వైసీపీకి ఇప్పుడే కాపులు ఎందుకు గుర్తొచ్చారు?

Publish Date:Jun 17, 2026

Advertisement

 

గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్ధిగా కమ్మ వర్గానికి చెందిన లింగమేనేని రమేష్‌ను ఖరారు చేయడాన్ని అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. జనసేన కోసం గ్రౌండ్ లెవల్లో ఎప్పుడు పనిచేయని లింగమనేనిని రాజ్యసభకు ఎలా పంపుతారని ప్రశ్నిస్తోంది. అసలు కాపు ఓట్లతో గెలిచిన జనసేన వారిని కాదని కమ్మ వ్యక్తికి పదవి కట్టబెట్టడం అన్యాయమంటూ కుల రాజకీయానికి తెర లేపాలని చూస్తోంది. 

సాధారణంగా పార్టీల్లో సీటు ఆశించి దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కాని రాజ్యసభ అభ్యర్ధుల ప్రకటన తర్వాత కూటమి పార్టీల్లో ఆ పరిస్థితి లేదు. విచిత్రంగా వైసీపీ జనసేనలో కాపు కులానికి అన్యాయం జరిగిపోయిందని యాగీ చేస్తోంది. జనసేన, టీడీపీ నాయకుల కంటే వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కాపులు, ఎస్సీలు, బీసీలకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. గతంలో లింగమనేని స్వయంగా చిరంజీవిని తిట్టారని, కాపులకి దేవుడి సమానమైన మెగాస్టార్‌ని తిట్టిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏంటని వైసీపీలోని సోకాల్డ్ కాపు బ్యాచ్ తెగ ఫీలైపోతున్నారు. 

ఇదంతా జనసేనలో కాపు శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నమే. అయితే జనసేన కేవలం కాపుల కోసం పెట్టిన పార్టీ కాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. వాస్తవానికి జనసేనల కాపులకు సముచిత స్థానం కల్పించింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు ఆ వర్గం వారే. సగం మంది ఎమ్మెల్యేలతో పాటు జనసేన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా కాపులే. 

టీడీపీ ఈ సారి ఒక కమ్మ, ఒక కాపు, ఒక బీసీకి అవకాశం ఇచ్చింది.  కూటమి నుంచి కాపు నేత సానా సతీష్ రాజ్యసభకు రెండో సారి అవకాశం దక్కించుకున్నారు. కూటమి ఇద్దరు కమ్మవారికి అవకాశం ఇచ్చిందని ప్రచారం చేస్తున్న వైసీపీ, అదే కూటమి కాపుని కూడా పెద్దల సభకు పంపిందని చెప్పలేకపోతోంది. కొడకు కోటరీలో చంద్రబాబు లాబీయిస్టులకు అవకాశమిచ్చారని, ఎస్సీలకు కూడా అన్యాయం చేశారని వితండ వాదం చేస్తోంది. మహానాడులో మహిళలకు మూడో వంతు సీట్లిస్తామని ప్రకటించిన టీడీపీ ఒక్క మహిళను కూడా రాజ్యసభకు ఎంపిక చేయలేదని లాజిక్ లేవనెత్తుతున్నారు. 

జగన్ అధికారంలో ఉన్నప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేరు. కాపుల మీద ఇప్పుడు అంత ప్రేమ చూపిస్తున్న వైసీపీ తన హయాంలో ఒక్క కాపుని కూడా రాజ్యసభకు పంపలేదు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో ఆరుగురు రెడ్లే. అయితే చంద్రబాబు మాత్రం బడాబాబులను రాజ్యసభకు పంపుతున్నారని సొంత మీడియాలో వైసీపీ ఊదరగొడుతోంది. 

వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, జగన్ కేసులు వాదించే తెలంగాణ లాయర్ నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వాని, వైవీ సుబ్బారెడ్డి, 2 సార్లు రాజ్యసభ అవకాశం దక్కించుకుని తర్వాత వైసీపీకి రిజైన్ చేసిన విజయసాయిరెడ్డి వీరంతా బడాబాబులే.  ఇలాంటి వారందరికీ అవకాశం కల్పించిన జగన్ ఇప్పుడు డబ్బు సంచుల ఉన్న వారినే కూటమి రాజ్యసభకు పంపుతోందని విమర్శించడం గురవింద గింజ సామెతను గుర్తు చేస్తోంది. ఏపీలో కూటమి నుంచి ప్రస్తుతం ఉన్న, ఇప్పుడు కాబోయే రాజ్యసభ సభ్యులు ఏడుగురిలో నలుగురు బీసీలు,  ఇద్దరు కమ్మ, ఒక కాపు ఉన్నారు. అదే వైసీపీకి ఇప్పుడు మిగిలి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు రెడ్లు, ఒక ఎస్సీ ఉన్నారు. 

తాజాగా జగన్ తన పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో భేటీ అయ్యారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్న ‘కాపులను వేరు చేయడం ఎలా?’ అనే విషయంపైనే వారికి గీతోపదేశం చేశారంట. కాపులు కూటమితో ఉంటే తాము అధికారంలోకి రావడం జరిగే పని కాదని తెలిసే వైసీపీ కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తోందని దీంతో స్పష్టమవుతోంది.

సామాజిక వర్గ న్యాయంలో చంద్రబాబు ఎంత ఆచితూచి వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2028లో ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం దక్కని వర్గాలకే చంద్రబాబు కేటాయిస్తారు. పదవుల కేటాయింపులో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో టీడీపీ అధినేత ముందుంటారు. అలాంటిది ప్రభుత్వ సలహాదారుల దగ్గర నుంచి అన్ని పదవుల్లో రెడ్లకు పెద్ద పీట వేసిన వైసీపీ ఇప్పుడు కాపులకు అన్యాయమంటూ, కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తుండటం హాస్యాస్పదంగా మారింది

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.