జగన్ వ్యూహం ఇదేనా? కాంగ్రెస్ తో దోస్తీ కవచం అవుతుందా?

Publish Date:Aug 17, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉండగా ప్రజాపీడన పాలన సాగించారు. అందుకు ఫలితంగా అధికారం కోల్పోయారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా వైసీపీ విధానాలు మాత్రం మారలేదు. జగన్ అదే ప్రజా పీడన పంధాతో అధికారం లేకపోయినా రాష్ట్రా అభివృద్ధిని అడ్డుకోవడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ప్రముఖ పారిశ్రామిక సంస్థలను ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా నెగటివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. 

ఇక మరో వైపు తన మెడపై వేళాడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. ముందు చూపుతో జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఆయన ఇండియా కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్లడం వెనుక ఉన్నది ఇదే వ్యూహమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఆయన ఇటీవల ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సమాజ్ వాదీ, తృణమూల్, శివసేనలకు చెందిన నాయకులు హాజరై జగన్ కు మద్దతు పలికారు. ఒక వైపు బీజేపీతో తన రహస్య మైత్రిని కొనసాగిస్తూనే.. మరో వైపు విపక్ష కూటమితో కూడా చేతులు కలిపేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న వ్యూహం ఒక్కటే. రాజకీయంగా అధికారం అన్నది ఇప్పట్లో కనీసం ఆలోచించడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండటంతో కనీసం కేసుల నుంచైనా రక్షణ ఉంటే చాలన్న భావనతో జగన్ జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు. 

దీనికి తోడు బీజేపీకి రాజ్యసభలో  బలం లేదు కనుక తన పార్టీ సభ్యుల మద్దతు కోసం ఆ పార్టీ తన విషయంలో అంటే తన కేసుల విషయంలో దూకుడుగా వెళ్లదన్న ధీమా జగన్ లో కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీకి వైసీపీ అవసరం ఉంది అనడం ఇందులో భాగమే. రాజ్యసభలో అవసరమైన ప్రతి సందర్బంలోనూ మద్దతు ఇస్తాం.. అందుకు ప్రతిగా మా అధినాయకుడి కేసుల విషయంలో మీ సహకారం కావాలన్న ప్రతిపాదనే ఉందని పరిశీలకులు అంటున్నారు.  తెలుగుదేశం పార్టీకి  పార్లమెంటులో 16 మంది ఎంపీలుంటే..  వైసీపీకి15 మంది ఎంపీలు ఉన్నారు. (రాజ్యసభలో 11, లోక్ సభలో 4) మేం ఎక్కడా తక్కువ కాదు అన్న సాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహమే ఉందని చెబుతున్నారు.  రాజ్యసభలో ఎన్డీయేకు అవసరమైన బలం లేనందున సహజంగానే వైసీపీకి కలుపుకొని వెళ్లేందుకు బీజేపీ  ప్రయత్నిస్తుంది. స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావడానికి కారణం కూడా  ఇదే. అయితే ఈ పరిస్థితి ముందు ముందు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే నెలలో 12రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో బీజేపీ సునాయాసంగా 11 స్థానాలను గెలుచుకుంటుంది. అప్పుడు ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ కు జగన్ పార్టీ ఎంపీల అవసరం ఉండదు.  ఇక జగన్ క్విడ్ ప్రోకో ప్రతిపాదనలను లెక్క చేయాల్సిన అవసరం ఉండదు.  

దీంతో జగన్ ఇక పూర్తిగా కాంగ్రెస్ కూటమితో చెట్టాపట్టాలేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం ఒక్కటే మార్గం. తన కేసుల విషయంలో సత్వర విచారణ ఆరంభమైతే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిని కావడం వల్లనే రాజకీయ వేధింపులు అంటూ ఎదురు దాడికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ లో కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులకు మార్గం సుగమం చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే జగన్ వ్యూహాలు సక్సెస్ అవుతాయా లేదా? అన్న సంగతి ముందు ముందు తేలుతుంది. మొత్తం మీద ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత తన కేసుల విషయంలో రాజకీయ కవచం లేకపోవడంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనీ, బయటపడే మార్గం కోసం డిస్పరేట్ గా వెతుకుతున్నారని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.