ఆ ముగ్గురూ ఎక్కడ? కేసీఆర్ సామాజిక వ‌ర్గ‌మ‌నేనా? కమలదళంలో గుసగుసలు..

Publish Date:Jan 11, 2022

Advertisement

కారణాలు ఏవైనా, తెర వెనక ఎవరున్నా, తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తర్వాత కమల దళం జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. బండి సంజయ్ అరెస్టు నిరసన తెలిపేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నాయకులు రోజుకొకరు వంతున రాష్ట్రానికి వచ్చి తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్’ను ఎండగట్టి పోతున్నారు. అది కూడా హైదరబాద్’కు పరిమితం కాకుండా జిల్లాలలో నిరసన దీక్షలు చేపట్టి కేసీఆర్ సర్కార్’పై ఆరోపణ అస్త్రాలను సంధిస్తున్నారు. ఒక విధంగా చూస్తే, బీజేపీ వ్యూహం తెరాసను ఉక్కిరిబిక్కిరి చేస్తోందనిపిస్తోంది. ముఖ్యమంత్రి మినహ మిగిలిన సీనియర్ నాయకులు అందరూ బీజేపీ నాయకుల విమర్శలకు సమాధానం చెప్పుకోక తప్పడం లేదు.   

అయితే, బీజేపీలో ఇంత జరుగుతున్నా, ఎక్కడెక్కడి నాయకులు వచ్చి పోతున్నా, ఆ ముగ్గురు నాయకులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాకుండా ఆ ముగ్గురు నాయకులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, పార్టీలో రకరకాలుగా చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోనే కాదు జాతీయ నాయకత్వం కూడా, ఆ ముగ్గురు నాయకుల గురించి ఆరా తీయడంతో పాటుగా, నిఘా వర్గాలను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం. 

ఆ ముగ్గురిలో ముఖ్యుడు బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లేకున్నా, మురళీధర్‌రావుకు సంఘ్ పరివార్’లో ప్రముఖ నేతగా గుర్తింపు ఉంది. పైగా ఆయన మధ్య ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్నారు. అయినా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిన సమయంలో కూడా, ఆయన పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇతర నాయకుల రాష్ట్ర పర్యటన సందర్భంలోనూ మురళీధర్‌రావు కనిపించలేదు. బండి సంజయ్ అరెస్ట్ విషయంలో కూడా ఆయన, అంతగా రీయాక్ట్ కాలేదు. ఏదో అలా ఓ ట్వీట్ ‘ తో ఖండించి వదిలేశారు. దీంతో మురళీధర్‌రావు ఎక్కడా అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. వ్యక్తిగత పనులు, ఆరోగ్య కారణాల వల్ల అందుబాటులో లేరని పార్టీలో కొందరు చెబుతున్నా.. అది అంట నమ్మసక్యంగా లేదని అంటున్నారు. దాల్‌ మే కుచ్‌ కాలా హై అన్నది వారి అనుమానం.

అలాగే, ఇటీవల ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సమయంలో బండి సంజయ్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదని, ఆ కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. అలాగే, మరో నాయకుడు పేరాల శేఖర్‌రావు గురించి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఖాదీ గ్రామీణ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నశేఖర్ గతంలో సంఘ్ (ఆర్ ఎస్ ఎస్ ) పూర్తి సమయ కార్యకర్త/ ప్రచారక్ గా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు. మొన్నటి వరకు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేశారు. ఈ మధ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జీహెచ్ఎంసి పరిధిలోని లింగోజీగూడ డివిజన్‌ ఉపఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలు, కొందరు నేతల బృందం కేటీఆర్‌ను కలవడం పార్టీలో దుమారం రేపాయి. ఆ తర్వాత పార్టీ చీఫ్‌ బండి సంజయ్‌తో శేఖర్‌కు గ్యాప్‌ వచ్చిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ దూకుడుగా వెళ్తున్న టైమ్‌లో శేఖర్‌ కనిపించడం లేదన్నది బీజేపీ వర్గాల మాట.

ఆ ఇద్దరితో పాటు, అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు కూడా బుల్లి తెర మీదనే కాదు, పార్టీ కార్యాలయంలోనూ  కనిపించడం లేదు.  పార్టీ కార్యాలయానికి రెగ్యులర్‌గా వచ్చే కృష్ణ సాగర్ ఇప్పుడు అసలే రావడం లేదు.  ముఖ్య నేతలు వచ్చిన సమయంలోనూ  ఆయన పార్టీ కార్యాలయం గడప తొక్కలేదని,  బండి సంజయ్‌ అరెస్ట్‌ అంశంలోనూ స్పందించలేదని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. 

మురళీధర్‌రావు, శేఖర్‌రావు, కృష్ణసాగర్‌రావు ఈ ముగ్గురూ కేసీఆర్‌కు చెందిన సామాజికవర్గమే. ఈ ముగ్గురు ఒకేసారి ఎందుకు సైలెంట్‌ అయ్యారన్నదానిపై కాషాయ శిబిరంలోనే అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. అయితే, ఆ ముగ్గురు పార్టీ మారే అవకాశం మాత్రం ఉండదని, పార్టీ నాయకులు  అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.