రేవంత్ సైకిలెక్కేస్తారా?

Publish Date:Dec 24, 2022

Advertisement

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మళ్లీ సెకిలెక్కేయనున్నారా? తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం చేయడానికి తన శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారా? ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయా? అందుకోసమే తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభ సమయంలో కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు వ  పరిణామాలు కారణం. ఒకటి  ఖమ్మంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంఖారావం పేరిట నిర్వహించిన సభలో  పార్టీని వదిలి వెళ్లిన వారు ఎవరైనా తిరిగి రావొచ్చునంటూ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. రెండోది తెలంగాణ కాంగ్రెస్ లో    సీనియర్లు.. జూనియర్ల రచ్చ.  కాంగ్రెస్ లో ఈ రచ్చకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డే. నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీని వీడి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీపీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోయారు.

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చే దాకా.. అడపాదడపా అసమ్మతి గళం విప్పినా ఓపికగా వేచి చూశారనే చెప్పాలి. అయితే మునుగోడు ఫలితం తరువాత సీనియర్ల అసమ్మతి గళం పెరిగింది. పీసీసీ కమిటీల నియామకంతో అది పతాక స్థాయికి చేరింది.   దీంతో ట్రబుల్ షూటర్ గా దిగ్విజయ్ సింగ్.. హుటాహుటిన హైదరాబాద్ రావడం.. ఆయనకు అంతే వేగంగా.. రేవంత్‌పై సీనియర్లు ఫిర్యాదులు చేయడం చకా చక జరిగిపోయాయి.   

ఇంకోవైపు తమను వలసవాదులన్నారంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేంద్రరెడ్డి లాంటి వారు పీసీసీ కమిటీల్లో  తమ పదవులకు రాజీనామా చేసేశారు. అంతకు ముందే పీసీసీ చీఫ్ పదవి రేవంత్ కు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ  మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరి మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యారు. ఆయన సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా కాషాయం గూటికి చేరడానికి రెడీగా ఉన్నారు.

నిజమే రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడన్న సంగతి విదితమే. అయితే ఓటుకు నోటు కేసు తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన తెలంగాణలో   తెలుగుదేశం క్రీయాశీలంగా లేదన్న భావనతో కాంగ్రెస్ గూటికి చేరారు. అలా చేరడానికి ముందు రేవంత్ అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి ఆయన అనుమతి తీసుకున్నారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా జరిగింది. సరే మొత్తం మీద సైకిల్ దిగి ‘చేయి’ అందుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో రెడ్ కార్పెట్ వెల్ కమ్ లభించింది. ఇలా పార్టీలో చేరారో లేదో అలా టీపీసీసీ పగ్గాలు అందుకున్నారు. 
 కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతుకుముందు.. రేవంత్ రెడ్డి స్వయంగా అమరావతికి వెళ్లి... నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారన్న విషయం విదితమే. అలాగే రేవంత్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ కు బలంగా మారారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టిన తరువాతే అప్పటి దాకా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.  

అయితే కాంగ్రెస్ లో గ్రూపుల సంస్కృతికి చెల్లు చీటీ రాసే విషయంలో మాత్రం రేవంత్ సక్సెస్ కాలేకపోయారు.  పైపెచ్చు సీనియర్లు తన పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరించడంతో రేవంత్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు చందంగా మారింది.  ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తెలుగుదేశం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెరాస భారాసగా రూపాంతరం చెందిన తరువాత ఆ పార్టీ ఇక సెంటిమెంట్ ఆస్త్రాన్ని ఉపయోగించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిరోధించే అవకాశాలు లేవు. సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబు ఖమ్మం సభ నభూతో అన్న చందంగా సక్సెస్ అయ్యింది.  ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి మళ్లీ సైకిలెక్కే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.