అసెంబ్లీకి జగన్.. పోరాటమా.. పలాయనమా?!

Publish Date:Jul 19, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ సమావేశాలు జులై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ హాజరు కానున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే జగన్ హాజరుపై అనుమానాలు ముప్పిరి గొంటూనే ఉన్నాయి. జగన్ ఐదేళ్ల పాలనలో వివిధ రంగాలలో జరిగిన విధ్వంసంపై వరుస శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉంది.

అయితే వినుకొండ ఘటన, పుంగనూరులో ఉద్రిక్తతల వేనుక ఉన్న కుట్ర కోణాన్ని గ్రహించి శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల వేదికను అసెంబ్లీకి మార్చారు. అసెంబ్లీ వేదకగానే శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదలకు చంద్రబాబు నిర్ణయించారు. అలాగే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారని పేర్ని నాని ప్రకటన నేపథ్యంలో జగన్ ముందే, సభ సాక్షిగా జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కళ్లకు కట్టేందుకు రెడీ అయ్యారు.

దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో పునరాలోచనలో పడ్డారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనీ, అలాగే వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలనీ కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆ లేఖపై స్పీకర్ ఇంకా స్పందించలేదు. అయితే జగన్ కు విపక్ష నేత హోదా, వైసీపీకి విపక్షంగా గుర్తింపు ఇచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా జగన్ వైఖరే కారణమని అంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం విషయంలో చంద్రబాబు చాలా ఉదారంగా జగన్ కు మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. అయితే దానిని జగన్ పాజిటివ్ గా తీసుకోలేదు. పైపెచ్చు.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. తన పార్టీ సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ కూడా ఆగలేదు. బయటకు వెళ్లి తీరిగ్గా ప్రతిపక్ష నేతగా తనకు సముచిత గౌరవం ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా గుర్తింపు రావడానికి అవసరమైనంత మంది సభ్యులు లేరన్న విషయం జగన్ కు తెలుసు. అయినా ఏవో కారణాలు చెబుతూ తమది ప్రధాన ప్రతిపక్షమేనంటూ వాదిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో జగన్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించేందుకు స్పీకర్ ఇష్టపడే అవకాశం కనిపించడం లేదు. విపక్ష హోదా లేకుండా సభకు వస్తే.. సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే జగన్ కు ట్రీట్ మెంట్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం ఖాయమని అంతా భావించారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై గళమెత్తడానికి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వినుకొండ ఘటన, పుంగనూరు ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని ఆయన రాజకీయం చేయడానికి రెడీ అయిపోయారు. ఆ రెండు సంఘటనలకూ కారణం వైసీపీయే అయినా, పెనుకొండ ఘటన వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని స్పష్టంగా తేలినా, పుంగనూరు ఉద్రిక్తతకు కారణం మిథున్ రెడ్డి ముందస్తు సమాచారం లేకుండా పుంగనూరుకు రావడం అ    ని పోలీసులు తేల్చే సినా.. జగన్ తెలుగుదేశం ప్రభుత్వ వేధింపులు, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం అంటూ గగ్గోలు పెడుతున్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై మోడీకి వివరించడానికి అప్పాయింట్ మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అసెంబ్లీకి వెళ్లి గట్టిగా గళం వినిపించాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు శాంతి భద్రతలపై అసెంబ్లీ వేదికగానే శ్వేతపత్రం విడుదలకు నిర్ణయించుకోవడం జగన్ కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.

తన ఎదుటే తన ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను తిలకించాల్సిరావడం జగన్ కు ఇబ్బందికరమే. ఖండించడానికి కానీ, సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి కానీ తగినంత బలం లేదు. ఉన్నవారెవరూ గట్టిగా మాట్లాడగలిగేవారు కాదు. దీంతో సభకు వెళ్లి అవమానపడటం కంటే గైర్హాజరవ్వడమే మేలని భావిస్తున్నారు. అయితే అలా చేస్తే పలాయనం చిత్తగించానన్న విమర్శలు వెల్లువెత్తుతాయన్న భయం వెంటాడుతోంది. అంటే అసెంబ్లీ సమావేశాల హాజరు విషయం జగన్ కు ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తరారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.