అందుకేనా రాజ్‌భవన్‌తో కయ్యం!.. అంత రాజకీయం ఉందా?
Publish Date:Apr 9, 2022
Advertisement
నిజమే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నట్లుగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, తెరాస పార్టీ, ప్రభుత్వమే కానీ, గవర్నర్ తమిళి సై’తో ఇంతలా తగవు పెట్టుకోవలసిన అవసరం ఏ మొచ్చింది, అంటే అందుకే సరైన సమాధానం ఏదీ కనిపించదు. నిజానికి, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ విషయం పక్కన పెడితే, ఇద్దరి మధ్య చెప్పుకోదగిన విబేధాలు ఇంకేమీ ఉన్నట్లు కనిపించదు.ఆ ఉదంతం తర్వాతనే, ఒకటొకటిగా కొత్త వివాదాలు వచ్చి చేరాయి. ఈ మధ్య కాలంలో మరింతగా ముదిరి,ఇక ఇప్పుడు నువ్వా నేనా’ బస్తీమే సవాల్ అనే వరకు వచ్చాయి. ఈ నేపధ్యంలో, సహజంగానే ఎవరికైనా ముఖ్యమంత్రి ఎందుకు ఇలా, అటు కేంద్రంతో, ఇటు గవర్నర్’తో ఇతర రాజ్యాంగ వ్యవస్థలతో ఒకేసారి, కోరి తగవులు తెచ్చుకుంటున్నారు. నిజానికి వరి వివాదం విషయమే తీసుకున్నా, ఇప్పుడు గవర్నర్’ తో తగవు విషయమే తీసుకున్నా, ఇవేవీ ఇలా వీధుల్లోపడి చొక్కాలు చిన్చుకోవలసినంత చిక్కుముడి సమస్యలు కాదు. అయినా ఢిల్లీ నుంచి గల్లీ దాకా, చిన్న సమస్యను పెద్దది చేస్తున్నారు. ఎందుకు వివాదమే లేని విషయలను వివాదం చేస్తున్నారు? అంటే, ఇతర కారణాలు ఉన్నా, రేవంత్ రెడ్డి చెప్పిన, తండ్రీ కొడుకుల్ కిస్సా కుర్సీకా లడాయి కూడా కొంచెం చాలా ఆలోచించేలా ఉందని మీడియా మేథావులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవును. కేటీఆర్ యమ అర్జెంటుగ ముఖ్యమంత్రి అయిపోవాలని, ఆశ పడుతునారు. అందుకోసం కుటుంబంలో ఓ చిన్న సైజు మహ మహా సంగ్రామమే జరుగుతోంది. ఓవంక అల్లుడు, మరోవంక కొడుకు, ఆ ఇద్దరి మధ్యలో ఇద్దరినీ మించిన కొండుకుకాని కొడుకు సంతోష్ కుమార్, మరో వైపు నుంచి కుమార్తె కవిత ఇలా తెర మీద కన్పించేవారు కొందరైతే, కనిపించకుండా కథ నడిపించే సూత్ర ధారులు ఇంకొందరు. మొత్తానికి, కుటుంబంలో కుర్చీ కొట్లాట సాగుతోందనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. నిజానికి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది మొదలు, కేటీఅర్ పట్టాభిషేకానికి సంబంధించి అనేక తేదీలు ఖరారై వెనక్కి పోయాయి. అలా వెనక్కి పోవడం వెనక కుటుంబ రాజకీయమే, మరీ మట్లాడితే కేసీఆర్ రాజకీయమే ప్రదాన కారణమనే చర్చ కూడా చాల కాలంగా సాగుతోంది. కేసేఆర్’కు ఇప్పుడే కుర్చీ దిగే ఆలోచనలేదు, కేసీఆర్’కు స్టాలిన్ కున్నంత ఓపిక లేదు, కారణంగా ఇద్దరి మధ్య లడాయి సాగుతోందనేది ఇంటర్నల్ సమాచారం అంటున్నారు. ఈ నేపధ్యాన్ని గమనిస్తే రేవంత్ రెడ్డి అన్నట్లుగా, అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలని ఆశ పడుతున్న కుమార రత్నం మంత్రి కేటీఅర్’ కోరికలకు కళ్ళెం బిగించేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలను తెరమీదకు తీసుకు వస్తున్నారు, అనుకోవచ్చును. ఈ విషయంలో రేవంత్ రెడ్డి పరిశీలన వాస్తవానికి దగ్గరగా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనూ వినవస్తోంది.
అదలా ఉంటే, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, తెలంగాణ రాజకీయాలకు ముఖ్యమంత్రి, తెరాస అద్యక్షుడు కేసీఆరే’ ఇప్పటికీ మూల బిందువు. ఆయన చుట్టూనే రాష్ట రాజకీయాలు ప్రదక్షిణం చేస్తున్నాయి. మరో విధంగా చూస్తే, ఆయనే రాష్ట్ర రాజకీయాలను తమ చుట్టూ తిప్పు కుంటున్నారు అంటారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రతిపక్షాలనే కాదు, స్వపక్షంలోనూ, చివరకు సొంత కుటుంబంలోనూ ఎవరిని ఎక్కడ ఉంచాలో, అక్కడ ఉంచడంలో ఆయనకు ఆయనే సాటి అంటారు. అందుకే, ఆయన ఇంటా బయట ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా పరిష్కరించకుంటూ ముందుకు సాగుతున్నారని అంటారు.
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యమంత్రి వర్సెస్ గవర్నర్, రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ చుట్టూనే తిరుగుతున్నాయి.కానీ ఇదొక అనవసర వివాదం. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పంచాయతీనే, అంతటికీ మూలం అనుకుంటే, అప్పుడే ముఖ్యమంత్రి ఒక సారి రాజ్’ భవన్’కు వెళ్లి గవర్నర్’తో మాట్లాడితే అక్కడితో ఆ సమస్య సంసి పోయేది. కానీ, కేసీఆర్ కావాలనే సమస్యను జటిలం చేశారని, అందుకు, ముఖ్యమంత్రి కుర్చీకోసం కొడుకు కేటీఆర్ మంకు పట్టు పట్టడమే ప్రధాన కారణమని రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే కావచ్చని అంటున్నారు. నిజానికి,ఈటల రాజేందర్’ను బయటకు పంపడం మొదలు ఇంతవరకు కేసీఆర్ వేస్తున్న పార్టి అడుగు, ఆడిస్తున్న రాజకీయం మొత్తం తండ్రీ కొడుకుల మధ్య సాగుతున్న, కిస్సా కుర్సీకా.. వార్ అంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-kcr-precipitating-simple-issues-with-governor-39-134146.html





