స్థానిక బ్రోకర్ సాబేర్ అండతో కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఇబ్రాహీంషేక్
బార్కస్‌లో సంచలనం సృష్టించిన ఉదంతం
ఇబ్రాహీం అనే అరబ్ షేక్ బార్కస్‌కు చెందిన ఒక మహిళను బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిరుపేద అక్కా చెల్లెళ్లు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ బార్కస్ ప్రాంతానికి చెందిన నిరుపేద అక్కా చెల్లెళ్లు అవసరాలకు తమ ఇల్లు అమ్ముదామనుకున్నారు. వీరు స్థానిక బ్రోకర్ దగ్గరకు వెళ్ళితే, అరబ్ షేక్‌ను పెళ్ళి చేసుకోమని బేరం పెట్టాడంట ఆ బ్రోకర్. ఇల్లు కొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పి అక్కాచెల్లెళ్లను తన ఇంటికి పిలిచాడు. నమ్మి వచ్చిన వారి ముందు. అరవైఏళ్ల ఇబ్రహీం అనే అరబ్ షేక్ ను పరిచయం చేశాడు. షేక్‌ను పెళ్లాడాలని బెదిరించాడట. అతడి ప్రతిపాదనను రిజెక్టు చేసిన అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లిపోయారు.
అసలే మదమెక్కిన అరబ్ షేక్. చెల్లెలిపై మోజు పడ్డాడు. అంతే బ్రోకర్ సాబేర్ పక్కా ప్లాన్‌తో చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న అక్క రాత్రి నుంచి చెల్లెలు కనిపించకుండా పోవటంతో ఆందోళనకు గురైంది.తన చెల్లెలు కనిపించకుండా పోవటానికి కారణం సాబేర్ అని అనుమానించిన ఆమె.. తన సోదరుడితో కలిసి సాబేర్ ఇంటికి వెళ్లింది.
అయితే.. వారిపై సాబేర్ సతీమణి దాడికి పాల్పడింది. కనిపించకుండా పోయిన సోదరి ఆచూకీ కోసం వెతుకుతున్న వారికి బార్కాస్ లోని ఇబ్రహీం ఇంట్లో తమ చెల్లెలు ఉందని గుర్తించారు. బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా చెల్లెల్లు చెప్పడంతో వెంటనే వారు ఇబ్రహీం పాస్ పోర్టు లాక్కొని.. చెల్లెల్ని వారి చెర నుంచి విడిపించుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన అక్కాచెల్లెళ్లు.. తాజాగా పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/woman-complaints-against-arab-sheikh-for-sexually-assault-in-hyderabad-25-94971.html
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.