వరకట్నం వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

Publish Date:Apr 18, 2026

Advertisement

పెళ్లైన రెండేళ్లకే  భర్త వేధింపులు భరించలేక  ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది.  నాగర్ కర్నూల్ లోని ఒక తండాకు చెందిన సంగీత (22) అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి నిమిత్తం హైదరాబాదు నగరానికి వచ్చి గౌలిగూడలో నివాసం ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన వీరికి బంధువు అయిన నవీన్   ఆటో డ్రైవర్ కు ఇచ్చి సంగీతకు వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు.

తెలిసిన అబ్బా యికి తన కూతుర్ని ఇస్తే సంతోషంగా ఉంటుందని భావించిన  తల్లిదండ్రులు 2024లో సంగీతకు  నవీన్ తో  ఘనం గా వివాహం జరిపించారు.   ఆ సందర్భంగా ఆరు లక్షల కట్నంతో పాటు అన్ని లాంఛనాల ఇచ్చారు. కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన సంగీతకు వేధింపులు ఎదురయ్యాయి.  నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక తన తల్లిదండ్రు లకు చెప్పింది. అయితే సంగీత తల్లిదం డ్రులు పరిస్థితి మారుతుందని భావించి అల్వాల్ లో ఓ అద్దె ఇల్లు చూసి కూతురు, అల్లుడ్ని అందులో ఉంచారు అయినప్పటికీ నవీన్ ప్రవర్తనలో మార్పు రాలేదు.

అదనపు కట్నం కావా లంటూ నవీన్  రోజూ సంగీతను వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. రోజు రోజుకీ నవీన్ వేధింపులు మితిమీరి పోవడంతో సంగీత తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించారు.  బంధువుల అబ్బాయికి ఇచ్చి తన కూతుర్ని చంపుకున్నా నంటూ తల్లిదండ్రులు బోరున వినిపించారు. తన కూతుర్ని అదనపు కట్నం కోసం అల్లుడు నవీన్ వేధింపులకు గురి చేసాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్ వెలువడింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో దిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది.
నటి ఖుష్బూ సుందర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలను వేధిస్తున్న లేఆఫ్స్ పర్వం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
అత్తాపూర్ ఆర్డీవో కొప్పుల వెంకట్ రెడ్డికి జైలు శిక్ష విధించిన తెలంగాణ హై కోర్టు
యాంకర్ విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పేరు! ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా, సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఆమె సంపాదిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల పరిస్థితిపై చర్చ జోరుగా సాగుతోంది.
అధికారిక గణాంకాలు అభివృద్ధిని సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నయో అద్ధం పడుతున్నాయి. ప్రజలకు అండగా ఉండాల్సిన బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ రంగాలు ఇప్పుడు వాటి అస్థిత్వం కోసం సామాన్యుడిని ఆర్థికంగా వేధించే యంత్రాలుగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాబందులుగా మారుతున్నాయనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం ఈనెల 20న జరగనుంది.
అధికారిక గణాంకాల్లో జీడీపీ, రిటైల్ సేల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇలా అన్ని రంగాలలో వృద్ధి చూపిస్తాయి. కానీ నేలమీద ప్రజలు చూస్తున్నది మాత్రం వేతనాలు అందకపోవడం, బ్యాంకుల్లో దాచుకున్నడబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అడ్డంకులు, ఇబ్బందులు. మూతపడుతున్నఆస్పత్రులు, కట్టుదిట్టమైన ఆలయ నియంత్రణలు, రక్షణ నుంచి ఎక్స్ట్రాక్షన్ వైపు మార్పు.
రానున్న జనాభా గణనలో ప్రజల జీవనశైలితో పాటు, వారి ఆహారపు అలవాట్లపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ప్రముఖ భారతీయ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.