2023

Advertisement

తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు అరెస్ట్ సృష్టించిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఓ వంక రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎక్కడి కక్కడ  నిరసనలకు దిగుతుంటే, దేశ విదేశాల్లో ఐటీ, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు  చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరు పై  మండి పడుతున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం లేదని నినదిస్తున్నారు.

మరో వంక  ఢిల్లీ వెళ్ళిన తెలుగు దేశం పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్  దేశ రాజధాని నుంచి  చంద్రబాబును అక్రమంగా అరెస్ట్  చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అవినీతి, అక్రమాలను మీడియా ముందు ఉంచడంతో జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతవరకు  వివిధ కారణాల వలన చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కొంత మౌనంగా ఉన్న వివిధ పార్టీల నాయకులు, గళం విప్పుతున్నారు. జగన్ రెడ్డి దుర్మార్గాలను తెలుసుకుని, విస్తుపోతున్నారు. 

ఇప్పటికే కేంద్ర మంత్రులు సహా జాతీయ స్థాయి నేతలంతా చంద్రబాబు అరెస్టును ఖండించగా ఇప్పడు తాజగా, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్   దురదృష్టకరమంటూ ట్వీట్టర్ (x)వేదికగా వ్యాఖ్యానించారు. అంతే కాదు ప్రజల గౌరవాభిమానాలు పొందుతున్న నాయకుడు చంద్రబాబును స్వేచ్ఛను దూరం చేసిన తీరు అంతకంటే బాధాకరం. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు  వంటి స్థాయి ఉన్న నాయకునితో వ్యవహరించే టప్పుడు ఆయన స్థాయితో పాటు,  వయసును కూడా పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ,  వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒకరికీ  ఉండాలని ప్రజాస్వామ్యం చెబుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవంక తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి మాజీ  సుజనాచౌదరి,మరో కేంద్ర మాజీ మంత్రి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా వివిధ పార్టీలకు చెందిన  నాయకులు, చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును తప్పుపడుతున్నారు. ఆయన వివాహ వార్షికోత్సవం రోజునే ముహూర్తం పెట్టి మరీ మానసిక, శారీరక క్షోభకు గురిచేయడం,అదే విధంగా జైల్లో చంద్రబాబుతో ములాఖత్’కు అయన సతీమణి  భువనేశ్వరికి అనుమతించక పోవడం ఏమిటని పార్టీలతో సంబంధం లేకుండా మహిళా నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక మహిళను అది కూడా రాజకీయాలకు దూరంగా  ఉన్న మహిళను వేధింపులకు గురిచేసినందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించ వలసి ఉటుందని హెచ్చరిస్తున్నారు. 

మరో వంక చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రంలో  టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న  ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొంటున్న మహిళలు, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన సతీమణి భువనేశ్వరి,ఇతర కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తంగా చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం అగ్నిజ్వాలలా ఎగసి పడుతోంది. ఆయనను గద్దె దించడమే లక్ష్యమని సామాన్య జనం సైతం రోడ్ల మీదకు వచ్చి నినదిస్తున్నారు. 

By
en-us Political News

  
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.