కొయ్యా గుర్రం ఎగరావచ్చు!

Publish Date:Jan 19, 2023

Advertisement

మూడు పార్టీలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, మరో జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ... ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్బావ సభ వేదిక నుంచి ప్రసంగించిన నేతలు ఈ ఐదుగురు. సరే, ఐదుగురు నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. దేశం ఏమైపోతోందనే ఆవేదన, ఆగ్రహం వ్యక్తపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేసేఆర్  అయితే, 2024 ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ ఇంటికి ...మేము ఢిల్లీకీ అని, చాలా విశ్వాసంగా ప్రకటించారు. 

అయితే, ఈ ‘మేము’ లో ఉన్నది ఎవరు? వేదిక మీద ఐదు ముఖాలు కనిపించినా, ఉన్నది బీఆర్ఎస్  సహా  నాలుగే పార్టీలు.. అందులో లోక్ సభలో సింగిల్ సీటున్న పార్టీ ఒకటి (ఆప్), రెండే సీట్లున్న పార్టీ ( సిపిఐ) ఇంకొకటి, ఐదు సీట్లున్న పార్టీ (ఎస్పీ), మూడు సీట్లకు పరిమితం అయిన సిపిఎం మరొకటి. ఇక బీఆర్ఎస్ సంగతి చెప్పనే అక్కరలేదు. కారు సారు పదహారు ..కాస్తా తొమ్మిదికి చేరింది.  అంటే 545 సంఖ్యా బలమున్న లోక్  సభలో బీఆర్ఎస్ వేదికను అలంకరించిన జాతీయ నేతల టోటల్ స్ట్రెంక్త్  20కి లోపే. పోనీ ఈ నాలుగు పార్టీల ఐదుగురు నేతలు ఒకే మాట మీదున్నారా? అంటే  అదీ లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా నలుగురూ నాలుగు పక్కలకూ లాగుతున్నారు. ముఖ్యంగా ఎంత చెడ్డా  లోక్ సభలో అధికారికంగా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా, జాతీయ స్థాయిలో  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే ..అయినా కాంగ్రెస్ పొత్తు విషయంలో ఏ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఏ రెండు పార్టీలు కాదు, ఏ ఇద్దరు నాయకుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు.  

కేసీఆర్  బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీని కూడా శత్రు పక్షంగా చూస్తున్నారు. ఆ రెండు పార్టీల నిర్వాకం వల్లనే దేశం ఈ దౌర్భాగ్య స్థితి చేరిందని ఆయన అంటున్నారు. మరో వంక సిపిఐ నేత డి.రాజా కాంగ్రెస్ సహా లౌకికవాద ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటైతేనే కానీ, మోడీ పీఠాన్ని కదల్చలేమని అంటున్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సగం అటు సగం ఇటుగా ఉన్నారు. అదే పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి మాన్    బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. అలాగే సిపిఐ జాతీయ నేత రాజా, కాంగ్రెస్ తో కలిసి నడవాలని అంటే, కేరళ ముఖ్యమంత్రి (సిపిఎం) హస్తం పార్టీతో చేయి కలిపేది లేదని అంటున్నారు. అఫ్కోర్స్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా కాంగ్రెస్   కలిసిపోదామని అన్నా, గత ఏప్రిల్లో జరిగిన సిపిఎం కాంగ్రెస్  ఏచూరి ప్రతిపాదనను తోసి పుచ్చింది. జాతీయ స్థాయిలో ఏ పార్టీ, కూటమితో పొత్తు ఉండదని, సిపిఎం కాంగ్రెస్ ఆమోదించిన రాజకీయ తీర్మానంలో స్పష్టం చేసింది. 

నిజానికి, ఈ నాలుగు పార్టీలు ఐదుగురు నాయకులే కాదు, ఓ వంక నుంచి మమతా బెనర్జీ, మరో వంక నుంచి నితీష్ కుమార్, ఎవరికి వారు 2024 ఎన్నికలలో మోడీని ఇంటికి పపంపాలని శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, అది అయ్యే పనేనా? అందులోనూ... కాంగ్రెస్ ను పక్కన పెట్టి, అంటే ..ఏమో కొయ్యా గుర్రం ఎగరావచ్చు .. అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.