సింహాచలం విషాదం..ఈ పాపం ఎవరిది ?

Publish Date:Apr 30, 2025

Advertisement

సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేళ జరిగిన అపశ్రుతి అత్యంత విషాదకరం. గోడ కూలడమే ప్రమాదానికి కారణం అయినప్పటికీ.. ఈ దుర్ఘటన అనేక ప్రశ్నలను తెరమీదకు తీసుకువస్తున్నది.  భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వర్షం ఒక కారణమైతే కావచ్చు కానీ, సింహాచలం అప్పన చందనోత్సవ సమయంలో ప్రతి ఏటా ఏదో ఒక గలాటా జరుగుతూనే ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడటానికి బాధ్యులెవరన్నది తేల్చాల్సి ఉంది. ఏడాది మొత్తంలో ఒక రోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఉంటుంది. ఆ కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.  సరిగ్గా అక్షయ తృతీయ రోజు జరిగే ఈ చందన యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడం రివాజు. అయితే గతంలో కేవలం పరిమిత భక్తులతో  మాత్రమే ఈ యాత్ర సాగేది. అయితే తరువాత తరువాత పరిస్థితి మారింది.

ఇదో వీఐపీ యాత్రగా మారిపోయింది. సాధారణ భక్తుల తాకిడికి తోడు వీఐపీల హడావుడీ అధికమైంది.  ముఖ్యంగా  పోలీస్, పొలిటికల్, జ్యుడిషరీ, దేవాదాయ, రెవెన్యూ  విభాగాల నుంచి వీఐపీల ఎక్కువైపోయింది. దీంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో చ ందనోత్సవ సమయంలో ప్రతిఏటా సమస్యలు ఉత్పన్నమౌతూనే ఉన్నాయి. తాజా సంఘటనే తీసుకుంటే.. మంగళవారం (ఏప్రిల్ 29)అర్ధరాత్రి దాటిన తరువాత, బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.  దీంతో సాధారణ దర్శనం కోసం క్యూ లైన్ లో ముందు రోజు రాత్రి నుంచీ  వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  సరిగ్గా అదే సమయంలో 300 రూపాయల టికెట్ తీసుకున్న భక్తుల క్యూ లైన్ కు  ఆనుకుని ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ గోడను ఇటీవలే తాత్కాలికంగా నిర్మించారు దీనికి బాధ్యులు ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతోంది. నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందా అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 

ఏటా చందనోత్సవం సమయంలో దేవాదాయ శాఖలో ఏదో ఒక సమస్య, ఇబ్బంది సాధారణం అయిపోయింది. ఒకసారి ఈవో కు వ్యతిరేకంగా, మరోసారి ఉద్యోగులకు వ్యతిరేకంగా సంఘటనలు జరుగుతుంటాయి. ప్రధానంగా టికెట్ల  కేటాయింపు విషయంలో  గందరగోళం నెలకొంటుంది.  సాధారణ భక్తులు డబ్బులు ఇచ్చి కొనే టికెట్ల కంటే..  ప్రోటోకాల్ టికెట్లకి ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతున్నది. 
ఇక విషయానికి వస్తే..  గోడ కూలిన ఘటనలో ఏడుగురు  మృతి చెందారు ఘటనా స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. బాధ్యులెవరైనా, ఎంతటి వారైనా వదిలేది లేదని హోంమంత్రి ఇప్పటికే హెచ్చరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించినట్లైతే.. ఈ దుర్ఘటనకు ఇంజినీరింగ్ అధికారుల వైపల్యం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింహాచలం ఆలయంలో ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం చాలా వరకు ఉంటుంది మెట్ల మార్గం నిర్మాణం రోడ్ల విషయంపై కూడా చాలా వరకు విమర్శలు వినిపిస్తున్నాయి తాజా ఘటనలతో పూర్తి విచారణ జరిపించి అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఇక సింహాచలంలో కూడా తిరుమల తరహాలో దర్శనాలు కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన గత ఏడాదే అప్పటి జిల్లా కలెక్టర్ చేశారు.  టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే లోపలికి వెళ్లే రీతిన ఆటోమేటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే చాలావరకు తొక్కిసలాటలు నిరోధించే అవకాశం ఉంటుంది.  ప్రధానంగా వీఐపీల పేరిట సింహాచలంలో దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది దీనివలన ఆదాయం కోల్పోవడం మాత్రమే గాక ఇతర భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.