యువ‘గళం’ నొక్కేస్తారా?

Publish Date:Jan 6, 2023

Advertisement

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యవగళం పేరిట నిర్వహించే పాదయాత్రకు మరోవైపు.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వారాహి బస్సు యాత్రకు ఫూల్ స్టాఫ్ పెట్టేందుకు వైయస్ జగన్ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? అందుకే అర్థరాత్రి జీవో నెంబర్ 1 తీసుకు వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించగా.. జనవరి ఒకటోవ తేదీన గుంటూరులో జరిగిన తోపులాటలో ముగ్గురు మరణించారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభల్లో జరుగుతున్న విషాద ఘటనలపై జగన్ సర్కార్ ఆగమేఘాల మీద స్పందించింది.   రాష్ట్రంలో రోడ్ షో, సభలు, ర్యాలీలకు చెక్ పెడుతూ,  జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చింది. ఈ జీవో ప్రకారం ఎంపిక చేసిన  ప్రదేశాల్లోనే సభలు, సమావేశాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.  అయితే ఈ జీవోపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. లోకేష్ పాదయాత్రపై ప్రభుత్వ ఉత్వర్వులు అమలు కానున్నాయా? జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ బస్సు యాత్రకు ఈ నిషేధం వర్తించనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. 

ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దాదాపు 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడమే కాదు.. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. అయితే లోకేష్ పాదయాత్ర రహదారులపై జరగనుంది. అంతేకాదు.. వేలాది మంది ఈ పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి అడుగులు వేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో.. హాజరైన ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగించాల్సి ఉంటుంది. అలాంటి వేళ.. లోకేశ్ పాదయాత్రకు అనుమతి లభిస్తుందా? లేదా? అంటే సందేహమే అని వారు స్పష్టం చేస్తున్నారు. 

దాదాపు 4 వేల కోలోమీటర్ల మేర జరగనున్న ఈ పాదయాత్రలో చాలా చోట్ల లోకేశ్.. ప్రజలతో మాట్లాడతారు.. పలు చోట్ల ఆయన సభలు ఏర్పాటు అవుతాయి.   అందుకోసం ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. అందుకు అనుమతులు కావాలంటే ఇస్తారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.

ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  బస్సు యాత్రకు తాజాగా విడుదలైన జీవో ప్రకారం.. అనుమతి లభిస్తోందనే ఆశలు అయితే లేవని రాజకీయ విశ్లేషకలు స్పష్టం చేస్తున్నారు.  ఓ వేళ.. ఒకరి పాదయాత్రకు.. మరొకరి బస్సు యాత్రకు అనుమతి ఇచ్చినా.. ఆవి ప్రారంభమైన కొద్ది రోజులకే వైయస్ జగన్..ముందుస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు.

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.