సోరెన్ కో న్యాయం , జగన్ కో న్యాయం .. ఇదెక్కడి అన్యాయం ?

Publish Date:Aug 27, 2022

Advertisement

చట్టం ముందు అందరూ సమానమే, కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టిలో కొందరు ఎక్కువ సమానం.అవును,ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్’ అధికార దుర్వినియోగానికి పాల్ప డ్డారనే ఆరోపణపై, కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పై కొరడా ఝుళిపించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. 

అయితే, ఇంతకీ సోరెన్ చేసిన నేరం ఏమిటి? ఎన్నికల సంఘం ఆయనపై వేటుకు ఎందుకు సిఫార్సు చేసింది? అంటే, ముఖ్యమంత్రి సోరెన్ తనకు తానే మైనింగ్‌ కేటాయించుకుని,అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారనే ఆరోపణపై ఎన్నికల సంఘం విచారణ జరిపింది. ఆరోపణలు నిజమని తేలడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే  ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈసీ ఆ రాష్ట్ర  గవర్నర్’ కు సూచించింది. గవర్నర్ సోరెన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. 

ఇంతవరకు అంతా బాగుంది. కానీ, సోరెన్’కు వర్తించే చట్టం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించదు అనేదే, ఇప్పుడు అందరిముందున్న ప్రశ్న. నిజానికి, జగన్ రెడ్డి, ముఖ్య మంత్రిగా కాదు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కుమారుడి హోదాలోనే అనేక అక్రమాలకు పాల్పడ్డానే ఆరోపణలున్నాయి. పదికి పైగా అక్రమాస్తుల కేసుల్లో ఆయన ‘ఎ వన్’ గా ఉన్నారు. అరెస్టయ్యారు. పదహారు నెలలు జైల్లో ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జగన్ రెడ్డి ఆస్తులు కొన్నింటిని జప్తు చేసింది. ఈరోజుకు కూడా ఆయన బైలు మీదనే ఉన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావలసి ఉన్నా, ఏదో ఒక సాకున వ్యక్తిగత హజరు నుంచి మినహాయింపు పొదుతు న్నారు. 

అదెలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి, సోరెన్ బాటలోనే పయనిస్తున్నారు. నిజానికి, సోరెన్ బాటలో జగన్ కాదు జగన్ బాటలోనే సోరెన్ తప్పటడుగులు వేస్తున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడు సంవత్సరాల కాలంలో, జగన్ రెడ్డి ఫ్యామిలీ వ్యాపారాలకు ప్రభుత్వ నిధుల కేటాయిం పులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పత్రిక సాక్షికి.. నేటికీ నెలకు రూ. ముఫ్పై కోట్ల వరకూ ప్రజాధనం ప్రకటనల రూపంలో పంపిణీ అవుతూ ఉంటుంది.

పల్నాడులో ఇంత వరకూ కట్టని సరస్వతి పవర్ పరిశ్రమకు పెద్ద ఎత్తున గనుల కేటాయింపులు చేసుకున్నారు. నీటి కేటాయింపులు కూడా చేసుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున కొంటున్న సిమెంట్‌ లో అత్యధికం భారతీ సిమెంట్‌దే. ఇలా చెప్పుకుంటూ పోతే..జార్ఖండ్ సీఎం సోరెన్ చేసింది చాలా చిన్న తప్పు. 

అందుకే, ఒక్క తప్పు చేసిన సోరెన్ అనర్హుడు అయితే, జగన్ ఎలా అర్హుడవుతారు? సోరెన్’కు ఒక రూలు జగన్ రెడ్డికి మరో రూలు, ఏమిటి? ఇదెలా న్యాయం అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రధాని మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులోట్టు తున్నారు, కాబట్టి ఆయన జోలికి రావడం లేదని, సోరెన్ విపక్ష శిబిరంలో ఉన్నారు కాబట్టే ఈసీ,ఆయన మెడ మీద కట్టి పెట్టిందని అంటున్నారు.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.