బ్యూరోక్రాట్లకు రాజకీయాలు అందని ద్రాక్షపండేనా?

Publish Date:Jun 12, 2023

Advertisement

భారత రాజ్యాంగం పరిపాలనను రెండు రకాలుగా వర్గీకరించింది. అందులో ఒకటి ఎన్నికకాబడ్డ(ఎలక్టెడ్) రెండవది ఎంపిక (సెలెక్టెడ్). ప్రజల ఓటుతో ఎన్నికలలో విజయం సాధించిన రాజకీయ నాయకులు మొదటిరకం కాగా, అత్యున్నత చదువులు చదివి సివిల్ సర్వెంట్లుగా పని చేసే వారు రెండవ రకం పాలనా బాధ్యులు. రాజకీయాలలో ముగిని తేలే మన రాజకీయ నాయకులు ఎట్టిపరిస్థితుల్లోనూ సివిల్ సర్వెంట్ల అవతారం ఎత్తలేరు. కానీ కనీసం 30 సంవత్సరాలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన సివిల్ సర్వెంట్లు రాజకీయాల రుచి మరుగుతున్నారు. రాజకీయరంగంలో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. అయితే వారిలో అతి కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది కాలం మాత్రమే రాజకీయాలలో మనగలుగుతున్నారు. 

 బ్యూరోక్రాట్ల రాజకీయ రంగ ప్రవేశానికి తెలుగురాష్ట్రాలలో ఆద్యుడు ఎవీఎస్ రెడ్డి. డిఫెన్స్ లో పని చేస్తూ, ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఏవీఎస్ రెడ్డి భారతదేశం అనే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టారు.  సర్వీసులో ఉండగానే రాజకీయ పార్టీ  ప్రకటన అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉద్యోగానికి  రాజీనామా  చేసి పార్టీని  ప్రకటించిన ఏవీఎస్ రెడ్డి రాజకీయాలు తనకు సరికావని గ్రహించి కొంత కాలం ఉద్యోగానికి దూరంగా ఉన్నారు. తిరిగి ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సర్వీసు ముగించారు. ఆయన బాటలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి బ్యూరోక్రాట్లు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ తరఫున 2009 లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీలో కాలు పెట్టగా, వరప్రసాద్ తిరుపతి పార్లమెంటు నియోజవర్గం నుండి, ప్రస్తుతం గూడూరు అసెంబ్లీ నుండి చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించారు. గతంలో రావెల కిషోర్ బాబు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేయగా, ఆదిమూలం సురేష్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ 2019లో విశాఖ నుండి ఓడిపోగా, తోట చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.  బ్యూరోక్రాట్ లుగా సమర్థవంతంగా పని చేసిన వారు రాజకీయాలలో ఎందుకు మనలేకపోతున్నారన్న అంశంపై చర్చ సాగుతోంది. 

రాజకీయాలను దగ్గరగా చూసిన అనుభవంతో, ఈ వ్యవస్థను మార్చాలన్న ఆవేశం బ్యూరోక్రాట్ లను రాజకీయాలవైపు మరలిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.  తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ తదననంతరం ఫక్తు రాజకీయ పార్టీగా మారడమే రాజకీయమని విశ్లేషకుల వాదన. తీరా రాజకీయాలోకి వచ్చిన తరువాత ఇక్కడి పరిస్థితిని అర్ధం చేసుకుని నోరెళ్లబెడుతున్నారని, నిజాలు నిలకడగా తెలిశాక ఏమి చేయాలో పాలుపోని స్థితిలో బ్యూరోక్రాట్ లు ఉన్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

రాజకీయాలలో మనుగడ సాగించాలంటే కావలసిన వనరులు సేకరించడంలో బ్యూరోక్రాట్లు విఫలం అవుతున్నారు. రాజకీయ నాయకులకు ఏండే జనాకర్షణ, ప్రజలలో మమేకమయ్యే అలవాటు ఐఏఎస్ లకు ఉండక పోవడం మరో కారణంగా చెప్పాలి. ఇలా ఉంటే ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తూ ఆప్ అనే రాజకీయపార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ దేశంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగారు.

ఇందుకు కారణాలను అన్వేషిస్తే కేజ్రీవాల్ ఉద్యోగ జీవితమే ఒక ఉద్యమంలా సాగింది. రాజకీయాల ద్వారా సమాజాన్ని మార్చాలనే ఆలోచన కేజ్రీవాల్ కు మొదటి నుండీ ఉంది. అన్నాహజారే లోక్ పాల్ బిల్లు ఆందోళన కేజ్రీవాల్ కు కలసి వచ్చింది. బీజేపీ లోపాయకారి మద్దతుతో ఆప్ స్థాపన, గెలుపు కేజ్రీవాల్ కు సాధ్యమైంది. కానీ తెలుగు రాష్ట్రాలలో బ్యూరోక్రాట్ ల పరిస్థితి భిన్నంగా ఉంటోంది. కేవలం రిటైర్ మెంట్ బెనిఫిట్ గా రాజకీయాలను చూడడంతో మన బాబులకు భవిష్యత్ ఉండటం లేదు. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.