ఇంతలా చెబుతున్నా ఎందుకు నమ్మరు.. జనంపై సజ్జల ఆక్రోశం!

Publish Date:Oct 19, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అవినీతికి  పాల్పడ్డారు. స్కిల్ స్కాంలో ఆయనకు ముడుపులు అందాయి. అని ఎంతగా చెబుతున్నా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? మేం ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు? అంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి జనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం చెప్పేది మీరు నమ్మి తీరాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంత చెప్పినా ఎందుకు నమ్మడం లేదంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

గత  40 రోజులుగా చెప్పించే చెబుతూ వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డీ నెత్తీ నోరూ బాదుకుని మరీ చెబుతున్నా జనం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మడం లేదు. ఆయనను జగన్ సర్కార్ కక్ష పూరితంగా అరెస్టు చేసిందంటూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలంటే ఎందుకొచ్చిన గొడవ.. కేసులు, దాడులను ఎదుర్కొనవలసిన అవసరం ఏముంది? అనుకుంటూ తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ మనస్సులలోనే దాచుకుని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ గడిపేసిన జనం ఇప్పుడిక తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ  దాచుకోవడానికి, అణచుకోవడానికి ప్రయత్నించడంలేదు.

ప్రభుత్వ వ్యతిరేకతను బాహాటంగా, బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. దీంతో సజ్జల వారికి చిర్రెత్తుకొచ్చింది. మీడియా సమావేశం పెట్టి మరీ  ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంటూ మేం చెబుతున్నా మీరెందుకు నమ్మరు? చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మిమ్మల్ని నమ్మించడానికి ఇంకా ఏం చేయాలి అని ప్రశ్నించారు. ఔను మీడియాలో ఆయన మాట్లాడిన విషయాల సారాంశమిదే. దీంతో ఇప్పటి వరకూ ఏమో స్కిల్ కేసులో కుంభకోణం ఉందేమో అని జనంలో ఏమూలైనా అనుమానాలు ఉండి ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి. సజ్జల మాటల తరువాత చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగానే అక్రమ కేసు బనాయించి జైలుకు పంపించారని విస్పష్టంగా అర్ధమైంది.

ఇదే విషయంపై నెటిజన్లు సజ్జలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే ఇరికించిందనడానికి సజ్జల మాటలే నిదర్శనమంటూ ఫైరౌతున్నారు. వైసీపీ చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు జనం నమ్మడం లేదనడానికి సజ్జల మాటలే సాక్ష్యమంటూ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వివరిస్తున్నారు.  ఆధారాలతో సహా చంద్రబాబును అరెస్టు చేశామంటూ ఓ వైపు సజ్జల అండ్ కో  చెబుతుంటే.. న్యాయస్థానాలలో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం.. ఆధారాలా వాటి గురించి అడగకంటి.. స్కిల్ కేసులో అవినీతి జరిగింది. ఇక ఇప్పుడు ఆధారాలు సేకరించడం కోసమే చంద్రబాబును అరెస్టు చేశాం అంటూ చెబుతున్నారు. సెక్షన్ 17ఏపై కూడా అదే వితండ వాదన అటుతిప్పీ ఇటు తిప్పీ వినిపిస్తున్నారు.

 రేపు, మాపు అంటూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. స్కిల్ కేసులో తనకు కావలసింది బెయిలు కాదు.. అసలు కేసే కొట్టేయాలంటూ చంద్రబాబు ధర్మాగ్రహంతో న్యాయపోరాటం సాగిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ స్కిల్ కేసులో ఆధారాలు చూపలేక.. నీళ్లు నములుతోంది. అవినీతి జరిగిందని చెబుతున్నాం కదా.. కేసు కట్టేశాం.. ఇక ఇప్పుడు ఆధారాల కోసం విచారిస్తాం అంటున్నారు.   అందుకే సజ్జల మీడియా ముందుకు వచ్చి ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు అంటూ జనాన్ని నిందిస్తున్నారు. వాస్తవాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తుంటే జనం అబద్ధాలు ఎందుకు  నమ్ముతారన్న లాజిక్ ను సజ్జల మరచిపోయారు పాపం. 

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.