విపక్షాల ఐక్యతా యత్నాలు సవ్యంగా సాగేనా?

Publish Date:Jan 10, 2023

Advertisement

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయంటే అధికార  పక్షంలో కాదు ప్రతి పక్షాల్లోనే  హడావుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గత అనుభవం దృష్ట్యా  చివరి క్షణంలో  ఐక్యతా ప్రయత్నాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదని, అధికార బీజేపీని ఎదుర్కొవడం అంత తేలికైన టాస్క్ కాదనీ అర్దమవ్వడమే.   2014, 2019లో ఎన్నికలలో  విపక్షాల అనైక్యతే బీజేపీకి అదనపు బలంగా మారిందన్నసంగతి అన్ని రాజకీయ పార్టీలూ గ్రహించేశాయి.  అయినా విపక్షాల మధ్య ఐక్యతా యత్నాల ధోరణి ఎవరి దారి వారిదే అన్నట్లుగానే ఉంది.   భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ   ప్రతిపక్షాల ఐక్యత గురించి ప్రస్తావించారు. సరే ఇక ఆరంభం అవుతాయా అనుకునేలోగానే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు  కూటమి అయినా, పొత్తులున్నా.. రాహుల్ గాంధీని పీఎం అభ్యర్థిగా అంగీకరించాల్సిందే నంటూ కండీషన్ ను తెరమీదకు తీసుకు వచ్చారు. ఈ ఏడాదిలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు  ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఐక్యతా రాగం ఆలపించగలిగితేనే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నకల నాటికి ఐక్యత బలపడే అవకాశం ఉంటుంది.  అయితే ఈ ఏడాది వివిధ అసెంబ్లీలకు జరిగే ఎన్నికలలో విపక్షాలు సంఘటితంగా సత్తా చూపే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు మాత్రం సంతృప్తి కరమైన సమాధానం రావడం లేదు.   2014, 2019 సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు  ఏక తాటి మీద నిలబడి పోటీ చేసి సత్ఫలితాలను అందుకున్నాయి. కానీ, సార్వత్రిక ఎన్నికల విషయం వచ్చే సరికి  ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీ తిరుగులేని విజయం సాధించింది.  
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  ఆర్‌ఎల్‌.డి, బి.ఎస్‌.పి, ఎస్‌.పిలు కలిసి కేవలం 15 స్థానాలు మాత్రమే చేజిక్కించుకోగా, బీహార్‌లో ఆర్‌.జె.డి, జె.డి.యు, కాంగ్రెసులు ఒక్క స్థానానికే పరిమితమయ్యాయి.   ఈ విషయం ఎవరికి అర్ధమైనా కాకున్నా  రాహుల్‌ గాంధీకి మాత్రం   పూర్తిగా బోధపడిందని అర్ధమౌతున్నది.  ప్రతిపక్షాలు ఈ సారైనా ప్రజల దగ్గరికి ఒక విజన్‌తో వెళ్లాలి. ఈ విజన్‌ బీజేపీ విజన్ కు ప్రత్యామ్నాయంగా ఉండాలి. అది లేకుండా కలిసి కట్టుగా జనం ముందుకు వెళ్లినా ఫలితం ఆశించిన విధంగా ఉండదని ఆయన ఇప్పటికే తేటతెల్లం చేశారు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్ వాదీ పార్టీ, డి.ఎం.కె, వామ పక్షాలు బీజేపీకి బద్ధ శత్రువులే అయినప్పటికీ, 2014 నుంచి ఈ పార్టీలు ప్రతిపక్షాల ఐక్యతకు దూరంగా  ఉంటున్నాయి.  

రాహుల్‌ గాంధీ చెప్పినట్టు, ప్రతిపక్షాల ఐక్యత అనే ది సీట్ల పంపకం స్థాయి  దాటి లోతుకు వెళ్లాలి. కానీ బీజేపీ వ్యతిరేక కూటమికి  సారథి ఎవరు అనే విషయంలోనే విపక్షాల మధ్య బేధాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. ఇప్పటికింకా ఐక్యతా యత్నాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు కానీ,  విపక్ష ఐక్య కూటమికి నాయకుడెవరన్న విషయంలో చర్చోపచర్చలు అయితే మొదలైపోయాయి. మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌  సహా పలువురు నాయకులు ఈ రేసులో మేమున్నామంటూ అప్పుడే సంకేతాలు, సందేశాలు పంపుతున్నారు. 

 దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పరిస్థితి అధ్వానంగా,ఉన్నప్పటికీ విపక్షాల ఐక్యతకు సారథ్యం విషయంలో మాత్రం  కాంగ్రెస్‌ నేనున్నానంటూ అగ్రతాంబూలం కోసం రెడీ అయిపోతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేవలం మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న సంగతి విదితమే.  అక్కడ కూడా సార్వత్రిక ఎన్నికల్లో విజయాలు సాధిస్తుందన్న విశ్వాసం అయితే ఆ పార్టీలో గట్టిగా కనిపించడం లేదు. ఈ కారణంగానే ప్రతిపక్షాలు కాంగ్రెస్ నాయకత్వంపై పెద్దగా విశ్వాసం కనబరచడం లేదు. ఇప్పటికిప్పుడైతే విపక్షాల ఐక్య కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వాన్ని  మెజారిటీ పక్షాలు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా  ప్రతిపక్షాల ఐక్యత గురించి ముందుగా ప్రస్తావించారు. ఆయన ప్రతిపాదనకు, ఆయన చెబుతున్న డిఫరెంట్ విజన్ అంశానికీ విపక్షాల నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

 ప్రతిపక్షాల మధ్య ఉన్న రాజకీయ వైవిధ్యాలను చక్కదిద్ది, వాటిని ఒకే తాటి మీదకు తీసుకురావడానికి కాంగ్రెస్‌కు లేదా రాహుల్‌ గాంధీకి ఉన్న అర్హతలేమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాలలో సర్క్యలేట్ అవుతోంది. సొంత పార్టీలో విభేదాల పరిష్కారానికే చెమట్లు కక్కుతున్న కాంగ్రెస్ ఇక విపక్షాల మధ్య రాజకీయ ఐక్యత ఏ విధంగా తీసుకురాగలదని పరిశీలకులు అంటున్నారు. ఉదాహరణగా తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరి పాకాన పడ్డ విభేదాల పరిష్కారంలో కాంగ్రెస్ అధిష్ఠానం వైఫల్యాన్ని చూపుతున్నారు. 

By
en-us Political News

  
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.