హ్యాట్రిక్ కొడతాం.. కేటీఆర్ ధీమా
Publish Date:Nov 30, 2023
Advertisement
ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ సారి 70కి పైగా స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడం ఇదే మొదటి సారి కాదని అన్నారు. 2018లో కూడా ఇదే విధంగా బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ఓడిపోతుందని పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయనీ, కానీ జరిగిందేమిటో తెలుసు కదా అని అన్నారు ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత ఉందని తాను భావించడం లేదన్నారు. అనుకోవట్లేదన్నారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు.
http://www.teluguone.com/news/content/will-win-ktr-confidence-25-166139.html





