రేవంత్ ‘రెడ్డి’ రాజకీయం .. హిట్ అవుతుందా?

Publish Date:May 26, 2022

Advertisement

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల ‘రెడ్డి’ సామాజిక వర్గం ఘనకీర్తిని శ్లాఘిస్తూ, పార్టీ ఏదైనా పగ్గాలు రెడ్ల చేతిలోనే ఉండాలని అప్పుడే, రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటాయని, కొత్త భాష్యం చెప్పారు. కొత్త  అస్త్రాన్ని బయటకు తీశారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాలో ‘హాట్ టాపిక్’గా మారింది. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోనే కొందరు రెడ్డి నాయకులు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. 

నిజానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గమే నాయకత్వం వహించింది. ఆంధ్ర ప్రదేశ్ తొలి మలి ముఖ్యమంత్రులు (నీలం సంజీవ రెడ్డి, నల్లారికిరణ్ రెడ్డి) ఇద్దరూ అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం యాదృచ్చికమే కావచ్చును, కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులలో,  ఒక దామోదరం సంజీవయ్య, ఒక పీవీ  నరసింహ రావు, ఒక అంజయ్య, ఒక జలగం వెంగళ రావు మినహా మిగలిన అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం మాత్రం యాదృచ్చికం కాదు. కాంగ్రెస్ పార్టీ పై రెడ్ల ఆధిపత్యానికి అది నిదర్శనం. 

నిజానికి ఇప్పటికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే  రెడ్ల పార్టీ అనే ముద్ర అలాగే కొనసాగుతోంది. ప్రస్తుత, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఉత్తమ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇద్దరూ రెడ్లే.. అలాగే ఇటీవల కొత్తగా సృష్టించిన. స్టార్ క్యాంపైనర్’ పదవిని కూడా కోమటి రెడ్డికే ఇచ్చారు. అదే విధంగా పీసీసీలో ఇతరత్రా పదవుల్లోని రెడ్డి సామాజిక వర్గానిదే పై చేయిగా  వుంది. చివరకు అసమ్మతి నాయకత్వం కూడా (జగ్గా రెడ్డిం మర్రి శశిధర్ రెడ్డి) చేతుల్లోనే వుంది. 

అదలా ఉంటే. రేవంత్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం చరిత్రను విప్పి చెప్పి మరీ  రెడ్ల పాలన లేకనే రాష్ట్రం నష్ట పోయిందని, రెడ్డి సామాజిక వర్గాన్ని దువ్వె ప్రయత్నం ఎందుకు చేశారు? రెడ్డి, వెలమ సామాజిక వర్గాల మది చిచ్చు పెట్టి, వెలమలను తెరాస గాటనకట్టే ప్రయత్నం ఎందుకు చేశారు. వైపుకు ఎందుకు   అన్నివర్గాలను కలుపుకు పోవలసిన పీసీసీ అధ్యక్షుడు, కులం బురద ఎందుకు పూసుకున్నట్లు?  అంటే, అందుకు చాలా బలమైన కారణమే ఉందని, రేవంత్ ‘రెడ్డి’ సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. 
దేశ రాజకీయాలు చాలా వేగంగా మారి పోతున్నాయి. ఎంత కాదనుకున్నా జాతీయ రాజకీయాల ప్రభావం రాష్ట్ర రాజకీయాల మీద ఎంతో కొంత ఉంటుంది. మరో వంక, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసతో ఒకే సారి పోరాటం చేయడం అనే క్లిష్ట పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కుంటోంది. ఈ అన్నిటినీ మించి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు మరింత బలహీన మవుతోంది.

