ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు డుమ్మా?

Publish Date:Aug 2, 2022

Advertisement

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరౌతారా అన్నది ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. మెజారిటీ అభిప్రాయం మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మీటింగ్ కు డుమ్మా కొడతారనే అంటున్నారు. అందుకు ఇరువురికీ వారి వారి కారణాలున్నాయంటున్నారు.

ఇంతకీ విషయమేమిటంటే ఈ నెల 6న హస్తినలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశం జరగ నుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొడతారని తెరాస శ్రేణులే చెబుతున్నాయి. గత కొంత కాలంగా కేసీఆర్ ప్రధాని మోడీతో భేటీ అయ్యింది లేదు. ఆయనపై తీవ్ర స్థాయి విమర్శలతో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ప్రొటో కాల్ ప్రకారం మోడీకి స్వాగతం పలకాల్సిన సందర్భాలలో కూడా మొహం చాటేశారు.

మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన హైదరాబాద్ లో ఉండి కూడా మోడీకి స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లలేదు. కనుక ఆహ్వానం వచ్చిందని ఆయన మోడీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ మీటింగ్ కు వెళ్లతారని ఎవరూ భావించడం లేదు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన సాధారణంగా కేంద్రం నుంచి వచ్చిన ప్రతి ఆహ్వానాన్నీ మన్నిస్తారు. అయితే ఈ సారి ఆయన ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ భేటీకి డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇందుకు కారణం ఆ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరౌతుండటమే కారణమని చెబుతున్నారు. ఔను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేంద్రం నుంచి చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు చంద్ర బాబు ఈ నెల 6న ఢిల్లీ వెళ్ల నున్నారు. ఆ కారణంగానే ఈ సమావేశానికి జగన్ డుమ్మా కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్   రాజకీయ ప్రత్యర్థులందరినీ వ్యక్తగత శత్రువులుగానే భావిస్తారనీ, ఆ కారణంగానే తనపై విమర్శలు చేస్తున్న సొంత పార్టీ ఎంపీ రఘురామ రాజు భీమవరం లో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హజరు కాకుండా అడ్డుకున్నారని చెబుతారు. తనను వ్యతిరేకించే వారికి ఎదురుపడటాన్ని కూడా జగన్ సహించరని చెబుతారు.

అందుకే విపక్ష నేత చంద్రబాబు హాజరౌతున్న ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి జగన్ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆ సమావేశానికి హాజరౌతే జగన్ చంద్రబాబుతో కలిసి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరో తేదీన ఢిల్లీ వెళ్లబోతున్నారు. “అజాదీ కా అమృత్ మహోత్సవ్” జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి హాజరవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.  రాజకీయాన్ని రాజకీయంగానే చూసే చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.కానీ రాజకీయాన్ని కూడా వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి పెంచుకునే జగన్‌కు మాత్రం ఈ భే్టీ ఇబ్బందికరమే.అందుకే ఆయన డుమ్మా కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.