రాజకీయ కదనరంగంలో కవిత నెగ్గుకొస్తారా?

Publish Date:Apr 24, 2026

Advertisement

ఉద్యమ నేత కూతురు సక్సెస్ అవుతారా?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. ఈ గడ్డ మీద ఎన్నో రాజకీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి. తెలంగాణ తర్వాత కూడా ఓ పార్టీ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది. అవన్నీ.. కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ, కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ మాత్రం కొందరికి చరిత్ర సృష్టించబోయేదిగా కనిపిస్తోంది. మరి కొద్ది గంటల్లో అంటే శనివారం (ఏప్రిల్ 25)  ఉదయం పదిగంటలకు కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు.  కవిత పార్టీ ఎజెండానే ఆమె ఫేట్ డిసైడ్ చేయబోతోంది. ఉద్యమ నేత  కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. కవిత సంకల్పం గట్టిదే అయినా.. తెలంగాణలో మరో పార్టీ మనుగడకి అవకాశం ఉందా?  కేసీఆర్‌లాగే.. ఆయన బిడ్డని తెలంగాణ ఆదరిస్తుందా?  కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ముందున్న రాజకీయ సవాళ్లేంటి? అన్నవి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రస్థానం ఎలా ఉండబోతోంది? ఇదే.. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్న ప్రశ్న. ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం వరకు, ఆపై పదేళ్ల పాలన దాకా.. గులాబీ జెండా నీడన ఎదిగిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు అదే తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే..  ఆమె అడుగులు పూల బాటలో సాగుతాయా? సవాళ్ల సుడిగుండాల్లో చిక్కుకుని తడబడతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ గడ్డ.. రాజకీయ చైతన్యానికి మారుపేరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడెన్నో ప్రాంతీయ పార్టీలు భావోద్వేగాల మధ్య పుట్టాయి. చివరికి మనుగడ సాగించలేక కాలగల్భంలో కలిసిపోయాయి. ఇంకొన్ని.. జాతీయ పార్టీలో విలీనమయ్యాయి. ఈ క్రమంలో.. కవిత పెట్టబోయే పార్టీ ఈ విధిని, గత చరిత్రను ఎలా అధిగమిస్తుందనేదే.. అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న.  కల్వకుంట్ల కవితకు.. కేవలం కేసీఆర్ కుమార్తెగానే కాకుండా..  తనకంటూ సెపరేట్ ఫైటర్ ఇమేజ్ ఉంది. బతుకమ్మని ప్రపంచ వేదికపై నిలబెట్టి, సాంస్కృతిక సారథిగా మహిళల మనసులు గెలిచారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి వివాదాలు చుట్టుముట్టినా, జైలుకెళ్లాల్సి వచ్చినా, వెనక్కి తగ్గకుండా పోరాట పటిమని ప్రదర్శించారు. ఇది..  ఆమెకు క్యాడర్‌లో ఓ ఫైటర్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. తండ్రి కేసీఆర్‌కు ఏమాత్రం తగ్గకుండా, ఎలాంటి సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడటం, జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటం.. కవితకు ఉన్న అదనపు బలాలు. 

అయితే..  కొత్త పార్టీ పెట్టాలి, ఓ కొత్త చరిత్ర సృష్టించాలనే సంకల్పం ఎంత గట్టిదైనా.. గ్రౌండ్‌ లెవెల్‌లో సౌండ్ మరోలా ఉంటుంది. ఈ క్రమంలో.. కవిత ఎదుర్కోబోయే సవాళ్లు కూడా కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం.. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే సర్వస్వం. కవిత కొత్త పార్టీని ప్రకటించాక.. అది బీఆర్ఎస్ ఓట్ బ్యాంకుని చీలుస్తుందా? మరో పార్టీ ఉనికిని దెబ్బకొడుతుందా? అనేదే సస్పెన్స్‌గా మారింది. మరోవైపు గులాబీ క్యాడర్ కూడా ఎవరి వైపు ఉండాలనేది తేల్చుకోవాల్సిన తరుణం ఇది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అటు బీఆర్ఎస్ మరోసారి అధికారం దక్కించుకు నేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా ఒక్కసారైనా తెలంగాణలో పాగా వేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఈ  జాతీయ పార్టీల మధ్య.. ఓ ప్రాంతీయ శక్తిగా కవిత తన ఉనికిని, బలాన్ని చాటుతారా? లేదా? అన్నదే.. ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇలాంటి డౌట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఎన్ని ఉన్నా.. కవిత మాత్రం తన పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఎందుకంటే, తెలంగాణ ఆడబిడ్డగా, ఈ ప్రాంతపు మహిళా నేతగా తను పెట్టబోయే పార్టీకి.. జనం నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నారు. ముఖ్యంగా.. తెలంగాణలో మహిళా ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. కవిత.. మహిళా సమస్యలు, తెలంగాణ సంస్కృతిని ప్రధాన ఎజెండాగా తీసుకునే అవకాశం ఉంది. అయితే, అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలని ఆకట్టుకుంటున్న ప్రధాన పార్టీలను కవిత ఎలా ఢీకొంటారనేదే ఉత్కంఠ రేపుతోంది. 

తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్‌కు  ఓ ఇమేజ్ ఉంది. ఆ ట్యాగే.. ఆయన్ని కాపాడుతోంది. కవితకు ఆ స్థాయి గుర్తింపు రావాలంటే, తెలంగాణ భవిష్యత్ కోసం ఆమె దగ్గరున్న విజన్ ఏంటనేది ముఖ్యం. ఇప్పటికే, ప్రజల్లో తనపై ఉన్న ఆరోపణలను పటాపంచలు చేసి, క్లీన్ చిట్ ద్వారా   జనం నమ్మకాన్ని గెలుచుకున్నారు. మళ్లీ పక్కా తెలంగాణ సెంటిమెంట్‌ని రగిలిస్తారా? మరేదైనా మంత్రం వేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ సమాజం కూడా భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తుంది. కవిత ఎజెండా గనక ప్రజల్లోకి బలంగా వెళితే, ఆమె ఓ కొత్త పొలిటికల్ ఆల్టర్నేట్‌గా ఎదిగే  అవకాశం ఉంది. ముఖ్యంగా.. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆమెకు పట్టు ఉండటం కొంతవరకు కలిసొస్తుందనే వాదన వినిపిస్తోంది. కవిత వేస్తున్న ఈ కొత్త అడుగు.. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అవుతుందా? బీఆర్ఎస్ ఓటు బ్యాంకుని చీల్చడానికే పరిమితమవుతుందా? అన్నది.. పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించే ఎజెండాను బట్టి డిసైడ్ అవుతుంది. కల్వకుంట్ల కవిత వేస్తున్న అడుగులు.. సర్వోదయ తెలంగాణ నినాదంతో ఆమె వస్తున్నా.. తెలంగాణ ప్రజలు ఆమెని కేసీఆర్ కూతురిగానే చూస్తారా? స్వతంత్ర నాయకురాలిగా ఆదరిస్తారా? అన్నది.. అతి త్వరలోనే తేలిపోతుంది.

By
en-us Political News

  
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.