తెలంగాణ రాజకీయాల్లో ఎవరిది పైచేయి ?

Publish Date:Apr 15, 2023

Advertisement

తెలంగాణ రాజకీయాలలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీదే టాప్ పొజిషన్. ఫస్ట్ ప్లేస్. అందులో అనుమానం లేదు.  అయితే, ముందున్న తిరుగులేని ఆధిక్యత అయితే ఇప్పుడు లేదు. అది కూడా అంతే నిజం. మూడు ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్ కు కొంత ఎడ్జి మాత్రమే ఉందని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు ఇదే పరిస్థితి, అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా, అంటే, అవునని చెప్పడం సాహసమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. రానున్న ఐదారు నెలల కాలంలో రాష్ట్రంలో దేశంలో చోటుచేసుకునే పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎంతో కొంత ప్రభావం  తప్పక చూపుతాయనీ, ఆ ప్రభావంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదనీ,  మారుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.అందుకే, ఈ ఐదారు నెలల కాలమే కీలకమని అంటున్నారు.  

నిజానికి, 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితితో పోల్చుకుంటే, అధికార బీఆర్ఎస్ అంత పటిష్టంగా లేదు. ఒక్క ఆర్థిక పరిస్థితి మినహా ఎన్నికల విజయానికి అవసరమైన మరే ఇతర ఫాక్టర్ లోనూ బీఆర్ఎస్ ముందున్నంత పటిష్టంగా లేదు.  2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)కు కలిసొచ్చిన సెంటిమెంట్, ఇప్పుడు  ఇసుమంతైనా లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని, జాతీయ రాజకీయాల్లో ప్రవేశం కోసం బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ సెంటిమెంట్ బీఆరేస్ వ్యతిరేక సెంటిమెంట్ గా మారుతోందని అంటున్నారు. 

అలాగే ప్రభుత్వ వ్యతిరేకత విషయాన్నే తీసుకుంటే 2018లో ఫిఫ్టీ 50 పర్సెంట్ కంటే తక్కువ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పడు, ఫిఫ్టీ పెర్సెంట్ గీత దాటేసిందని  అంటున్నారు. మరోవంక పార్టీలో పైకి కనిపించే విభేదాలు కొన్నయితే, కనిపించని విభేదాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు, ఇతరత్రా అనేక రూపాల్లో వ్యక్తమవుతున్న విభేదాలు ఎన్నికల సమయానికి ఒక్కొక్కటికీ బయటకు వచ్చి భగ్గుమన్నా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి, పార్టీ అంతర్గత విభేదాలు ఎన్నికల సమయానికి పార్టీ నాయకత్వానికి సవాలుగా మారే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని పార్టీ అంతర్గత వ్యవహరాల పై అవగాహన ఉన్న పార్టీ పెద్దలు చెపుతున్న మాటగా ప్రచారం జరుగుతోంది. 

ముఖ్యంగా  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహరంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అనే భయం బీఆర్ఎస్ నాయకులూ వ్యక్త పరుస్తున్నారు. మరో వంక సస్పెన్షన్ కు తిరుగుబాటు వంటి అనేక పరిణామాలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయని అంటున్నారు. నిజానికి  ఇప్పుడు రాష్ట్రంలో మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఎటు వెళతారు, ఏ పార్టీలో చేరతారు అనే విషయం చుట్టూనే తిరుగుతున్నా, ఆ ఇద్దరే కాకుండా  అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా కొందరు కీలక నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా నిన్న మొన్న కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదలు అనేక మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ను ఎదుర్కోవడం ఒక్క బీజేపీకి మాత్రమే సాధ్యమని బావిస్తున్న నేపధ్యంలో మరి కొందరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.అదే జరిగితే, బీఆర్ఎస్’ హ్యాట్రిక్’ అనుమానమే అంటున్నారు.

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.