సెల్ ఫోన్ రీచార్జీ ధరలు తగ్గుతాయా?

Publish Date:Oct 28, 2024

Advertisement

టెలికాం సంస్థలు త్వరలో సెల్ ఫోన్ రీచార్జీ ధరలను తగ్గించే అవకాశాలున్నాయా అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. టెలికాం సంస్థలు సంస్కరణల బాట పట్టాయి. తమ లైసెన్స్ ఫీజులు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వారి డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే సర్వీస్ ప్రొవైడర్లు రీచార్జి ధరలను తగ్గించే అవకాశం ఉంది.

ఎయిర్ టెల్, జియో, వీఐ రీచార్జ్ ప్లన్ లు తగ్గించేందుకు  సర్వీస్ ప్రొవైడర్లు సుముఖంగా ఉన్నారు. ఇటీవల రీచార్జ్ ధరలను పెంచడంతో  చాలా మంది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు షిప్ట్ అయిపోయారు. ఇదే ఒరవడి ముందు ముందు కొనసాగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో ప్రైవేటు టెలికాం సంస్థలు సంస్కరణల బాట పట్టాయి.  అవి కోరినట్లుగా  కేంద్రం వాటి లైసెన్సు ఫీజును తగ్గించేందుకు అంగీకరిస్తే  రీచార్జ్ ధరలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రైవేటు టెలికాం సంస్థలు చెబుతున్నాయి.

ఇప్పటికే వీటికి ప్రాతినిథ్యం వహిస్తున్న  సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) టెలికాం ఆపరేటర్లపై విధించే లైసెన్స్ ఫీజును తగ్గించాలని అధికారికంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. స్థూల ఆదాయంలో ఎనిమిది శాతంగా ఉన్న ప్రస్తుత లైసెన్స్ ఫీజును ఒక శాతానికి తగ్గించాలని సీఓఏఐ కేంద్రాన్ని కోరింది.  అలా  తగ్గిస్తే నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌లు,  విస్తరణలు సులభతరం అవుతాయని చెబుతోంది.  

By
en-us Political News

  
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.