జనసేనతో బీజేపీ కటీఫ్.. వైసీపీతోనే కలిసి వెళుతుందా?

Publish Date:Jan 20, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనాలంటే పొత్తులు అనివార్యం అన్న నిర్ణయానికి ప్రధాన పార్టీలు వచ్చేశాయి. ఈ విషయంలో మొదటి నుంచీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనని, ఈ విషయంలో అవసరమైతే ప్రధాని మోడీతో స్వయంగా మాట్లాడుతాననీ కూడా ప్రకటించారు. అయితే ఏపీలో ఇసుమంతైనా ఓట్ స్టేక్ లేని బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో ఒకింత ప్రాధాన్యత ఏపీలో రాజకీయంగా లభిస్తోంది.

ఈ నేపథ్యంలోనే జనసేన పవన్ కల్యాణ్ ను ఒక ట్రాప్ లో చిక్కుకునేలా గత మూడున్నరేళ్లుగా దిగ్బంధంలో ఉంచగలిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధం, అరాచకాలు పెరుగుతున్న నేపథ్యంలో జనసేనాని రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండాలన్న దానిపై ఒక క్లారిటీకి వచ్చేశారు. ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయనతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం.. రణస్థలితో సభలో మాట్లాడిన ఆయన తెలుగుదేశంతో కలిసి సాగనున్నట్లు దాదాపుగా స్పష్టత ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీని పూర్తిగా విస్మరించినట్లే కనిపించింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో కలిసి నడవాలా వద్దా అన్నది బీజేపీయే నిర్ణయించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇంత కాలం మిత్రపక్షంగా ఉన్నా జనసేనను బీజేపీ విస్మరిస్తే.. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన బీజేపీని ఇగ్నోర్ చేసింది. బంతిని ఆ పార్టీ కోర్టులోకే నెట్టేసింది.

తొలి సారి జనసేనాని ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటించినప్పుడు రాష్ట్రంలో 2014 నాటి పొత్తులు పొడుస్తున్నాయా అన్న చర్చ తెరమీదకు వచ్చింది.  జనసేన విశాఖ గర్జన సందర్భంగా  చోటు చేసుకున్న పరిణామాలు, పవన్ కల్యాణ్ ను హోటల్ కు పరిమితం చేసేలా ఆంక్షలు విధించడం తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించడమే కాకుండా.. ఆయన విశాఖ నుంచి వచ్చిన తరువాత స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయనతో కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంగా జనసేన మిత్ర పక్షం బీజేపీ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు ఖాయమని అంతా భావించారు.   ఈ సందర్భంగానే రాష్ట్ర పతి ఎన్నిక సందర్భంగా  బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ  బీజేపీపై ఎంత  ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా  ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడం,  చంద్రబాబుకు   12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం వీటన్నిటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు దగ్గరౌతున్నాయనడానికి పరిశీలకులు నిర్ధారణకు వచ్చేశారు. అాదే విధంగా `ఢిల్లీలో  మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి కేంద్రం నుంచి అందిన ఆహ్వానం మేరకు  చంద్రబాబు  హస్తిన వెళ్లడం, ఆ సందర్బంగా కొద్ది సేపు మోడీతో ముచ్చటించడాన్ని కూడా పరిశీలకులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనడానికి తార్కానాలుగా పేర్కొన్నారు.

అయితే.. ఏపీ బీజేపీలో మాత్రం తెలుగుదేశంతో మైత్రి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఇటీవల హస్తినలో జరిగిన  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీలో పొత్తులు వద్దని నిర్ణయించింది.  ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పొత్తులకు దూరం అని బీజేపీ ప్రకటించడమంటే వైసీపీకి సానుకూలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం 1 లేదా 1.5 శాతం ఓట్లతో బీజేపీ రాష్ట్రంలో సాధించేదీ, సాధించగలిగేదీ ఏమీ లేకపోయినా.. జనసేనకు దూరం జరగడం ద్వారా ఏపీలో వైసీపీ పట్ల బీజేపీ సానుకూలంగా ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.  పేరుకు సొంతంగా ఎదగడానికే పొత్తులకు దూరం అని చెబుతున్నా.. ఇప్పటి వరకూ కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీలోని జగన్ సర్కార్ కు అందిస్తున్న సహకారాన్ని గమనిస్తే బీజేపీ జగన్ పార్టీకి దగ్గరౌతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.