పశ్చిమబెంగాల్ ఎన్నికలు.. అమిత్ షా జోస్యం నిజమౌతుందా?

Publish Date:Apr 25, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తొలి విడత పోలింగ్ ముగిసిన వేళ  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 110కి పైగా సీట్లను కైవసం చేసుకోబోతోందని ఆయన   ధీమాగా చెప్పారు.  రాష్ట్రంలో గాలి   మార్పు స్పష్టంగా గోచరిస్తోందన్న అమిత్ షా..  తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ భారీ అంచనా వెనుక గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అమిత్ షా లెక్కలు నిజం కావాలంటే..  ఈ ప్రాంతాల్లో కమలం పార్టీ ఓటు బ్యాంకులో భారీ ఎత్తున  స్వింగ్ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార టీఎంసీ ఓట్ల నుంచి సుమారు 10 శాతం, ఇతరుల నుంచి మరో 5 శాతం ఓట్లు బీజేపీ వైపు మళ్ళితేనే  అమిత్ షా చెప్పిన సంఖ్యలో నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన అధిక పోలింగ్ శాతం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మాల్దా, జల్పాయ్‌గురి, మేదినిపూర్ వంటి ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడం మార్పుకు సంకేతమని కాషాయ దళం భావిస్తోంది. 

ముఖ్యంగా గతంలో టీఎంసీకి అండగా నిలిచిన కొన్ని వర్గాల ఓట్లు చీలిపోవడం.. ముస్లిం ఓట్లలో  విభజన   తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ బలంగా నమ్ముతోంది.  మాల్దా వంటి చోట్ల కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు టీఎంసీ ఓటు బ్యాంకును దెబ్బతీసి.. అది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తాయని ఆశిస్తోంది. అయితే, ఈ అంచనాలపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 152 సీట్లలో దాదాపు 60 స్థానాలలో  బీజేపీ గట్టి పోటీ  ఎదుర్కొనే అవకాశం ఉంది.   మిగిలిన స్థానాల్లో టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు..  ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న చోట్ల కమలం పార్టీకి ఎదురుగాలి తప్పదంటున్నారు. 

 అమిత్ షా ఊహిస్తున్నట్లుగా 110 సీట్లు సాధించాలంటే రాష్ట్రంలో ఒక అసాధారణమైన  కాషాయ గాలి వీచాలి. ప్రభుత్వ వ్యతిరేకత  కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. టీఎంసీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, అభివృద్ధి లోపం వంటి అంశాలను బీజేపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి ఆందోళనలు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని కొందరు అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ బీజేపీకి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనేది కాషాయ నేతల వాదన. మొత్తంగా చూస్తే.. బెంగాల్ రాజకీయాల్లో మతపరమైన ధ్రువీకరణ ఎంతవరకు పనిచేస్తుందనేదే ఫలితాలను శాసించనుంది. హిందూ ఓట్లు ఏకపక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపితే అమిత్ షా అంచనాలు నిజం కావచ్చు.. కానీ, టీఎంసీ తన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోగలిగితే మాత్రం పోటీ అత్యంత హోరాహోరీగా ఉంటుంది. అమిత్ షా ప్రకటించిన 110 సీట్ల ధీమా నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

-సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.