కవిత కోసం కామారెడ్డికి..

Publish Date:Aug 22, 2023

Advertisement

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. తనపై, తన పరిపాలనపై తెలంగాణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం క్లియర్ కట్‌గా అర్థమైందా? ఆ క్రమంలోనే ఆయన కామారెడ్డి నుంచి కూడా ఎన్నికల బరిలోకి దిగాలని  నిర్ణయించుకొన్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలోకి దిగితే.. ఆ చుట్టు పక్కల ఉన్న జిల్లాలు.. నిజామాబాద్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్‌లపై కూడా ఆయన గెలుపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని... అలాగే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్లీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. పోటీకి దిగితే.. ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందనే ఓ చర్చ సైతం సదరు పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. 

ఎందుకంటే.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ధర్మపూరి అర్వింద్ చేతిలో కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఈ సారి ధర్మపూరి అర్వింది.. ఎంపీగా లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. అలాంటి వేళ.. ఈ జిల్లాలో కేసీఆర్ పోటీ చేస్తే... అతడి విజయాన్నే కాదు.. బీజేపీ ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు అడ్డుకోవచ్చుననే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. 

అదీకాక.. దక్షిణ తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా వేళ్లూనుకొంటొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా జిల్లాల నుంచి బరిలో దిగే కంటే.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కారు పార్టీని షికార్ చేయిస్తే.. అది తనకు తన ఫ్యామిలీకి రాజకీయంగా కలిసి వస్తుందనే ఓ ఆలోచనతో కామారెడ్డి నుంచి బరిలోకి దిగేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. 

అదీకాక.. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిని గంపగుత్తగా గెలుచుకొంటే.. దేశ రాజధాని హస్తిన పీఠాన్ని సునాయాసంగా కైవనం చేసుకోవచ్చునన్న విషయం అందరికి తెలిసిందే.  అందుకే ప్రధాని మోదీ గతంలో సొంత రాష్ట్రం గుజరాత్‌లోని బరోడా నుంచే కాకుండా.. యూపీలోని వారణాసి నుంచి కూడా పోటీ చేసి.. రెండు చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బరోడా లోక్‌సభ స్థానాన్ని వదులుకోగా.. సదరు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందిన విషయం విధితమే.  

దాదాపుగా అటువంటి ఆలోచనే.. గులాబీ బాస్ చేస్తున్నారని.. అయితే తన సొంత జిల్లా ఉమ్మడి మెదక్ నుంచి దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నా.. ప్రస్తుతం సదరు జిల్లాలో తనకు ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు రావడంతో.. ఆయన అప్రమత్తమై.. అటు గజ్వేల్ నుంచి ఇటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం... ఓ వేళ రెండు చోట్లు నుంచి గెలుపొందితే.. ఆ తర్వాత కామారెడ్డికి కేసీఆర్ రాజీనామా చేసి.. ఆ స్థానం నుంచి తన కుమార్తె కవితను గెలుపించుకొని.. అసెంబ్లీకి తీసుకువెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం తెలంగాణ పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది. 
    
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత....తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ ఫలితాలతో తెలంగాణలో బీజేపీ కొద్దిగా డల్ అయింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పుకు కమలం పార్టీ అగ్రనేతలు శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపుతో తెలంగాణలోని ఆ పార్టీకి నయా జోష్ వచ్చినట్లు అయింది. ఆ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఈ సారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అలాంటి పరిస్థితుల్లో ముచ్చటగా మూడోసారి అధికారం అందుకోవడం కోసం.. తెలంగాణలో కారు పార్టీని షికార్ చేయించడం కోసం.. గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే కామారెడ్డి నుంచి పోటీ చేయమని పార్టీ శ్రేణులు కొరాయంటూ.. ఆయన కొత్త పల్లవి అందుకోవడం వెనుక ఇంత కథ ఉందని పోలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

By
en-us Political News

  
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.