సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం?.. అసలు వస్తారా?

Publish Date:Jun 21, 2024

Advertisement

 అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం (జూన్ 21) ప్రారంభం అయ్యాయి.  ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమంలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ జగన్ సభకు వచ్చే అవకాశాలు లేవని ఆ పార్టీ వర్గాల ద్వారానేసభకు జగన్ వస్తారా? రారా? అనేది వేచి చూడాలి. ఎందుకంటే గత ఐదేళ్లుగా ఫ్రంట్ సీటులో కూర్చున్న జగన్  ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఎక్కడో వెనుక కూర్చోవలసి ఉంటుంది. గతంలోలా తన తరఫున సభలో గోల చేయడానికి, అనుచిత వ్యాఖ్యలతో ప్రత్యర్థులను నొప్పించడానికి మంది కూడా లేరు. దీంతో ఆయన సభకు హాజరయ్యే అవకాశాలు దాదాపు మృగ్యమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఇలా ఉండగా
  తెలుగుదేశం సభ్యలువెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు  అందరూ కూడా పసుపు చొక్కాలు ధరించి వెంకటపాలెం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. 

కాగా  దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. గత ప్రభుత్వం శాసన సభను కౌరవ సభగా మార్చేసిందని నిండు సభలో విమర్శలు గుప్పించి కన్నీటితో సభ నుంచి నిష్క్రమిస్తూ మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెట్టి గౌరవ సభగా చేస్తానని చంద్రబాబు శపథం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ శపథాన్ని నెరవేర్చుకుని చంద్రబాబు సభలో  ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టారు. అదే విధంగా పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను బదులుగా జనసేన అధినేత తమ పార్టీ నుంచి పోటీ చేసిన 21 మందినీ గెలిపించుచని ఘనంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.