పోసాని అదృశ్యం.. ఫిలింనగర్‌లో ఆయన ఫ్యాన్స్ ఆందోళన 

Publish Date:Jan 4, 2022

Advertisement

పోసాని కృష్ణ మురళి.. ప్రపంచంలోని తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.. ఆయన మాటలు... తుపాకీ తూటాలు.. ఆయన సినిమాకు డైలాగ్స్ రాశారంటే.. ఆ డైలాగ్ పంచ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన డైలాగ్ పంచ్‌.. తీవ్రత తెలియని సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఈ ప్రపంచంలోనే లేరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి పోసాని ఈ మధ్య తెరమరుగే కాదు.. కనుమరుగయ్యారంటూ ఓ టాక్ అయితే ఫిలింనగర్‌ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. అప్పుడెప్పుడో రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పలు అంశాలపై గళమెత్తారు. దానికి కౌంటర్‌గా ఆ వెంటనే పోసాని కృష్ణమురళి.. వరుసగా రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టి.. పవన్‌ కల్యాణ్‌పై అలా ఇలా కాదు.. ఓ రెంజ్‌లో చెలరేగిపోయారు. ఈ విషయాన్ని మీడియాలో తెలుగు ప్రజలంతా వీక్షించారు. 

మరి ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వైయస్ జగన్ ప్రభుత్వం థియేటర్ల ఛార్జీల తగ్గింపు అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో తగ్గించేసింది. ఈ అంశంపై టాలీవుడ్‌లో పలువురు పెద్దలంతా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో పోసాని కృష్ణమురళీ లాంటి నిప్పులాంటి నికార్స్ అయినా నటుడు కమ్ డైలాగ్ రైటర్... నేను సైతం అంటూ ముందుకు వచ్చి.. ఈ సమస్యకు పరిష్కారం కోసం చొరవ చూపాలని ఫిలింనగర్‌లోని పోసాని కృష్ణమురళీ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఆశగా ఎదురు చూస్తుంది. ఏపీలో థియేటర్ల సమస్యకు పరిష్కార చూపగల సత్తా.. నేర్పు గల చాణక్యం పోసాని కృష్ణమురళి సొంతమని ఆయన ఫ్యాన్స్ గుర్తు చేస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే పోసాని కృష్ణమురళీకి ప్రాణమని... అందుకే నాడు ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్‌ పాదయాత్రలో పోసాని పాల్గొని మరీ ఆయనకు మద్దతు కూడా తెలపారని.. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం వైయస్ జగన్ పార్టీ తరపున ఆయన ప్రచారం కూడా నిర్వహించారని ఫిలింనగర్‌లోని ఆయిన ఫ్యాన్స్ గుర్తు చేస్తుంది. అంతేకాదు.. ఆ ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుపొందింది. 

అయితే సరిగ్గా అదే సమయంలో పోసాని.. తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలుసుకుని.. తన ముఖ్య సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డిని.. తన వద్దకు పంపారని.. ఈ సందర్భంగా తనకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ సీటు ఏదైనా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సిద్ధంగా ఉన్నారని.. సజ్జల రామకృష్ణారెడ్డి.. తనకు తెలిపారని.. కానీ తనకు ఇవేమీ వద్దన్నానని... వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తే.. చూడాలనుకున్నానని..  అది జరిగిందని.. తాను చాలా సంతోషపడ్డానని.. సజ్జల రామకృష్ణారెడ్డితో తాను చెప్పానని ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళీనే స్వయంగా ఈ విషయం చెప్పారని ఫిలింనగర్‌లోని ఆయన ఫ్యాన్స్ పదే పదే గుర్తు చేసుకోంటుంది. 

మరి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు జగన్ ప్రభుత్వం థియేటర్లలో ఛార్జీల తగ్గింపు.. మరోవైపు ప్రభుత్వాధికారులు థియేటర్లలో  తనిఖీలు, సోదాలు.. ఇంకో వైపు థియేటర్ల యజమానులే.. ఈ ఛార్జీలతో తాము థియేటర్లు నడపలేమంటూ స్వయంగా థియేటర్లు మూసివేస్తున్న తీరు తమను తీవ్రంగా కలిచి వేస్తుందని ఫిలింనగర్‌లోని పోసాని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. 

ఏపీలో ఇలాంటి దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటే.. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కీ పోసాని వీరాభిమానిగా.. ఫ్యాన్‌ పార్టీలో ఓ నేతగా.. ఆ పార్టీ కార్యకర్తగా.. బాధ్యతగల పౌరుడిగా.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్దకు వెళ్లి.. ఇలాంటి కఠిన నిబంధనల వల్ల చిత్ర పరిశ్రమ.. ఎంతగా నష్టపోతుందో కళ్లకు కట్టినట్లు వివరించి గల నేర్పు ఓర్పు తమ అభిమాన నటుడు పోసాని సొంతమని వారు గుర్తు చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇంత రచ్చ రచ్చ జరుగుతోన్న పోసాని మాత్రం మౌనం వీడకుండా ఉండడం పట్ల ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది.

పోసాని కృష్ణమురళీ తీవ్ర అనారోగ్యంతో ఉండి ఉంటారని అందుకే ఆయన స్పందించలేదని.. ఆయన ఫ్యాన్స్ సర్ధిచెప్పుకొంటుంది. పోసాని కృష్ణమురళీ ఓ వేళ తీవ్ర అనారోగ్యంతో ఉండి ఉంటే.. ఆయన త్వరగా కోలుకోవాలని.. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ పడుతున్న ఇబ్బందులపై పోసాని ఓ ప్రెస్ మీట్ పెట్టి తనదైన స్టైల్‌లో ఓ రెంజ్‌లో చెలరేగిపోవాలని.. ఫిలింనగర్‌లోని ఆయన ఫ్యాన్స్ చేతులు జోడించి మరీ ఆ దేవుడిని కోరుకోంటుంది. మరి పోసాని కృష్ణమురళీ ఏం చేస్తారో చూడాలి?

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.