పవన్ కోరిన రూట్ మ్యాప్ పురందేశ్వరి ఇస్తారా?

Publish Date:Jul 8, 2023

Advertisement

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు అధికార పార్టీ మరోసారి అధికారం దక్కిచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే..  ప్రజలలో  పెరిగిన జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా  మార్చుకునేందుకు  ప్రతిపక్షాలు ప్రజల మధ్యకి వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పాదయాత్ర, బస్సు యాత్ర మొదలు పెట్టగా.. బీజేపీ ప్రక్షాళన మొదలు పెట్టింది. దీంతో ఎన్నికల రోహిణీకార్తె వేడిని మించిపోయింది.  అయితే, ఏపీ రాజకీయాలను మలుపుతిప్పే అంశం ఏదైనా ఉందంటే అది పొత్తులే. ఈ అంశంలో స్పష్టత వచ్చే వరకూ రాజకీయం ఒకలా ఉంటే ఒక్కసారి పొత్తులపై స్పష్టత వస్తే  ఆ తర్వాత ఉండే మజానే వేరు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా.. సింగల్ గానే పోటీకి దిగుతారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

అయితే  బీజేపీ-జనసేన అధికారికంగానే పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. పొత్తులో ఉన్నా ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీలూ కలిసి చేసిన కార్యక్రమం ఒక్కటీ లేదు. దీనిపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఇప్పటంలో జనసేన సమావేశం.. ఆ తర్వాత ప్రభుత్వం కక్షసాధింపుతో ప్రజల ఇళ్లను ధ్వంసం చేయడం.. మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడే ప్రజలకు అండగా పలు కార్యక్రమాలు చేపట్టడం అందరూ చూసిందే. కాగా  అప్పుడు అక్కడ జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ వస్తుందని ఎదురుచూస్తున్నానని.. అది తనకు ఇస్తే ఏపీలో వైసీపీని గద్దె దించుతామని  స్పష్టం చేశారు. దానికి ఆనాటి బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు బీజేపీ రోడ్ మ్యాప్ వెరీ క్లియర్ అని అది ఎపుడో పవన్ కి ఇచ్చేశామని కౌంటర్ కూడా ఇచ్చారు.

కాగా సోము వీర్రాజు కౌంటర్ అయితే ఇచ్చారు కానీ పవన్ అడిగిన రోడ్ మ్యాప్ మాత్రం  ఇవ్వలేదు.  ఇవ్వకుండానే ఆయన బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇ  మాజీ అయిపోయారు. ఇప్పుడు తాజాగా పురంధేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలను బీజేపీ అధిష్ఠానం అప్పగించింది.  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, రానున్న ఎన్నికలలో పొత్తులపై కూడా చర్చించారని అంటున్నారు. ఇక  ఆమె ఢిల్లీ నుంచి విజయవాడ  వచ్చి ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్నారు. కొత్త ప్రెసిడెంట్ కనుక ఎలాగూ ఆ పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలు ఆమెకి ఘనస్వాగతం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అధ్యక్షురాలిగా ఆమె తన వర్గాన్ని కూడా సిద్ధం చేసుకోవడం కామనే. ఎలాగూ అధిష్టానం చెప్పే పంపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆమె కార్యకలాపాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి.

అయితే  ఇప్పుడు పవన్ కి పురందేశ్వరి రోడ్ మ్యాప్ ఇస్తారా? ఈ రోడ్ మ్యాప్ బీజేపీకి నచ్చినట్లుగా ఉంటుందా లేక పవన్ కోరుకుంటున్నట్లుగా ఉంటుందా?  అన్నదే ఆసక్తిగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మొదలైన దగ్గర నుండి ఎటు చూసినా దారులు వేరుగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా పవన్ టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు టీడీపీ పేరు లేకుండా ఇదే మాట   ప్రకటించేశారు.  బీజేపీ మాత్రం ఆ విషయంలో  ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించిన చందంగా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇంతకుముందున్న అధ్యక్షుడైతే   టీడీపీని ప్రధాన శత్రువుగా చూసే వారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారు? సోము వీర్రాజు టైంలో జనసేనతో ఏర్పడిన గ్యాప్ ఇప్పుడు తొలగిపోతుందా?.. జనసేన బీజేపీ కలసి తెలుగుదేశంతో కలిసి పని చేస్తాయా అన్నది చూడాలి.

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.