సోనియా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

Publish Date:Aug 3, 2022

Advertisement

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరాఖరుకు కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. గత కొంతకాలంగా ఇదే విషయంగా సాగుతున్న చర్చ పక్కదారి పడుతున్న నేపధ్యంలో ఇంకా లేట్ చేస్తే ఇంకెన్నో లోగుట్లు బయటపడే ప్రమాదం ఉందని, సో ..ఇంకా జాగుచేయడం మంచిది కాదని రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజగోపాల రెడ్డి రాజీనామా ఖరారైన నేపధ్యంలో మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక అనివార్యమవుతుంది. వచ్చే ఆరు నెలలో ఎప్పుడైనా ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ లోగా ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళితే తప్పించి, ఉప  ఎన్నిక జరిగి తీరుతుంది.  

మరోవంక వచ్చే సంవత్సరం (2023) ద్వితీయార్ధంలో జరిగే శాసనసభ ఎన్నికల ముందు, జరిగే మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక మలుపు అవుతుందని, పరిశీలకులు భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అధికార పార్టీ లెక్క తేల్చడంతో పాటుగా అనేక రాజకీయ భేతాళ ప్రశ్నలను సమాధానం ఇస్తుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, తెరాసకు ప్రాధాన ప్రత్యర్ధి ఎవరో మునుగోడు తెల్చేస్తుంది.  అందుకే, మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి.యుద్ధానికి సిద్దమవుతున్నాయి. 
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే, రాజగోపాల రెడ్డి రాజీనామా  ప్రకటించిన కొద్ది సేపటికే తెర మీదకు వచ్చారు. అంతేకాదు, అప్పటికప్పుడు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కన్వీనర్ గా ఎన్నికల కమిటీ ప్రకటించారు. అలాగే, ఎవరొచ్చినా, ఎవరు రాకున్నా, ఎన్నికల శంఖారావం  పూరిస్తున్నామని, ఆగష్టు 5 న మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అంతే కాకుండా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, కాంగ్రెస్ లో పుట్టిపెరిగిన వారికంటే, తనకే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎక్కువ శ్రద్ధ ఉందని ప్రకటించుకునే ప్రయత్నం చేశారు.

అలాగే,   సోనియా గాంధీ సెంటిమెంట్ ను తెరమీదకు తెచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీని విచారిస్తున్న సమయంలో రాజగోపాల రెడ్డి హోం మంత్రి అమిత్ షాతో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారని, ఫైర్ అయ్యారు. అంతే కాకుండా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తూ, సోనియా సెంటిమెంట్ నే ఎన్నికల అస్త్రం చేసుకున్నారనే అభిప్రాయం  కల్పించారు. 

అయితే రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలో పనిచేయని సోనియా సెంటిమెంట్ ఇప్పుడు ఈ ఉపఎన్నికల్లో పనిచేస్తుందా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా వుంది. అంతే కాకుండా  గతంలో ఇదే సోనియా గాంధీని,  బజారు  భాషలో దూషించిన రేవంత్ రెడ్డి ఇప్పడు ఆమెను తెలంగాణ తల్లి అన్నా, ఇంకొకటి అన్నా, ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ప్రధాన ప్రశ్నగా వుంది. 

అయితే, మరో వంక మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్‌ స్థానం కావడంతో కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికలో విజయం కీలకంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాల్లో ఒకటి. పార్టీ కున్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు ఉమ్మడి నలోగొండ జిల్లా నుంచే ఎన్నికయ్యారు. ఇంకా అనేక మంది దిగ్గజ నేతలున్న జిల్లా నల్గొండ జిల్లా. అయినా  జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు,ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి ఇలా కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఎవరికీ, ఎన్నికల కమిటీలో స్థానం కల్పించకపోవడం పట్ల జిల్లా నాయకులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. 
నిజానికి జిల్లాకు రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులే కాకుండా, కేంద్ర నాయకులు కూడా రాజగోపాల రెడ్డి పార్టీ రాజీనామా చేయకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ,  రేవంత్ రెడ్డి, ఆయన వర్గానికి చెందిన నాయకులు మాత్రం, మొదటి నుంచి, రాజగోపాల రెడ్డి పార్టీ వదిలిపోతేనే మంచిందనే విధంగా వ్యవహరించారని అంటున్నారు.

అందుకే, రాజగోపాల రెడ్డి రాజీనామా నిర్ణయం ప్రకటించిన వెంటనే రేవంత్ రెడ్డి పునరాలోచనకు అవకాశం లేకుండా రంగప్రవేశం చేశారు. నిజానికి గత వరం రోజులుగా సాగుతున్న రాజగోపాల రెడ్డి ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డి ఎక్కడా ప్రత్యక్ష పాత్ర పోషించలేదు. కానీ, రాజగోపాల రెడ్డి రాజీనామా నిర్ణయం ప్రకటించిన వెంటనే మీడియా ముందుకొచ్చి ఆయనపై  తీవ్ర ఆరోపణలు చేశారని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా, పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి దూకుడు బ్రేకులు వేసే సమయం వచ్చిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విధగా రేవంత్ రెడ్డి పార్టీని హైజాక్ చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ  సీనియర్ నాయకులు వ్యక్తపరుస్తున్నారు,ఈ పర్యవసాన ప్రభావం ఉపఎన్నికల పైనే కాకుండా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై కూడా ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ను కూడా మునుగోడు డిసైడ్ చేస్తుందని అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.