హర్మూజ్ ను మూసేస్తాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

Publish Date:Apr 17, 2026

Advertisement

హ‌ర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు ధ్యాంక్స్ కూడా చెప్పారు. ప్రపంచం మొత్తం ఈ పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేసింది. అయినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు  ఇసుమంతైనా సడలినట్లు కనిపించడంలేదు.  హర్మూజ్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే..  అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరింది.  హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్  తీవ్రంగా స్పందించింది.  

దిగ్బంధనం కొనసాగితే హ‌ర్మూజ్ జలసంధిని మ‌ళ్లీ మూసివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు  ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్  సామాజిక మాధ్యమ వేదికలో నిర్ణీత మార్గంలో, ఇరాన్ అనుమతితో మాత్రమే హ‌ర్మూజ్ జలసంధి గుండా ప్రయాణాలు సాగుతాయని పేర్కొన్నారు. అమెరికా దిగ్బంధనం కొనసాగితే    జలసంధి మూసేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.  అబద్ధాలతో అమెరికా యుద్ధం గెలవలేదని ఎద్దేవా చేశారు.  జలసంధి తెరిచి ఉంటుందా? లేదా మూసి ఉంటుందా? అనే విషయాన్ని క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయని, సోషల్ మీడియా కాదని ఘలీబాఫ్ ఆ పోస్టులో పేర్కొన్నారు.  

అంతకుముందు లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగుతున్నంత కాలం వాణిజ్య నౌకల రాకపోకలకు హ‌ర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. ఇరాన్‌తో తమ 'లావాదేవీ' పూర్తయ్యే వరకు నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని, అయితే ఈ ప్రక్రియ చాలా త్వరగా ముగుస్తుందని అన్నారు. దీనిపైనే.. ఘలీబాఫ్ ఫైర్ అయ్యారు.  ఈ నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ ను ఓపెన్ చేసినప్పటికీ  కార్యకలాపాలు ప్రారంభించడానికి వాణిజ్య నౌకా సంస్థలు వెనుకాడుతున్నాయి. 

By
en-us Political News

  
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రయాణికులు వైశాఖ పూర్ణిమ వేడుకల కోసం జల్జలా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. థవాంగ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్జలా వద్ద బురదతో కూడిన ఇరుకైన రోడ్డుపై జీపు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వాహనం జారిపోయి లోయలోకి దూసుకెళ్లింది.
ఆర్సీబీ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వేగాన్ని తెచ్చాడు. అతనికి తోడుగా జోస్ బట్లర్ (19 బంతుల్లో 39) మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్-ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు వికెట్ నష్టానికి 69 పరుగులు.
ప్రమాద సమయంలో పడవలో ఉన్న వారిలో 16 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీయగలిగారు. అయితే.. గాలి వేగం ఎక్కువగా ఉండటం, చీకటి పడటంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
మే డే(మే 1వ తేదీ) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు.
కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అతిపెద్ద న్యాయపరమైన అడ్డంకి ఎట్టకేలకు తొలగిపోయింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు.
కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (మే 1) శుక్రవారం పర్యటించనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రక్షణ రంగ పరికరాల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా ప్రపంచ దేశాలను శాసిస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఈ అరుదైన ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయనీ.. వీటిని సమర్థవంతంగా వెలికితీస్తే చైనాపై ఆధారపడటాన్ని భారత్ పూర్తిగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
బెంగళూరు శివార్లలో వెలుగుచూసిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన వైద్య విజయం నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.