కాంగ్రెస్ చింతన్ శిబిర్.. ఆత్మవిమర్శ సవ్యదిశలోనే జరిగిందా?
Publish Date:May 16, 2022
Advertisement
చింతన్ శిబిర్ లో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది.ఉదయ్ పూర్ వేదికగా జరిగిన మూడ్రోజుల కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో ప్రజలతో పార్టీ బంధం తెగిపోయిందని రాహుల్ గాంధీ అంగీకరించారు. ప్రజలతో పార్టీ బంధాన్ని పునరుద్దరించుకోవడం కోసం, దేశవ్యాప్తం గా మళ్లీ బలం పుంజుకోవడం కోసం, దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకోవడం కోసం పాదయాత్రలు, ఆందోళన లకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్ణయించింది. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై జూన్ 15నుంచి అన్ని జిల్లాల్లో జనజాగరణ్ యాత్ర రెండవ దశ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మొత్తంగా ఇంత కాలం ప్రజలకు దూరంగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్ ఇక కార్యక్రమాలు, ఆందోళనల ద్వారా ప్రజలకు చేరువ కావాలన్న సంకల్పం మంచిదే. అయితే ప్రజలు ఎందుకు దూరమ్యారో..వారిని ఎలా దరికి చేర్చుకోవాలన్న ఆత్మ పరిశీలన జరిగిన దాఖలాలు చింతన్ శిబిర్ లో కనిపించలేదు. దేశవ్యాప్తంగా బలం పుంజుకోవడానికి, దూరమైన వర్గాలను దరిజేర్చుకునేందుకు కాంగ్రెస్ యాత్రలుచేపట్టడం మంచిదే అయినా..ప్రజలకు ఏంచేయబోతున్నారో.. చెప్పేందుకు సిద్దంగా ఉండాలి. ప్రజల సమస్యలపై స్పస్టమైన అవగాహన, వాటి పరిష్కారం ఎలా అన్నదానిపై ఒక విజన్ కావాలి. రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌లో మూడ్రోజుల పాటు 'నవసంకల్ప్ చింతన్ శిబిర్' పేరిట కాంగ్రెస్ నిర్వహించిన మేధో మథన సదస్సు ఆదివారం ముగిసింది. 450 మందికిపైగా ప్రతినిధులు విస్తృతంగా చర్చించిన అంశాలను క్రోడీకరించి 'ఉదరుపూర్ డిక్లరేషన్' పేరిట ఆవెూదించారు. భావి కార్యాచరణను, సంస్థాగత సంస్కరణలను డిక్లరేషన్ లో ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రధాని వెూదీ హయాంలో సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యం దెబ్బ తిందని.. సామరస్యాన్ని పరిరక్షించేందుకు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అక్టోబరు 2న గాంధీ జయంతి నుంచి 'భారత్ జోడో యాత్ర' ఏడాదిపాటు ప్రారంభించాలని నిర్ణయించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై వచ్చే నెల 15 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో 'జనజాగరణ్ యాత్ర' రెండో దశను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ, లోకసేభ ఎన్నికలకు పార్టీని పూర్తి సన్నద్ధం చేసే 'నవ సంకల్ప్' రోడ్‌మ్యాప్‌ను కూడా 'డిక్లరేషన్' ఆవెూదించింది. అన్ని స్థాయుల పదవుల్లో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఇస్తున్న 20 శాతం ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పెంచాలని, ఉపకులాలకు కూడా అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చింతన్ శిబిర్ నిర్ణయించింది. నిజానికి ఈ వర్గాలన్నీ తొలుత కాంగ్రెస్ వెన్నంటే ఉన్నాయి. కానీ ప్రకటలనకే పరిమితం అయిన వీరి పురోభివృద్ది ఆచరణలో కానరాలేదు. కాలక్రమంలో ఈ వర్గాలన్ని క్రమంగా దూరం అవుతూ వచ్చాయి. దీంతో మళ్లీ ఈ వర్గాలను దగ్గరకు చేర్చుకునే అవసరం ఏర్పడింది. ఇందుకు సుదీర్ఘ ప్రణాళిక అవసరం. పార్లమెంటు, అసెంబ్లీల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, మహిళా రిజర్వేషన్ బి ల్లు కోసం పోరాడాలని.. బలహీనవర్గాలు, మైనారిటీలకు ఇచ్చే కోటాలో మహిళలకూప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే యువతకు పెద్దపీట వేసే దిశగా 2024 నుంచి లోకసేభ, అసెంబ్లీ ఎన్నికల్లో సగం టికెట్లు 50 ఏళ్లలోపు వారికే ఇవ్వాలని తీర్మానించింది. సంస్థాగతంగా చేయాల్సిన మార్పులకు సంబంధించి చింతన్ శిబిర్‌లో వివిధ కమిటీలు చేసిన సూచనలను పరిశీలించిన వర్కింగ్ కమిటీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అన్న నినాదంతో కొంతయినా కుటుంబ పెత్తనానికి కత్తెర వేశారు. పార్టీలో ఇది ఏ మేరకు అమలవు తుందన్నది చూడాలి. ప్రస్తుత కష్టనష్టాలను కచ్చితంగా అధిగమి స్తామని, ఇదే మన సంకల్పమని సోనియా ప్రకటించారు. ఇదంతా బాగానే ఉన్నా కొన్ని కీలక, సున్నిత విషయాల్లో వెూడీ తీసుకున్న నిర్ణయాలపై పార్టీ వైఖరి ఏమిటన్న విషయంపై చింతన్ శిబిర్ స్పష్టత ఇవ్వలేదు. కాశ్మీర్, ఉమ్మడి పౌరస్మృతి వంటి విషయాలు చర్చించలేదు. ప్రభుత్వరంగ సంస్థలను వెూడీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతున్న క్రమంలో దీనిని అడ్డుకోవడానికి ఏం చేయబోతున్నారో చర్చించలేదు. చెప్పలేదు. మొత్తంగా కాంగ్రెస్ ఉదయ్ పూర్ డిక్లరేషన్.. పార్టీలో మార్పులకు కాంగ్రెస్ హై కమాండ్ సిద్ధంగా ఉందని చాటిందే తప్ప కీలక అంశాల విషయంలో చర్చను దాటవేసింది.
http://www.teluguone.com/news/content/will-congress-chimtandibar-gains-peoples-trust-25-135983.html





