ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు ఎందుకు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఒక మహిళతో అసభ్యంగా వీడియో కాల్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన మాధవ్ పై చర్యలు తీసకోవాలంటూ తెలుగుదేశం, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఢిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం ఆ వీడియోపై విచారణ జరిపి గోరంట్ల మధవ్ పై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంతకు ముందు ఈ వీడియో వ్యవహారం వెలుగులోనికి వచ్చిన రోజే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్ పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ తరువాత ఆయన మళ్లీ ఈ వ్యవహారంపై ఇప్పటి వరకూ మాట్లాడలేదు. కానీ హఠాత్తుగా సోమవారం ( ఆగస్టు 8) సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలకుండా చర్యలు ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఏడేళ్ల కిందటి ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ.. అప్పట్లో తెలుగేశం అదినేత గొంతుతో వచ్చిన ఆడియో విషయంలో ఆవాయిస్ చంద్రబాబుదో కాదో ఇప్పటికీ తేల్చలేదన్నారు. గొరంట్ల అసభ్య వీడియో అంశం కంటే చంద్రబాబు వాయిస్ ఇష్యూయే పెద్దదని సూత్రికరించారు.
అయినా గోరంట్ల వ్యవహారంలో ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అంత వరకూ ఆగాలని సజ్జల అన్నారు. గోరంట్ల అసభ్య వీడియో కాల్ బయటపడి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అసలు ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై ఇప్పటి వరకూ నోరిప్పలేదు. ఫోరెన్సీక్ దర్యాప్తు అంటూ సజ్జల ప్రకటించి నాలుగు రోజులైనా ఇప్పటి వరకూ దర్యాప్తుపై ఒక్క అడుగు కూడా ముందుకు కదిలిన దాఖలాలు లేవు.
తాను వెనుకబడిన వర్గానికి చెందినవాడిని కనుకనే తనపై వీడియో లీక్ చేశారంటూ మాధవ్ బీసీ కార్డు ప్రయోగించి తప్పించుకోవాలని చూశారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఈ అంశానికి కులం కార్డు ఆపాదించి జనం దృష్టిని మరల్చాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా.. వైసీపీ, ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరన్నది సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంతో తేలిపోయింది.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ వైసీపీలో అత్యంత కీలక పదవులు అనుభవిస్తున్న వారిపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భంలో కూడ వైసీసీ నాయకత్వం ఇలాగే వ్యవహరించింది. కానీ ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న నటుడు పృథ్వీపై మాత్రం చర్యలు తీసుకుంది. పృథ్వీకి రాజకీయ అండదండలు లేకపోవడం వల్లే పూచిక పుల్లలా తీసిపారేశారని... వైసీపీలో బలమున్న వారికి ఒక రకం న్యాయం, బలహీనులకు మరో రకం న్యాయం అమలవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-action-on-gorantla-madhav-questions-sajjala-39-141518.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది