హు కిల్డ్ బాబాయ్? ఎప్పటికైనా తేలేనా?

Publish Date:Apr 13, 2023

Advertisement

వైఎస్ వివేకా హత్య కేసు..ఎన్ని ట్విస్టులు, ఎన్ని మలుపులు.. ఇవన్నీ కూడా హత్య కేసు ఎప్పటికీ తేలకూడదన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం రచించిన వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఒక నేరం ఎప్పటికీ రుజువు కాకుండా చేయడం ఎలా అంటే వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు న్యాయస్థానాలను ఉపయోగించుకుంటున్న తీరును ఉదాహరణగా చూపవచ్చు.  

వంద మంది నేరస్థులు  తప్పించుకున్నా ఫరవాలేదు ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటారు. అయితే ఆ మాటకు అర్ధం మాత్రం నేరస్థులెవరైనా తప్పించుకు పోవచ్చు అని మాత్రం కాదు.  అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వైఎస్ వివేకా హత్యకు మోటివ్ ఎమిటి? లబ్ధి పొందింది ఎవరు? వెనుక ఉన్న రాజకీయం ఏమిటి? అన్నది దాదాపుగా జనానికి అవగతమైపోయింది. నాలుగేళ్లనాడు వివేకా హత్య జరిగిన మరుక్షణం ఆయన గుండెపోటుతో మరణించారంటూ.. అప్పటి విపక్ష నాయకులు (ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు) ఊరూవాడా ఏకమయ్యేలా ప్రచారం చేశారు. అలా ప్రచారం చేస్తున్న గంటల వ్యవధిలోనే వివేకా మరణానికి గుండెపోటు కారణం కాదు గొడ్డలి పోటన్నది వెల్లడైంది. అంటే గుండెపోటు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిపై ఆరోపణలు గుప్పించారు. నారాసుర రక్త చరిత్ర అంటూ గగ్గోలు పెట్టారు.

మొత్తం మీద అప్పటి ఎన్నికలలో ఈ ప్రచారం ప్లస్ అయ్యింది.  2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి వరకూ సొంత బాబాయ్ ను అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య కేసు విచారణ రాష్ట్ర పోలీసులతో కాదు, సీబీఐతో చేయించాలని డిమాండ్ చేసిన వారు.. అధికారం చేపట్టగానే సీబీఐ విచారణ అవసరం లేదంటూ ప్లేటు ఫిరాయించారు.  జగన్ సీఎం అయిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా కేసు దర్యాప్తు సాగింది.

దీనితో తన తండ్రి హంతకులు ఎవరన్నది తేలాల్సిందే అంటూ వివేకా కుమార్తె సునీత్ న్యాయస్థానాలను ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును సాధించుకున్నారు. దీంతో వివేకా హత్య కేసు దర్యాప్తు సవ్యంగా సాగడం ఆరంభమైంది. అంతే వెంటనే గతంలో తాము చేసిన నారాసుర రక్త చరిత్ర ఆరోపణలను పూర్తిగా మరిచిపోయిన వైసీపీ అగ్రనాయకత్వం ఆరోపణాస్త్రాలను వివేకా అల్లుడు అంటు కుమార్తె డాక్టర్ సునీత భర్తపై ఎక్కు పెట్టారు. అలాగే కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. బెదరించారు. కేసులు పెట్టారు. దీంతో ఏపీలో అయితే కేసు దర్యాప్తు సవ్యంగా జరగదని భావించిన డాక్టర్ సునీత మరోమారు సుప్రీంను ఆశ్రయించి కేసు దర్యాప్తును పొరుగు రాష్ట్రానికి బదలాయించేలా  ఉత్తర్వలు సాధించారు.

 అంతే వెంటనే  వైఎస్ వివేకా రెండో పెళ్లి అంటూ మరో ప్రచారం తెరపైకి తెచ్చారు. కేసు తెలంగాణకు మారిన తరువాత దర్యాప్తు వేగం పుంజుకుంది. తీగ లాగి డొంక వద్దకు వచ్చేసింది.  వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరన్నది ఇహనో ఇప్పుడో వెల్లడి కావడం ఖాయమన్న భావన అందరిలోనూ నెలకొంది.   ఆ దశలో అప్పటి వరకూ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రాం సింగ్ ను తొలగించారు. దీని వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మర్మం ఏదో ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. సరే అదలా ఉంటే ఇప్పుడు తాజాగా వివేకా క్యారక్టర్ ను అశాసినేట్ చేసేలా మరో కథనం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించి సునీల్ యాదవే వివేకాను గొడ్డలి పోటుతో హత్య చేశారని మరో కథనాన్ని బయటకు తెచ్చారు.

నారాసుర రక్త చరిత్ర, వివేకా రెండో పెళ్లి, ఆస్తి కోసం అల్లుడే ఈ హత్య చేశాడు వంటి వన్నీ వెనక్కు నెట్టి ఇప్పుడు వివేకా లైంగిక వేథింపుల కారణంగానే హత్యకు గురయ్యాడంటే కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు.  ముందు ముందు మరెన్ని వాదనలు తెరమీదకు వస్తాయో అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసలింతకీ హుకిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు ఎప్పటికైనా సమాధానం దొరుకుతుందా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారుల గుట్టు బయటకు వస్తుందా? అంటే ఏమో అన్న సమాధానమే వస్తోంది. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.