అమిత్ షా భేటీకి కేసీఆర్ డుమ్మా అందుకేనా? తాకట్టు రాజకీయాలేనా?

Publish Date:Nov 15, 2021

Advertisement

దక్షిణాది రాష్ట్రాల ప్రజాసమస్యల పరిష్కారం లక్ష్యంగా తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ సమస్యలను కేంద్ర హోమ్ మంత్రి, సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్ షా విన్నవించుకున్నాయి. ఈ సమావేశం ప్రధానంగా ముఖ్యమంత్రులు సమావేశం. కానీ, తెలంగాణ, తమిళ నాడు, కేరళ ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. వరదల కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి హాజరు కాలేక పోతున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.   నిజానికి, ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఈ వేదిక అవసరం కొంచెం చాలా ఎక్కువ. ఒక విధంగా, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబందించే కాకుండా, ఇరుగు పొరుగు రాష్ట్రాల సంబంధాలు, సమస్యలు చర్చించుకునేందుకు ఇదొక చక్కని అవకాశం. ఇతర విషయాలు ఎలాఉన్నా, రాష్ట్ర విభజన జరిగి ఏడు సంవత్సరాలు పూర్తయినా, విభజన హామీలు అనేకం ఇంకా అలాగే ఉన్నాయి. అంతే కాదు, రాష్ట్ర విభజన నేపధ్యంగా ఏడేళ్ళ కాలంలో కొత్తగా తలెత్తిన సమస్యలూ చాలానే ఉన్నాయి. ఈ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లేందుకు, ఏపీతోనే కాకుండా ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను నేరుగా చర్చించుకునేందుకు సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం వేదిక ఒక చక్కని అవకాశం. 

అయితే, ఇంత కీలక సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం, తీసుకోవల్సినంత సీరియస్ గా తీసుకోలేదని, ఈ సమావేశానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వలేదని అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఆ రాష్ట్ర సమస్యలను అయన చెప్పుకున్నారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సమావేశానికి హాజరు కాలేదు. అఫ్కోర్స్, తమిళ నాడు, కేరళ ముఖ్యమంత్రులు కూడా సమావేశానికి హాజరు కాలేదు. కానీ,  ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడానికి, తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కాకపోవాడాన్ని ఒకే గాటన కట్టలేమని, అధికారులు అంటున్నారు. విభజన హామీల అమలు, కేంద్రం జోక్యంతో పరిష్కారం కావలసిన సమస్యలు ఎన్నో ఉన్న నేపధ్యంలో ముఖ్యమంత్రి జోనల్ సమావేశానికి హాజరు కాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని, అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

కాగా హుజూరాబాద్ ఓటమి తర్వాత, ఇటు కేంద్రం పైనా అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైన యుద్ధాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సంకేతంగా తమ ధిక్కారాన్ని తెలియచేసేందుకే, సమావేసానికి హాజరుకాలేదా?థర్డ్ ఫ్రంట్ వైపు వెళుతున్నానన్న సంకేతాలు ఇచ్చేందుకు తిరుపతి సమావేశానికి హోమ్ మంత్రి ముహ్మద్ అలీని పంపి తాను దూరంగా ఉన్నారా? అనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో చురుగ్గా సాగుతోంది. 

అలాగే హుజూరాబాద్ ఓటమి తర్వాత వరసగా రెండు రోజులు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, అటు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపధ్యంలో,జోనల్ సమావేశానికి హాజరై, అడగ వలసిన ప్రశ్నలు అడగలేని పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా, ‘తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ’ రూటులో సమావేశానికి డుమ్మాకొట్టారా, అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

అదే సమయంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య విభజన హామీల అమలు, సమస్యల పరిష్కారానికి మరో రెండేళ్లలో పదేళ్ళ గడువు ముగుస్తున్న నేపధ్యంలో హామీల అమలు, సమస్యల పరిష్కారం కాకుండా అడ్డుకునేందుకు,తద్వారా సెంటిమెంట్ మంటల్లో రాజకీయ చలికాచుకునే ఉద్దేశంతో, కేసీఆర్, కీలక భేటీకి దూరంగా ఉన్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. అయితే, రాజకీయ ప్రయోజనాలను ఆశించి, కేంద్ర రాష్ట్ర సంబధాలను రాజకీయం చేయడం వలన రాష్ట్రానికే నష్టమని, ముఖ్యంగా ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇలా కేంద్రంలో కయ్యానికి కాలు దువ్వడం వలన నష్టపోయేది రాష్ట్రమే కానీ, కేంద్రం కాదని సీనియర్ అధికారులు అంటున్నారు. చెరువు మీద అలిగితే .. చెరువుకు వచ్చే నష్టం ఉండదు, అలాగే అత్తమీద కోపం దుత్త మీద చూపినా అంతే అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.