మళ్లీ బాంబులేస్తాం.. ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక!

Publish Date:Jun 17, 2026

Advertisement

అమెరికా, ఇరాన్ దేశాల శాంతి ఒప్పందంపై మళ్లీ నీలినీలు కమ్ముకున్నాయి.  ఇరు దేశాల మధ్యా గత కొంత కాలంగా తీవ్ర స్థాయిలో  ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరుపక్షాల మధ్య ఒక కీలకమైన ఒప్పందం కుదిరడంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యయి. అయితే ఇలా ఒప్పందం కుదిరిందన్నఆనందం అలా ఆవిరైపోయేలా అగ్రరాజ్యాధినేత.. మళ్లీ యుద్ధ గర్జనలు చేస్తున్నారు.  ఇరాన్‌తో   ఒప్పంద ముసాయిదా   తనకు నచ్చకుంటే.. ఆ దేశంపై మళ్లీ దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. ట్రంప్  ప్రకటనతో ఇప్పటికే ఎంతో సున్నితంగా ఉన్న పశ్చిమాసియా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ7  సదస్సు వేదికగా డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సు సందర్భంగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో కలిసి ట్రంప్ అంతర్జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సందర్భంగా  అమెరికా,  ఇరాన్ దేశాల మధ్య ప్రతిపాదిత శాంతి ఒప్పందం గురించి మీడియా ప్రశ్నలకు, ట్రంప్  స్పందించారు. అమెరికా-ఇరాన్ మధ్య కుదరబోయే ఈ డీల్ ఇంకా తుది రూపం దాల్చలేదని చెప్పిన ట్రంప్..  ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నడుస్తున్న చర్చలు  ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం   మాత్రమేనన్నారు, దీనిని పూర్తి స్థాయి ఒప్పందంగా భావించలేమన్నారు.  

అదే సమయంలో ఆయన ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు.  ఆ ఒప్పందం తనకు నచ్చకపోతే   ఇరాన్ పై మళ్లీ దాడులు చేస్తాం. వారి తలలపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు.  ట్రంప్ హెచ్చరిక అంతర్జాతీయ దౌత్య వర్గాలను విస్మయానికి గురి చేసింది.  

పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు ట్రంప్ వ్యాఖ్యలు ఆటంకం కలిగించేవిగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   ఇరాన్ అగ్రశ్రేణి నాయకత్వం ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఒప్పంద చర్చలు జరుగుతుండగానే, మరోవైపు సైనిక దాడులు,  బాంబుల వర్షం అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటూనే ఉంటుంది.
బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో రెండు, విశాఖపట్నం తీరంలో రెండు చొప్పున మొత్తం నాలుగు బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశ్వసిస్తోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు మ్యూచువల్ ఫండ్స్ (SIP)లలో నెలకు ₹12,500 చొప్పున 30 ఏళ్లు పెట్టుబడి పెడితే ఏ పథకం ద్వారా ఎంత ఎక్కువ లాభం వస్తుందో, ద్రవ్యోల్బణం ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి గణాంకాలతో తెలుసుకోండి.
తెలంగాణ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కోడి చెరువు భూములను పవన్ కల్యాణ్ అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను కూడా తారుమారు చేశారంటూ ఆన్‌లైన్ వేదికల్లో ప్రచారం జరిగింది. వైసీపీ, తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణల ఆధారంగా ఈ ప్రచారం ఊపందుకుంది.
సరికొత్త 2027 పోర్షే టైకాన్ (Porsche Taycan) ఈవీ అప్‌డేట్స్ వచ్చేశాయి. టెస్లా తరహా NACS ఛార్జింగ్ పోర్ట్, డ్రైవింగ్ కిక్ ఇచ్చే 8 స్పీడ్ వర్చువల్ E Shift గేర్లు, 105 kWh భారీ బ్యాటరీ మరియు AI వాయిస్ కంట్రోల్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అదరగొడుతోంది. ధర, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
విండోస్ మరియు లైనక్స్ సిస్టమ్స్‌లో మైక్రోసాఫ్ట్ 2011 సెక్యూర్ బూట్ కీస్ గడువు ముగుస్తోంది. జూన్ 2026 డెడ్‌లైన్ లోపు మీ కంప్యూటర్ మదర్‌బోర్డ్ సెక్యూరిటీని ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్ గైడ్ చూడండి.
అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యూఎస్‌సీఐఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. జూలై వీసా బులెటిన్‌లో ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత EB-2, EB-3 కేటగిరీల కోసం కఠినమైన ఫైనల్ యాక్షన్ డేట్స్ నిబంధనలను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత అల్యూమినియం (VAML) షేర్లు డీమెర్జర్ మరియు మార్కెట్ లిస్టింగ్ తర్వాత తొలిసారిగా లాభాల బాట పట్టాయి. కోటక్, సిటీ వంటి దిగ్గజ బ్రోకరేజ్ సంస్థలు ఈ కొత్త స్టాక్‌పై భారీ టార్గెట్లతో కొనుగోలు పిలుపునిచ్చాయి. పూర్తి వివరాలు మరియు భవిష్యత్తు అంచనాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీకి చెందిన ప్రముఖ డయాగ్నోస్టిక్ కన్జ్యూమబుల్స్ తయారీ సంస్థ ఏవియెన్స్ బయోమెడికల్స్ ఐపీఓ జూన్ 18న ప్రారంభమైంది. జూన్ 22 వరకు సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు అవకాశం ఉంది. ఈ ఐపీఓ పూర్తి వివరాలు, రిస్క్ ఫ్యాక్టర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
విదేశీ ప్రయాణానికి ప్లాన్ చేస్తున్నారా? మీ క్రెడిట్ స్కోర్ వీసా అప్రూవల్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎలాంటి ఆర్థిక పత్రాలను పరిశీలిస్తారో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR AY 2026-27) దాఖలు చేస్తున్నారా? కొత్త ట్యాక్స్ నిబంధనల వల్ల కొత్త ఫైలర్లు చేస్తున్న 4 ప్రధాన తప్పులు మరియు ఐటీ నోటీసుల బారిన పడకుండా ఉండటానికి నిపుణులు చెప్తున్న జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.
సిట్రోయెన్ తన సరికొత్త ఇసి3ఎక్స్ (eC3X) ఎలక్ట్రిక్ కారును కేవలం రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్యాటరీ అద్దె విధానం (BaaS మోడల్), 320 కిలోమీటర్ల మైలేజ్, పూర్తి ఫీచర్లు మరియు ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన కొత్త పేస్ సంచలనం గర్నూర్ బ్రార్. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లోనే 6 వికెట్లు పడగొట్టి, జస్ప్రీత్ బుమ్రా సరసన నిలిచిన ఈ 6 4 పంజాబ్ ఎక్స్‌ప్రెస్ సంచలన రికార్డులు, అతని ఆసక్తికర క్రికెట్ ప్రయాణం మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.