అవినాష్ రెడ్డిని జగన్ వదిలించేసుకుంటారా?

Publish Date:Nov 15, 2024

Advertisement

తన కోసం, తన బాగు కోసం పని చేసిన వారిని కూరలో కరివేపాకులా తీసి పారేయడం జగన్ కు అలవాటే. తన రాజకీయ ప్రస్థానంలో అలా జగన్ కోసం పని చేసి ఆ తరువాత ఆయన చేత అవమానాలు ఎదుర్కొని దూరమైపోయిన వారు ఎందరో ఉన్నారు. ప్రధానంగా తన కోసం, తాను ముఖ్యమంత్రి కావడం కోసం కాలికి బలపం కట్టుకని మరీ రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన సొంత చెల్లి షర్మిల, తాను అరెస్టైనప్పుడు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిన తల్లి విజయమ్మనూ అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఎలా పక్కన పెట్టేశారో రాష్ట్రం మొత్తం తెలుసు. చివరాఖరికి ఆస్తుల విషయంలో కూడా వారిపై కేసులు పెట్టి మరీ సాధిస్తున్నారు

జగన్. తన రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను వాడుకుని వదిలివేయడం జగన్ కు కొత్తేమీ కాదు.  తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల సహా పార్టీలో  జగన్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిచ్చెనలా వాడుకుని వదిలివేసిన వారెందరో కనిపిస్తారు. ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా ఎక్కడకు వెళ్లినా ఆ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మంత్రిని చేస్తా అంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్నడూ భావించలేదు. మంగళగిరిలో 2019 ఎన్నికలలో లోకేష్ పై గెలిచిన ఆర్కే  ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడు కూడా చిన్నబోయేంత పెద్దదిగా ఉంటుంది.  ఇక ఇప్పుడు తాజాగా జగన్ వదిలేసే, కాదు కాదు వదిలించుకునే  వ్యక్తి ఎవరంటే వైసీపీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్న పేరు కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 

ఔను వైఎస్ అవినాష్ రెడ్డిని వదిలించుకోవడం తప్ప జగన్ కు ఇప్పుడు మరో దారి కనిపించడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో బూతు పోస్టులు పెట్టిన వారిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. వారు ఏ కలుగులో దాగున్నా వెతికి పట్టుకుని చట్టం ముందు నిలుపుతోంది. కోర్టులు సైతం బూతు పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా దాఖలైన పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తప్పు చేసి బెయిలు అడిగితే ఎలా అని నిలదీస్తోంది. దీంతో ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అసభ్య, అసహ్య, అశ్లీల పోస్టులతో ప్రత్యర్థి పార్టీ నాయకులు, వారి కుటుంబీకులను వేధించి, మనో వేదనకు గురి చేసిన వారి గుండెళ్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. క్షమాపణలు చెప్పుకునో, కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకునే తప్పించుకునే వీలు లేదని అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తాను అసభ్య పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారంటూ ఇటీవల అరెస్టైన వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో  తాను అసభ్య పోస్టుల వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడరి వర్రారాఘవరెడ్డి కుండబద్దలు కొట్టడంతో ఇప్పుడిక జగన్ కు ఆయనను వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

అలా కాకుండా ఇంకా అవినాష్ ను చిన్న పిల్లోడు, సాత్వికుడు అంటూ వెనకేసుకుని వస్తే.. స్వయంగా జగన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అసలు వైఎస్ అవినాష్ రెడ్డిని వెనకేసుకుని రావడం వల్లే కంచుకోట లాంటి కడపలో వైసీపీ దెబ్బతింది.  వర్రా వాంగ్మూలంతో జగన్ తల్లిని, చెల్లిని అసభ్యంగా దూషిస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి పిఎ, అతని వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారని సందేహాలకు అతీతంగా తేలిపోయింది. అప్పటి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇన్ చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ ఉన్నారని వర్రా  వాంగ్మూలంతో తేలిపోవడంతో ఇక జగన్ వారిని పట్టించుకునే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రానున్న రోజులలో జగన్ స్వయంగా తన తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇప్పటికే  సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిని వైసీపీ వెనకేసుకు రాదని, వారిని సమర్ధించదనీ మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ విస్పష్టంగా చెప్పేశారు. జగన్ కూడా ముందు ముందు అదే చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పటికే తన ఐదేళ్ల అరాచక పాలనను ఛీ కొడుతూ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని ఇచ్చిన జనం ఇక ముఖం మీదే ఛీ కొట్టే పరిస్థితి వస్తుందని అంటున్నారు.  

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.