కాంగ్రెస్ కోటను ఖర్గే కాచుకుంటారా?

Publish Date:Oct 26, 2022

Advertisement

గెలవంగానే సరిపోదు ముందుంది ముసళ్ల పండగ అన్నాడు పూర్వం ఒక పంచాయితీ ఎన్నికల్లో ఓడినాయన.  కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఎన్నికయినంత మాత్రాన పార్టీలో అన్నీ తానై చేసేదాని కంటే మేడమ్ గారి మాట వింటూ  వ్యూహాత్మకంగా ముందడుగు వేయాల్సి వస్తుందేగాని తన బుర్రపెట్టి అడుగు ముందుకు వేయడానికి అంతగా అవకాశం ఉండదని ఖర్గే గెలిచిన తర్వాత రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఇందులో నిజానిజాలు, వాస్తవాలు ఎంత ఉన్నప్పటికీ, త్వరలో రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్ని కల్లో పార్టీని గెలిపించాల్సిన అత్యవసర బాద్యత ఖర్గే నెత్తిన పడింది. పదవిలోకి రాగానే కాస్తంత విశ్రాం తికి తావు లేకుండా ముంచుకువస్తున్న ఎన్నికలు ఖర్గే నాయకత్వ పటిమను  పరీక్షిస్తాయన్నది వాస్తవం. వీటి కంటే  ఆ తర్వాత 2024 ఎన్నికలు పార్టీకి దేశంలో ప్రతిష్టను నిలబెట్టే పని మాత్రం పూర్తిగా బాధ్యతవహించాల్సి వస్తుంది. ఏది ఎటువచ్చినా రాయి పడేది మాత్రం పార్టీ అధ్యక్షునిగా ఖర్గే మీదే మరి. 

గతవారం పార్టీ ఎన్నికలో గెలిచి సోనియా నుంచి సర్టిఫికెట్ తీసుకోవడంతో పూర్తి బాధ్యతలు స్వీకరిం చినట్లయింది. ఇక 80 ఏళ్ల కర్ణాటకా కి చెందిన ఈ సీనియర్ నాయకుడికి పరీక్షలు చాలానే ఉన్నాయి. వాటిలో తన పంథాలో ముందుకు నడుస్తారో, అనాదిగా వస్తున్న రబ్బర్ స్టాంప్ పరంపరనే అనుసరిస్తారో చూడాలి. కానీ గాంధీ కుటుంబేతర వ్యక్తి గా పార్టీ పగ్గాలు చేపట్టినందుకు దాదాపు పార్టీలో సీనియర్లు, యువ నాయకుల మద్దతు ఉంటుంది. అయితే ఆ పదవి ఆయన్ను వెదుక్కుంటూ వచ్చిం దని, తన సత్తాతో ఖర్గే నిరూపించుకోవాల్సి ఉంది. 

ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో ఓటర్లను పూర్తిగా తమ పార్టీ వేపు మొగ్గుచూపేలా చేయడం అన్నది చిన్నపాటి టాస్క్ కాదు. నవంబర్ 12న జరిగే ఎన్నికల్లో ఆయన సత్తాను హిమాచల్ ఓటరు కాంగ్రెస్ నుంచి దూరం కాకుండా చూసుకోవాలి. నిన్నటి వరకూ సోనియా గాంధీని అభిమానించి ఓటువేస్తు న్నవారు ఇపుడు ఖర్గేను చూసి వేస్తారా అనేది కొంత అనుమానం. ఎందుకంటే, చాలా ప్రాంతాల్లో గాంధీ కుటుంబం మీదనే పార్టీ నడుస్తున్నది. అదే భావన ప్రజల్లో కొనసాగుతోంది. కనుక ఆ కుటుంబేతరులు పార్టీ పగ్గాలు పట్టగానే వారు వెంటనే సరేననే స్తారనీ అనుకోలేము. ఇలాగే గుజరాత్ కూడా ఎన్నికలకు సిద్ధపడుతోంది. ఇది ప్రధాని మోదీ స్వరాష్ట్రం.  ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించుకోగలగితే ఖర్గే మొనగా డనే అనిపించుకుంటారు. ఇక్కడ బీజేపీకి బలం తగ్గిందనే అభిప్రా యాలూ ఉన్నాయి గనుక కాంగ్రెస్కు అవకాశాలు ఉండవచ్చు. డిసెంబర్లో ఫలితాలు వచ్చేవరకూ ఓటరు మనసులో మాట తెలియదు.

ఇక 2023లో ఖర్గేకు అసలు సిసలు పరీక్ష ఉంది. అప్పుడు ఏకంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కూడా ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది.  మరోవంక ఈ కీలక ఎన్నికలు లెక్కలోకి తీసుకునే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారన్న అభి ప్రాయాలూ ఉన్నాయి. పార్టీ పగ్గాలు ఖర్గే పట్టినప్పటికీ తొమ్మిది రాష్ట్రాల్లో పార్టీ గెలిచేందుకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంతో ఉపయోగపడు తుందన్న అభిప్రాయాలే వినపడుతున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతరుల్లో ముందుగా సీతారామ్ కేసరి ఉన్నారు. 1998లో పదవి నుంచి ఆయన్ను  తొలగించి సోనియా గాంధీ పార్టీ పగ్గాలు అందుకున్నారు.  ఇక ఇప్పుడు ఖర్గే చేపట్టారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెగడంతో కాంగ్రెస్ పట్టు తప్పుతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇఫుడు ఖర్గే తలకు ఆ సమస్యను పరిష్కరించుకోవడం కూడా పట్టుకుంది. గాంధీ కుటుం బేతరునిగా ఆయన పార్టీ పగ్గాలు పట్టుకున్నంత మాత్రాన అంత సులువుగా జరిగిపోతాయన్నది ఊహించడమూ కష్టమే.

By
en-us Political News

  
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.