భర్తకు అరెస్టు వారెంట్ పై మంత్రి రోజా మౌనమేలనోయీ!

Publish Date:Aug 30, 2023

Advertisement

జగన్  కేబినెట్  మహిళా మంత్రుల్లో అసలు సిసలు ఫైర్ బ్రాండ్  పర్యాటక శాఖ మంత్రి  రోజా . ఈ విషయాన్ని  అధికార పార్టీలోని వాళ్లే కాదు.. ప్రతిపక్ష పార్టీ  నేతలు సైతం అంగీకరిస్తారు. అలాంటి   రోజా భర్త ఆర్కే సెల్వమణికి చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు నాన్ బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే  తన భర్తకు వారెంట్ వచ్చి రెండు రోజులు గడుస్తున్నా రోజా  నుంచి ఎటువంటి స్పందనా లేదు.  దీంతో తన భర్తపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా మంత్రి రోజా కనీసం స్పందించకపోవడంపపై  నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  

 ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై ఈగ వాలితేనే ఆర్కే రోజు సహించలేరని.. అలాంటి ఆమె.. తన భర్త   సెల్వమణికి కోర్టు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే ఎందుకు స్పందంచడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఆర్కే రోజా... తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో సీఎం జగన్ విద్యా దీవెన పథకంలో భాగంగా బటన్ నొక్కే కార్యక్రమాన్ని నిర్వహించారని.. ఈ సందర్బంగా ఆ భారీ సభలో ఆర్కే రోజా మాట్లాడుతూ.... సీఎం జగన్‌ను  దేవుడిగా అభివర్ణిస్తూ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ఓ ఆటాడుకుంటున్నారు. సీఎం వైయస్ జగన్ ప్యూచర్ కి సీఎం అని   రోజా  ఆ ప్రసంగంలోపేర్కొన్నారనీ,  ఇంతకీ జగన్.. ఎవరి ప్యూచర్‌కి సీఎం అని వారు క్వచ్చన్ లు సంధిస్తున్నారు. అంతేకాదు.. ఓ వేళ ఆమె ప్యూచర్‌కే  జగన్ సీఎం అయితే అయి ఉండవచ్చని కూడా అంటున్నారు. 

అదీకాక... తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు ఎవరైనా   జగన్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తే.. కొన్ని సెకన్లలో.... అదీ శ్రీవారు కొలువైన తిరుమల? గణేషుడు కొలువున్న కాణిపాకమా?  సత్యదేవుడు నెలవున్న అన్నవరమా ?  లక్ష్మీ నరసింహుడి ఆవాసమైన సింహాచలమా? అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. అలా మీడియా ముందుకు వచ్చి.. ఇలా ఆయా పార్టీల అధినేతలపై సినిమా డైలాగులతో,  ప్రాసలతో   రోజా చిందులు తొక్కుతారనీ.. అయినా.. తాను ఓ బాధ్యత గల మంత్రిని అని.. అదీ కూడా ఓ మహిళా మంత్రినన్న సోయి కూడా లేకుండా.. నాని బ్రదర్స్‌ లేడి అవతారం ఎత్తితే ఎలా మాట్లాడతారో.. అలా ఆమె మాట్లాడుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు.   అయినా ప్రతీదానికి స్పందించే ఆర్కే రోజా.. భర్తకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయితే స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే ఏక్కడో ఏదో తేడా కోడుతున్నట్లుగా ఉందనే  ఓ అనుమానాన్ని కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. 

ఇక చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు రోజా భర్త సెల్వమణికి ఎందుకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసిందంటే.. 2016లో ఓ తమిళ చానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  సినిమా ఫైనాన్షియర్ చంద్ బోత్రాని కించపరిచే విధంగా మాట్లాడారు. దీనిపై చంద్ బోత్రాసెల్వమణిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఆ తర్వాత ఆయన  మరణించడంతో.. ఆయన కుమారుడు గగన్ బోత్ర ఈ కేసును కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో ఆ కేసు.. మరోసారి విచారణకు వచ్చింది. కానీ ఈ విచారణకు సెల్వమణి హాజరు కాలేదు. అలాగే ఆయన తరుఫు న్యాయవాదులు సైతం హజరుకాలేదు. దీంతో జార్జీ చౌన్ కోర్టు ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

By
en-us Political News

  
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.