ఇటీవల రాజస్థాన్’లోని  ఉదయపూర్’లో మూడు రోజుల పాటు నిర్వహించిన  చింతన శిబిరం, పార్టీలో కొత్త ఉత్సాహాన్ని  నింపుతుందని ఆశించినా, వాస్తవంలో, ‘చింతన్ శిబిర్’  చర్చలు, తీర్మానాల చుట్టూ తిరుగుతున్న మీడియా చర్చల్లో కాంగ్రెస్ బలహీనతలు మరింతగా ఫోకస్ అవుతున్నామే కానే, మెరుపులు కనిపించడం లేదు.  జాతీయ మీడియాలో బీజేపీ అనుకూల, వ్యతిరేక మీడియా అన్న తేడా లేకుండా ఆల్మోస్ట్ మీడియా మొత్తంగా, కాంగ్రెస్ కథ కంచి చేరినట్లే అనే ఆర్థం వచ్చేలా విశ్లేషణలు చేస్తున్నాయి. ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ముందుగానే శ్రద్ధాంజలి సిద్దం చేస్తున్నాయి. శుభం పలకవే పెద్దమ్మా అంటే, నాకులాగా వెయ్యేళ్ళు వర్ధిల్లమన్నట్లు, కాంగ్రెస్ నమ్ముకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్  కిశోర్, మరో నాలుగైదు నెలలలో జరిగే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

అదే విధంగా, చింతన్ శిబిర్ తర్వాత కూడా వలసలు ఆగడం లేదు. కపిల్ సిబల్  వంటి  పార్టీ ముఖ్య నేతలు ఒకరొకరుగా పార్టీ వదిలి పోతున్నారు.ఈ నేపద్యంలో నాయకత్వ సమస్య చిక్కుముడి విప్పకుండా, కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం ఆశలు, ఆశయాలు నేరవేరవాణి , అవి ఎండమావిగానే మిగిలిపోతాయని, కాంగ్రెస్ అనుకూల మేథావి వర్గం కూడా కుండబద్దలు కొడుతోంది. నాయకత్వమే కాదు, సిద్ధాంత ప్రాతిపదిక, పార్టీ వ్యవస్థాగత స్వరూపం, ఒక్క మాటలో చెప్పాలంటే, పార్టీ సమూల పక్షాళన అవసరమని కాంగ్రెస్, అనుకూల వ్యతిరేక మీడియా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అయితే కాంగ్రెస్ అధిష్టానం, ఆ ఒక్కటి అడక్కు అంటూ నాయకత్వ సమస్యను కార్పెట్ కిందకు తోసేసింది.  ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి, సొంత అజెండాను సిద్దం చేసుకుంటున్నారని, అందులో భాగంగానే, రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా తమ వైపుకు తిప్పుకునేందుకు వ్యుహత్మకంగానే ఈ అంశాన్ని లేవనెత్తారని అంటున్నారు. కేంద్రంలో, అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలు సమీపించే సమయానికి, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం. ఎరువుల సబ్సిడీ పెంచడం. అదే విధంగా ఇతర సంక్షేమ పథకాలను అస్త్రాలుగా చేసుకుంటుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే హిందూ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటోంది.   మరో వంక  రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ఇటు  సంక్షేమ పథకాలను, అటు తెలంగాణ సెంటిమెంట్’ను సొమ్ము చేసుకుంటోంది.ఈ పరిస్థితుల్లో అటూ ఇటూ ఎటూ కాకుండా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి, రెడ్డి సెంటిమెంట్’ ను జత చేసేందుకే రేవంత్ రెడ్డి వ్యూహత్మకంగా రెడ్డి రాజుల గొప్పతనాన్ని, అదే సమయంలో వెలమ దొరలతో రెడ్డి సామాజికవర్గాలకు వైరాన్ని తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. 

అయితే, ఎన్నికల రాజకీయాల్లో కులం ఒక కీలక ఫ్యాక్టర్ కేలకమే అయినా, ఇతర అంశాలు అన్నీ కలిసి వచ్చినప్పుడు కులం ఒక అదనపు ఆభరణం, ఆకర్షణ అవుతుంది. అంతేకానీ, కేవలం కులమే అందలం ఎక్కిస్తుంది అనుకుంటే, అది అన్ని సందర్భాలలో నిజం కాదు. అదే నిజం అయితే, తెలంగాణలో రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకంటే ఎన్నో రెడ్లు ఎక్కువ ఉన్న బీసీలదే అధికారం కావాలి కానీ,  అలా జరగలేదు. జరగదు. సో ... రేవంత్ రెడ్డి వ్యూహం ఒకే అయినా ఫలితం ఏమిటన్నది, ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.