Publish Date:Jul 23, 2026
దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలకు దారితీసిన నీట్ పరీక్షల నిర్వహణ వైఫల్యం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందనడంలో సందేహం లేదు. పరీక్షా పత్రాల లీకేజీ, మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై విద్యార్థులలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మోడీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకు వస్తున్నారన్న చర్చ మొదలైంది.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నా, ప్రధాని నరేంద్రమోడీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకు రావడానికి కారణమేంటన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుడు కావడం, ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వంతో ఆయనకున్నపటిష్ట సంబంధం అనుబంధం, అలాగే , పార్టీ పట్ల ఉన్న విశ్వసనీయత ధర్మేంద్ర ప్రధాన్ కు రక్షణ కవచంగా మారాయని అంటున్నారు. అదే విధంగా ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి సాధించిన చారిత్రాత్మక విజయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర అత్యంత కీలకమైనది కావడంతో ఆయనను పక్కన పెట్టడానికి మోడీ వెనుకాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే.. నిరసనకారుల ఒత్తిడికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తే.. ముందు ముందు ఇతర కేంద్ర మంత్రుల విషయంలో కూడా ఇటువంటి పరిస్థితే ఎదురు కావచ్చునని మోడీ భావిస్తున్నారని అంటున్నారు.
NEET exam controversy, Narendra Modi government, Jantar Mantar protests, BJP's Odisha politics, RSS links
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-modi-backing-dharmendra-pradhan-39-226845.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!