ఇటు చూస్తే స్టాలిన్.. అటు చూస్తే మోడీ .. కేసీఆర్ కు కింకర్తవ్యం!

Publish Date:Jul 26, 2022

Advertisement

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, ఈ పోలిక అంత ఆప్ట్ కాదేమో కానీ,  ఒక దానితో ఒకటి ముడి వేసి, అటూ ఇటూ అవడం కంటే  దేనికదే అన్నట్లుగా నడచు కుంటే, ఇదిగో ఇలాంటి గిల్లికజ్జాలు, చిల్లర తగవులు  రావంటారు. ఒకరేమో దేశ ప్రధానమంత్రి, ఇంకొకరేమో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ఇద్దరు ఎడ ముఖం పెడ ముఖంగా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేక పోవడం వారికేమో గానీ, చూసే వాళ్ళకు , అస్సలు బాగోదు. బాగుండడం బాగోకపోవడం విషయం పక్కన పెట్టినా, ఆ కారణంగా  అసలే అంతంత మాత్రంగా ఉన్న కేంద్ర రాష్ట్ర సంబధాలు మరింతగా బిగుసుకు పోయే ప్రమాదం ఉందని, నిజానికి అదే జరుగుతోందని అంటున్నారు.

ఫలితంగా పరస్పర ప్రయోజనాలే కాదు, పరిపాలనా పరంగా సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వ సంబంధాల విషయాన్నే తీసుకుంటే రెండు ప్రభుత్వాల మధ్య ప్రతి రోజు ఏదో ఒక వివాదం రగులుతూనే వుంది. రోజులు వారాలు కాదు, ఏకంగా నెలల తరబడి తగవులు సాగినా చివరకు ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. హళ్లికి హళ్లి  సున్నకు సున్నా.  వరి వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

తెలంగాణకు ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలోనూ రాజకీయంగా కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించే ప్రభుత్వాలే ఉన్నాయి. నిజానికి ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశంలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత కు గానూ, 18 రాష్ట్రాలలో మాత్రమే బీజేపీ అధికారంలో వుంది. మిగిలిన  రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో లేదు. కాంగ్రెస్, తృణమూల్ , లెఫ్ట్ ఫ్రంట్, ఆప్ ఇలా వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయినా, రాజకీయంగా ఎవరిని ఎవరు ఎంతగా విమర్శించుకున్నా వ్యక్తిగత ద్వేషం పెద్దగా ఎక్కడ కనిపించదువు. ఒక కేసీఆర్, ఒక మమతా బెనర్జీ వంటి ఒకరిద్దరు ముఖ్యమంత్రుల విషయంలో తప్పించి మిగిలిన వారి విషయంలో ఇలాంటి వ్యక్తిగత ద్వేషం ఎక్కడా లేదనే చెప్పవచ్చును.

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత సంవత్సర కాలంలో , అధికార అనధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు నాలుగైదు సార్లు రాష్ట్రానికి వచ్చారు. అయినా, ఏ ఒక్క సందర్భంలోనూ  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకలేదు. వీడ్కోలు చెప్పలేదు. ప్రోటోకాల్ పాటించలేదు. మరోవంక గవర్నర్ విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు అదే విధంగా వుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇటు గవర్నర్ తో అటు కేంద్ర ప్రభుత్వంలో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అన్నట్లుగా  కయ్యానికి కాలు దువ్వడమే కనిపిస్తోంది.  

అదలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి ఎదురుపడకుండా అయితే తప్పించుకున్నారు, కానీ, రేపు జూలై 28 న చెన్నైలో ప్రధాని మోడీని, ఎదురుగా పేస్ చేయక తప్పేలా లేదు. విషయం ఏమంటే, జూలై 28న చెన్నైలో ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. ఈ పోటీలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. ఇదే ప్రారంభ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రత్యేకంగా ఒక ఎంపీని హైదరాబాద్ పంపి మరీ, కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్  ఒకే చెప్పేశారు. తప్పకుండ్ వస్తానని మాట కూడా ఇచ్చేశారు. అయితే, అప్పటికీ అ పోటీలను ఎవరు  ప్రారంభిస్తారనే విషయ  ఖరారు కాలేదో ఏమో కానీ, ఇప్పడు తాజాగా ఒలింపియాడ్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారని అధికారికంగా ప్రకటించడంతో,కేసీఆర్ మీమాంసలో పడ్డట్టు తెలుస్తోంది. స్టాలిన్ కోసం వెళ్ళా లా, మోడీ కోసం మానేయాలా ? అనే విషయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.