అందరి దేవుడిపై ఎందుకీ వివాదం?

Publish Date:May 19, 2023

Advertisement

కొందరుంటారు.. సరుకుండదు కానీ, చరిత్ర పుటల్లో ఎక్కి పోవాలని తెగ ఉబలాట పడిపోతుంటారు. సెలబ్రిటీలుగా చెలామణి కావాలని, పత్రికల్లో, మీడియాలో కనిపించి పైకేగిరిపోవాలని తెగ సందడి చేస్తుంటారు. సెలబ్రిటీ స్టేటస్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. సినీ నటి కరాటే కళ్యాణి ఆ కోవకు చెందిన నటి అవునో కాదో కానీ, ఆమె నటిగాకంటే వివాదాల ద్వారానే నలుగురు నోళ్ళలో నానుతున్నారు. మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు అనేది మాత్రం నిజం. అయితే ఆమె ప్రస్తావించే లేదా ప్రశ్నించే అంశాలు అన్నీ అలాంటివేనా, సెలబ్రిటీ స్టేటస్ కోసమేనా అంటే, అవునని అనలేము కానీ, అమె రచ్చ చేసిన వివాదాలు చాలా వరకు అనవసర వివాదాలుగానే మిగిలి పోవడం మాత్రం నిజమని అంటారు. 

సరే, కరాటే కల్యాణి గతాన్ని కాసేపు పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే, రాముడు, కృష్ణుడి వంటి పౌరాణిక పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో నిజంగా దేవుడిగా కొలువుండిపోయిన మహా నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఆమె  వివాదంగా మార్చారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి శత జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఖమ్మంలో 54 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించారు. మే 28న ఆయన శత జయంతి సందర్భంగా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటం పట్ల కల్యాణి  అభ్యంతరం వ్యక్త చేశారు. కృష్ణుడికి రూపం లేదా.. మానవ రూపంలో కొలవాలా? అని ప్రశ్నించారు. మీడియాలో రచ్చ చేశారు. 

 ఈ విషయంలో ‘విశ్వ హిందూ పరిషత్, ఇస్కాన్’తదితర హిందూ ధార్మిక సంస్థలు సంస్థలు కరాటే కళ్యాణికి మద్దతుగా నిలిచాయి. కాగా ఈ వివాదంపై విచారించిన హైకోర్టు తాజాగా స్టే విధించింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో 14 రిట్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ జేఏసీ, అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు వారి వాదనలను విన్నది. పిటిషనర్ల వాదనలను విన్న హైకోర్టు విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది. అయితే కృష్ణుడి విగ్రహమైనా లేదంటే ఎన్టీఆర్ విగ్రహమైనా పెట్టుకోవచ్చని.. కానీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ఇది ఒక విధంగా సముచిత నిర్ణయమే అనిపించుకుంటుంది.

 అందుకే, కరాటే కళ్యాణి ఎందు కోసం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అనే విషయం పక్కన పెడితే, కృష్ణ పరమాత్మ రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటును తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో వివరిస్తూ కళ్యాణి చేసిన వాదన కొంత ఆలోచింప చేసే విధంగా ఉందని ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతవరకు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ..‘మానవ రూపంలో కృష్ణుడిని పెడితే రేపు రాజకీయ కారణాలతో  కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్‌ పోస్టర్‌ను దగ్ధం చేస్తే ఎవరిని దగ్ధం చేశారని అనుకోవాలి. ఈ విగ్రహం 400 ఏళ్లు ఉంటుందని అంటున్నారు. యాభై, ఆరేళ్ల తర్వాత ఫ్యూచర్ జనరేషన్.. తననే కృష్ణుడు అనుకోరా? ఆయనే భగవద్గీత చెప్పారంటే ఎవరు జవాబుదారీ? అంటూ ప్రశ్నించారు.

