కేసీఆర్ బీఆర్ఎస్ విషయంలో పునరాలోచనలో పడ్డారా?

Publish Date:Oct 17, 2022

Advertisement

ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్ హైదరాబాద్ లో ఉన్నారు. సోమవారం (అక్టోబర్17న) హైదరాబాద్ వేదికగా ఒడిశా పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఆ సదస్సులో పాల్గొనేందుకు నవీన్ పట్నాయక్ ఆదివారమే హైదరాబాద్ వచ్చారు. ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వాగతం పలికారు. అంతే అంతకు మినహా రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికార తెరాస కానీ ఆయనను ఇసుమంతైనా పట్టించుకోలేదు. గతంలో తన జాతీయ రాజకీయ ప్రస్థానం కోసం మద్దతు కోరేందుకు కేసీఆర్ ఒడిశా వెళ్లి మరీ నవీన్ పట్నాయక్ ను కలిశారు.

అప్పుడు నవీన్ పట్నాయక్ స్వయంగా కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి వస్తే ఎటువంటి మర్యాదలు చేయాలో అన్నీ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణలో నవీన్ పట్నాయక్ కు అటువంటి స్వాగత సత్కారాలు లభించలేదు. కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో చేస్తున్నది ఏమిటన్నది ఎవరికీ తెలియని ఒక రహస్యోదమ్యంగా సాగుతోంది. ఆయన ఢిల్లీ పర్యటన విశేషాలు మీడియాలో కానీ, సామాజిక మాధ్యమంలో కానీ ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారన్నది పార్టీ ముఖ్యులకైనా తెలుసా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఆరు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ కోసం నిర్వహించిన సమావేశాలు కానీ, సదస్సులు కానీ ఏమీ లేవు. మీడియా ముందకు అసలే రాలేదు. ఒక జాతీయ పార్టీని పెట్టిన తరువాత తొలి సారిగా దేశ రాజధానిలో అడుగుపెట్టిన ఆయన తన జాతీయ రాజకీయ అజెండాను ఆవిష్కరిస్తారని అంతా భావించారు.

ఏదో మొదట ఓ రెండు రోజులు బీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ భవన్ నిర్మాణాలను పరిశీలిస్తూ మీడియాలో కనిపించారు. అంతే ఆ తరువాత ఆయన హస్తినలో ఏం చేస్తున్నారు? ఎంత కాలం ఉంటారు అన్న దానిపై పార్టీ నుంచి కానీ, ఆయన నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు. ఇక నవీన్ పట్నాయక్ హైదరాబాద్ పర్యటన వద్దకు వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ స్వాగతం పలకడం విధాయకం. నిజంగా అత్యవసర పనుల నిమిత్తం ఆయన హస్తినలో ఉంటే.. అనుకోవచ్చు. అసలు అధికారిక కార్యక్రమాలంటూ ఏమీ లేకుండా వెళ్లి హస్తినలో కూర్చున్న కేసీఆర్ మర్యాద పూర్వకంగా ఒక ఆహ్వాన ప్రకటన కూడా జారీ చేయకుండా పట్నాయక్ పర్యటన విషయాన్ని పూర్తిగా విస్మరించడమేమిటని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. తనకు అవసరమైనప్పుడు పని గట్టుకుని వెళ్లి మరీ మంతనాలు జరిపి వచ్చారు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు.. దీని వెనుక నవీన్ పట్నాయక్ తన జాతీయ పార్టీకి మద్దతుగా లేదా అనుకూలంగా ఎటువంటి ప్రకటనా చేయకపోవడమేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కోణంలో ఆయనతో సమావేశం అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెళ్లి చర్చలు జరిపారు.  

సరే ఇప్పుడ కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వేలే కాదు.. రెండు కాళ్లూ పెట్టేశారు. కలిసి వస్తారని అనుకున్నా.. అనుకోకపోయినా.. బీజేపీయేతర పార్టీల నేతలందరినీ కలిసి మద్దతు కోరాల్సిన అవసరం ఇప్పుడు కేసీఆర్ కు  ఎంతో ఉంది. అయినా స్వయంగా నవీన్ పట్నాయక్ తెలంగాణలో అడుగిడినా ఆయనతో చర్చలు జరపలేదు.

ఆయన సరే హస్తిన లో ఉన్నారు. కానీ బీఆర్ఎస్ కు మద్దతు కోరుతూ ఆయన తరఫున మరెవరైనా.. మరెవరి దాకాలో ఎందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కుమారుడు కేటీఆర్ ను అయినా నవీన్ పట్నాయక్ వద్దకు పంపి ఉండాలి అలాగా చేయలేదు.  దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో పునరాలోచిస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. బీఆర్ఎస్ ప్రకటన అయితే చేసేశారు కానీ.. దానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి అడుగులూ వేయకపోవడమే తమ  అనుమానాలకు కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

By
en-us Political News

  
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.