ఉప ఎన్నికలకు భయపడుతున్నారా? జగన్, కేసీఆర్ వ్యూహమేంటీ? 

Publish Date:Sep 4, 2021

Advertisement

అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కరోనా ఒక ముగిసిన అధ్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే, కరోనాతో సహజీవనం తప్పదని ఎప్పుడోనే తేల్చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో బడులు, గుడులు, సినిమా ధియేటర్లు ... బార్లు... అన్నీ బార్లా తెరిచారు. తెలంగాణలో అయితే, రాజకీయ జాతరలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయినా, అక్కడ ఏపీలో ఒకటి (బుద్వేల్) ఇక్కడ (హుజూరాబాద్) అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల విషయంలో మాత్రం, వామ్మో ... కరోనా అంటూ భయాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉప ఎన్నికలు నిర్వహించడం ఇప్పట్లో అయ్యే పని కాదని, చేతు లెత్తేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు దసరా తర్వాతే నిర్వహిస్తామని ప్రకటించింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజానికి కరోనాకు భయపడతున్నారా లేక జనానికి భయపడుతున్నారా? అంటే, రెండవదానికే అనుకోవలసీ వస్తోంది. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ, ప్రస్తుతానికి అయితే, రెండు రాష్ట్రాలలో కరోనా కొంచెం అటూ ఇటుగా చాలా వరకు కంట్రోల్లోనే ఉందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి.  అదెలా ఉన్నా, అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాలలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అభ్యర్ధనలను కాదనలేక కేజీ టూ పీజీ తరగతుల విద్యార్ధులకు ఒకేసారి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాయి. విద్యావ్యాపారం మాత్రమే కాదు, అన్ని ఆర్థిక కార్యకలాపాలు సాగిపోతూనే ఉన్నాయి. తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా  ఒక్క వినాయక చవితి మినహా అన్ని మతపరమైన, ఊరేగింపులు ఇతరేతర  కార్యక్రమాలకు  రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఉపింది. 

తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్, తమ శక్తి యుక్తులు అన్నిటినీ ఉపయోగిస్న్తున్నారు. నిధులు ప్రవాహం, దళిత బంధు, పదవుల పందారం, పెన్షన్లు, రేషన్ కార్డులు ఒకటని కాదు చేతిలో ఉన్న అధికారం మొత్తాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. రాజకీయంగానూ సొంత పార్టీ స్థానిక నాయకులు మొదలు, పక్క పార్టీల నాయకులను కారెక్కించి, రేటు ఎంతైనా డోంట్కేర్ అంటూ కండువాలు కప్పేస్తున్నారు. ఇంతచేసినా, ఎక్కడో ఏదో అనుమానం, ఓటమి తధ్యం అన్న భయం ఆయన్ని వెంటాడుతున్నాయి కావచ్చు, అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలేంని చేతులెత్తేసింది. 

ఇక ఏపీ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అన్వర్యమైంది , నిజానికి, హుజూరాబాద్ ఉప ఎన్నికకు డిసెంబర్ 12 వరకు  సమయముంది, కానీ బద్వేల్ నియోజకవర్గంలో ఆరు నెలల గడువు సెప్టెంబర్ 28తో ముగుస్తోంది. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ఎన్నికల సంఘాన్ని ఉప ఎన్నిక వాయిదా కోరారంటే, ఓడిపోతామనే భయమే కానీ, కరోనా కారణం కాదని వేరే చెప్పనక్కరలేదని,పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో, అధికార పార్టీలో చాలా కాలంగా సాగుతున్నఅంతర్గత పోరు ఇటీవల కాలంలోతారాస్థాయికి చేరింది. స్వపక్షలో విపక్షం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. పార్టీలోని ప్రత్యర్ధి వర్గాలు ఒఅక్రిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. బద్వేల్ సహా ఇంచుమించుగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో రాజకీయ అదుపత్య పోరు రక్తి కట్టిస్తోంది. రాజకీయ ఆధిపత్యంతో పాటుగా  కాంట్రాక్టుల వరకు పార్టీ నాయకులు తగవు పడుతున్నారు. మరోవంక, ముఖ్యమంత్రి బాబాయ్ ముదర్ కేసు విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. అలాగే, వైఎస్ ఫ్యామిలీలో కుటుంబ తగవులు కూడా కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది.   

మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికకు చాలా ముందుగానే దూకుడు పెంచారు. ఉప ఎన్నికకు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసేశారు. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా 2019 పోటీచేసిన ఓబులాపురం రాజశేఖర్‌ను బరిలో దింపనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా మరీనా పరిస్థితులలో టీడీపీ అభ్యర్ధి గట్టిపోటీ ఇస్తారని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి.దీంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  సొంత గడ్డపై మరో రసవత్తర రాజకీయ పోరుకు రంగం సిద్దమైంది. ఇంకా వేడి రాచుకోకపోయినా, ముందు ముందు మరో హుజూరాబాద్ గా మారినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.