 నిజమే, విశ్వహిందూ పరిషత్, అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ వంటి పలు ధార్మిక సంస్థలు సైతం కృష్ణ భగవానుని మానవ రూపంలో చూపడం కొందరి మనోభావాలను అయినా హర్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ కేవలం కృష్ణుడు, రాముడు పాత్రలే కాదు, రావణ బ్రహ్మ పాత్రను అంతకంటే అద్భుతంగా పోషించారు. దుర్యోధన, దుశ్శాసన పాత్రలూ పోషించారు. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే ఇక చెప్పనే అక్కరలేదు. అన్నిటినీ మించి రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదానికి..ఇక్కడితో చుక్క పెట్టడమే ఉత్తమం, అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. నిజానికి ఎన్టీఆర్ అందరి వాడు. సినిమా నటుడిగానే కాదు, రాజకీయ నాయకునిగానూ ఆంధ్రుల ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందిన మహా మనిషి. మహోన్నతుడు. ఆయన అభిమానులకే కాదు, కోట్లాదిమంది తెలుగు వారికి ఆయనే  ఓ దేవుడు. ఆయన్ని మరో దేవుని రూపంలో నిలపడం అవసరమా? ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా అంతటి మహా నటుడు, మహా నేతను వివాదాల వేదిక ఎక్కించడం అవసరమా? 

సరే .. ఆ విషయంతో ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా ... దేవుని రూపానికి సంబంధించి గతంలోనూ   కొంత ఆసక్తికర చర్చ జరిగింది. దేవుని రూపం ఏది? హిందూ దేవీ దేవతలు ఏ రూపంలో ఉంటారు? కృష్ణుడి రూపం ఇది, రాముడి రూపంఇది.. విష్ణువు ఇలా ఉంటారు.. వెంకన్న స్వామి రూపం ఇది ..శివన్న చిత్రమిది ..పార్వతమ్మ .రూపం ఇది ..విఘ్నేశ్వరుని ఆకారమిది..  ఇదిగో ఇలా ఉంటారు దేవుళ్ళు అని ఎవరు చెప్పారు ..ఎవరు నిర్దారించారు.. అంటే ..చిత్రకారుడు రవివర్మ గుర్తుకొస్తారు. అవును..ఒకప్పుడు, (ఇప్పుడు కూడా)  మనదేశంలో క్యాలెండర్ లేని ఇల్లు ఉండదు. అన్ని రంగాల్లోనూ అనూహ్య మార్పులు వస్తున్నప్పటికీ ఈ క్యాలెండర్ కళకు ఆదరణ తగ్గలేదు. అందుకే నేటికీ. కొత్త ఆంగ్ల సంవత్సరం రాగానే ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ గోడలపై కొత్త క్యాలెండర్లు దర్శనమిస్తాయి. వారి వారి అభిరుచిని బట్టి ప్రకృతి చిత్రాలు, పక్షులు, దేవుళ్ళు – దేవతలు, సినీతారలు ఇలా ఎన్నో రకాల క్యాలెండర్లు గోడలపై అలంకరించుకుంటారు. 
ఈ క్యాలెండర్ కళకు ఆద్యుడిగా భారతీయ చిత్రకళా రత్నం రాజా రవివర్మను చెప్పుకోవచ్చు.  ప్రజల మనసులోని భావాలు, ఆసక్తిని గమనించిన రవివర్మ క్యాలెండర్ పై దేవుళ్ళ బొమ్మలు వేస్తే ప్రజలు ఆదరిస్తారని గ్రహించి, 1892లో నాటి బొంబాయిలో లిథో గ్రఫీ ప్రెస్స్ ను జర్మనీ నిపుణుల సహకారంతో నెలకొల్పాడు.

 ఆ ప్రెస్ లో ఆయన చిత్రించిన ప్రఖ్యాత శ్రీరామ పట్టాభిషేకం, లక్ష్మీ సరస్వతి, వినాయకుడు, దుర్గాదేవి తదితర చిత్రాలు వేల సంఖ్యలో ముద్రించి దేశం నలుమూలలా అమ్మకాల జరిపించాడు. అణా  కే ఒక వర్ణచిత్రం దొరికేది ఆ రోజుల్లో.ఆ విధంగా ఆయన చిత్రాలన్నీ ప్రజల పూజా మందిరాల్లో కొలువైనాయి. ఇప్పటికీ ఇళ్లలోనే కాదు దేవాలయలోనూ రవివర్మ చిత్రించిన చిత్రాలే శిల్పాలుగా పూజలందుకుంటున్నాయి, అయితే రవివర్మ అదృష్టం ఏమంటే ఆ రోజుల్లో కరాటే వుందో లేదో కానీ, కరాటే కల్యాణి వంటి కళాకారులు మాత్రం లేరు. అలాగే, ఇప్పటికీ వినాయక చవితి పందిళ్ళలో వినాయకుడిని మానవ రూపంలోనే కాదు,అనేక రూపాల్లో చివరకు కరోనా ఆకృతిలోను పూజించారు. భక్తీ ముఖ్యం కానీ దేవుని రూపం, ఆకారం కాదు కదా ..

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.