అంబటి బ్రో.. వ్యూహం కనిపించడం లేదా?

Publish Date:Aug 15, 2023

Advertisement

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన గతం వైభవమే కానీ ఇప్పుడు ఆయన సినిమాల కంటే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ రేటుకు అమ్ముడుపోతున్నాయి. అప్పుడప్పుడు పోర్న్ స్టార్స్ ను తీసుకోచ్చి బూతు బొమ్మలు తీసినా ఆయన మొహం చూసేందుకు కూడా ప్రేక్షకులు ఇష్టపడం లేదు.  అయితే ఆయన ఒకప్పటి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు మీడియా చానెళ్లు తరచూ ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంటాయి. ఆ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పే చొప్పదండు కబుర్లు వ్యూస్ ను తెచ్చిపెడుతుంటాయంతే. అంతకు మించి సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉనికి కానీ ప్రమేయం కానీ అంతంత మాత్రమే.

అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో  ఆయనకి ఓ సినీ  బేరం తగిలింది. అదే ‘వ్యూహం’. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీ కోసం రెండు సినిమాలు చేసి పెట్టిన వర్మ ఈసారి కూడా అదే ప్రణాళికలో ‘వ్యూహం’ అనే సినిమా తీసిపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్  రిలీజ్ అయ్యింది. యధావిధిగా ఈ టీజర్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబును నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు.  ఆ తరువాత  ఇప్పుడు ఇదే ‘వ్యూహం’ నుండి రెండో  టీజర్ కూడా విడుదల అయ్యింది. ఇందులో కూడా అంతే. జగన్ కు అనుకూలంగానే ఈ టీజర్ కూడా కట్ చేశారు. మొదటి టీజర్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం నుండి మొదలు పెడితే.. రెండో టీజర్ లో ప్రజారాజ్యం విలీనం, రాష్ట్ర విభజన అంశాలను చూపించారు.

ఇందులో కూడా చంద్రబాబు పాత్రను నెగటివ్ గానే చూపించగా.. సోనియా గాంధీ పాత్రను, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రలను కూడా చూపించారు. రాష్ట్రాన్ని సోనియా గాంధీ చపాతీని రెండు ముక్కలు చేసినట్లు విడదీసినట్లు చూపించగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా అందరి పాత్రలను చూపించారు. ఈ టీజర్ లో సోనియా గాంధీ, రోశయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, చంద్రబాబు నాయుడు ఇలా అందరినీ బ్లేమ్ చేసి.. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉత్తముడు అన్నట్లు చూపించనున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. 

మరో పది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్ కి పొలిటికల్  మైలేజ్  కోసమే, మిగతా అందరినీ తప్పుడు వ్యక్తులుగా చూపించేందుకు  ‘వ్యూహం’ తెరకెక్కింది. ఈ సినిమా తెరకెక్కించడానికి ముందే వర్మ తాడేపల్లి వెళ్లి మరీ సీఎం జగన్ ను కలవగా.. ఈ సినిమా షూటింగ్ కోసమే ఏపీ ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మొన్నీమధ్య ఒక రోజు విజయవాడ బ్యారేజీపై ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని గంటలపాటు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఏది ఏమైతేనేం సినిమా అయితే జగన్ కోసమే తెరకెక్కిస్తున్నారన్నది స్పష్టంగా తెలిసిందే. ఇక, ఈ సినిమా విడుదల అవుతుందా? విడుదలైతే ఫలితం ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది.

ఇక పోతే ఈ రెండో టీజర్ పై కూడా సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తున్నది. వర్మ ఈ స్థాయికి దిగజారి అమ్ముడుపోతాడని ఊహించలేదని ఆయన అభిమానులే కామెంట్లు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కార్యకర్తలైతే చెప్పాల్సిన పనిలేదు. పే టీమ్ కూలీలూ.. వర్మ రెండూ ఒక్కటేనని విమర్శలతో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక  ఈ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమా బ్రో లో మంత్రి అంబటి రాంబాబును పేరడీ చేశారని తెగ గగ్గోలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ అంశాన్ని అంబటి వదలడం లేదు. ప్రజా సమస్యలను కూడా గాలికి వదిలేసిన అంబటి బ్రో సినిమాపై గంటలు తరబడి మీడియా సమావేశాలు నిర్వహించారు. ఎప్పుడో ఆయన సంక్రాంతి సంబరాల్లో చేసిన డాన్స్ మాదిరి సినిమాలో పృథ్వీ వేసాడని గగ్గోలు పెడుతున్న అంబటికి ఇప్పుడు వ్యూహం సినిమా టీజర్లు కనబడడం లేదా అని నెటిజన్లు  ఏకిపారేస్తున్నారు.  నీదో కాదో తెలియని డాన్సుకు అన్ని రోజులు మాట్లాడిన అంబటికి ఇంత నీచంగా పాత్రలు, కల్పిత కథతో కించపరిచే విధంగా తెరకెక్కిన సినిమాలు కంటికి కనిపించడం లేదా అని  ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ఉన్నా మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు మీడియాను పిలిచి వ్యూహం టీజర్ పై మాట్లాడాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.