కాంగ్రెస్ నేతలకు లేని బాధ కేటీఆర్ కు ఎందుకు?

Publish Date:Dec 17, 2023

Advertisement

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఓ అలవాటు ఉంది. సబ్జెక్టు ఏదైనా ఆయన మొదలు పెడితే ఎదుటి వాళ్ళు ఆయన మాట వినే వరకూ వదిలి పెట్టరు. ముందు మొండిగా వాదన మొదలు పెట్టి.. అవసరమైతే ఎదుటి వాళ్లను బుకాయించి, గదమాయించి, బలవంతంగానైనా తన మాటే నిజం అనేలా చేసుకొని, చివరకు అవతలి వాళ్ళను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇక కేసీఆర్ కు మరో అలవాటు కూడా ఉంది. ముందుగా శత్రు వర్గాన్ని విభజించి ఒక్కొక్కరినీ తనకి అనుకూలంగా మార్చుకొని.. తన వైపు రానివాళ్ళని వాళ్ళ వర్గంతోనే దెబ్బ తీస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే కేసీఆర్ ఈ వ్యూహాన్ని మొదలు పెట్టగా.. ఆ తర్వాత కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలందరూ ఇదే వ్యూహంతో రాజకీయం చేస్తూ వచ్చారు. చివరికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టినా బీఆర్ఎస్ తమ పాత పద్దతులను వ్యూహాలను మర్చిపోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సభ వాడీవేడీగా సాగింది. కాగా, బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలో కూర్చున్నా.. బహుశా తామింకా అధికారంలోనే ఉన్నామనే భావనలో ఉన్నట్లు కనిపించారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులో అది స్పష్టంగా కనిపించింది. వీరి ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, మాటలు చూస్తే తామింకా అధికారంలోనే ఉన్నామనే భ్రమల్లో ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీలో శనివారం జరిగిన చర్చల్లో కేటీఆర్ , హరీష్ మాట్లాడిన మాటలు, వాళ్ళ బాడీ ల్యాంగ్వేజ్ చూస్తే ఆశ్చర్యమేసింది. పదేళ్ళ కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వివిధ శాఖలు చేసిన అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడుతుంటే.. కేటీఆర్, హరీష్ మాత్రం పదేళ్ళకు ముందు  అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కర్నాటకలో ప్రభుత్వ పాలన, ఇందిరాగాంధి హయాంలో జరిగిన విషయాలపై ప్రస్తావిస్తూ   బుకాయింపు మాటలతో సభను, చర్చను పక్క దారి పట్టంచాలని చూశారు.

 ఇక, కేటీఆర్ అయితే తన తండ్రి విభజించు పాలించు అన్న సిద్దాంతాన్ని ఫాలో అయినట్లు కనిపించింది. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మా భట్టి అన్న, మా శ్రీధరన్న, మా దామోదరన్న, మా ప్రభాకరన్న, మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి అన్న అంటూ మంత్రులను సంబోధిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వచ్చేసరికి సీఎం గారు అంటూ సంబోధించారు. అన్న అంటూ సంబోధించడం మంచిదే కదా అనుకుంటే మంచిదే.. కానీ, ఒకే పార్టీకి చెందిన మంత్రులను అన్న అంటూ సంబోధిస్తూ.. రేవంత్ రెడ్డిని మాత్రం సీఎం గారు అంటూ సంబోధించడం చూస్తే.. మంత్రులందరూ మా వారే, సీఎం ఒక్కరే కాదు అని   కేటీఆర్ చెప్పకనే చెప్పారు. ఇక మంత్రులను పేరు పేరునా అన్నా అంటూ సంభోదిస్తూ.. వీరందరు కలిసి పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ అనే పుట్టలో దూరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారని వ్యాఖ్యానించారు. చీమలు పెట్టిన పుట్టలో పాము దూరి ఆక్రమించుకున్నట్లు ఉందని కేటీఆర్ పాత సామెతను కాంగ్రెస్ కు అన్వయించి చెప్పారు.

 కేటీఆర్ మాట్లాడింది చూసేందుకు రేవంత్ వైపు వ్యతిరేకంగా కనిపించినా.. మిగతా కాంగ్రెస్ నేతలను ఇది రెచ్చగొట్టడం లాగానే కనిపిస్తుంది.  నిజానికి బీఆర్ఎస్ పార్టీ నేతలలో ఎక్కువ శాతం మిగతా పార్టీల నుండి వచ్చిన వారే.   ఉద్యమ వేళలో సమైక్య వాణిని వినిపించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారిని ఏరికోరి పార్టీలోకి తెచ్చి మంత్రి పదవులు ఇచ్చారు. అలాంటిది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ స్వశక్తితో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఆయన సీఎం అయ్యారు. రేవంత్ సీఎం అంటే మిగతా కాంగ్రెస్ నేతల నుండి వ్యతిరేకత రాలేదు. కానీ, అదేంటో కేటీఆర్ కు ఇబ్బందిగా ఉన్నట్లు ఉంది. అయినా కాంగ్రెస్ వారికి లేని బాధ కేటీఆర్ కు ఎందుకని సొంత పార్టీ నేతల నుంచే కామెంట్స్ వస్తున్నాయి.  కానీ, కేటీఆర్ తన తండ్రి విభజించు పాలించు సిద్ధాంతాన్ని కాంగ్రెస్ నేతలపై ప్రయోగిస్తున్నట్లు  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.