కౌన్ బనేగా ఎస్ఈసీ?

Publish Date:Mar 24, 2021

Advertisement

వడ్డించే వాడు మనవాడైతే.. పదవులు కోరి వరిస్తాయి. ఏపీలో అదే జరుగుతోంది. కీలక పదవుల్లో తన అనునాయులనే నియమించుకుంటున్నారు సీఎం జగన్. ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మిలు ఇలా ప్రధాన్య పోస్టులు పొందినవారే. ఇప్పుడు ఆ కోవలోనే.. కాబోయే ఎస్‌ఈసీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎస్ఈసీ అంటే లూప్ లైన్ పోస్టుగా ఉండేది. కానీ, నిమ్మగడ్డ ఎపిసోడ్‌తో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఖతర్నాక్ అనే రేంజ్‌లో ఆ పదవికే పవర్ తీసుకొచ్చారు రమేశ్‌కుమారు. ఈ రెండేళ్లలో సీఎం జగన్‌కు ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఎస్ఈసీనే. అంతటి పవర్‌ఫుల్ పోస్టులో నెక్ట్స్ ఎవరు రాబోతున్నారనేది మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్. 

ఎస్ఈసీగా నిమ్మగడ్డ మార్చి 31న రిటైర్ కాబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు పేర్లతో ప్యానెల్‌ రెడీ చేశారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని.. నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు శామ్యూల్‌.. ఏపీ పునర్విభజన చట్టం అమలు బాధ్యతలు నిర్వహిస్తున్న రిటైర్డ్‌ అధికారి ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఈ ముగ్గురిలో శామ్యూల్ రేసులో ముందున్నారు. సీఎం జగన్ సైతం శామ్యూల్‌పైనే ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. 

శామ్యూల్.. వాన్‌పిక్‌ స్కాం కేసులో నిందితుడు. ఆయన 2014లోనే రిటైర్ అయ్యారు. అప్పట్లోనే శామ్యూల్ చీఫ్ సెక్రటరీ పోస్టుకు పోటీ పడినా.. వాన్‌పిక్‌ కేసులో సహనిందితుడిగా ఉండడంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను సీఎస్‌ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఆ విషయంలో ఆయన కేంద్ర అడ్మినిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో.. సీసీఎల్‌ఏగానే పదవీ విరమణ చేశారు శామ్యూల్‌. జగన్‌ సీఎం అయిన కొద్దిరోజులకే ముఖ్యమంత్రి సలహాదారుడిగా మళ్లీ యాక్టివ్ అయ్యారు శామ్యూల్. వైసీపీ ఎన్నికల హామీ అయిన నవరత్నాల పథకాల పర్యవేక్షణ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇప్పుడు ఎస్ఈసీ రేసులో నిలిచారు.

ఎస్ఈసీ జాబితాలో ఉన్న మరో ఇద్దరూ కీలకమైన అధికారులే. సీఎస్‌గా పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన సలహాదారుగా ఉన్న నీలం సాహ్నితో పాటు ఇటీవలే రెండేళ్ల సర్వీసు పొడిగింపు పొందిన ప్రేమ్‌చంద్రారెడ్డి ప్యానెల్‌లో ఉన్నారు. ముగ్గురూ సమర్థులైన అధికారులే కావడంతో వీరిలో ఎవరిని ఎస్ఈసీ వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఎస్ఈసీ ఎంపిక అధికారం రాష్ట్ర గవర్నర్‌దే. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టప్రకారం.. ప్రభుత్వ సలహా మేరకు ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమించాలి. అయితే, ఇందులో వయసుకు సంబంధించి వివాదమూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ చట్టం ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. ఇందులో ఏది ముందైతే అది. దీని ప్రకారం శామ్యూల్, ప్రేమ్‌చంద్రారెడ్డిల వయసు 67 ఏళ్లు. నీలం సాహ్ని ఏజ్ మాత్రం 65 ఏళ్లలోపే. ఒకవేళ గవర్నర్ ఏపీ చట్టాల ప్రకారం నియామకం చేపడితే ఎస్ఈసీగా శామ్యూల్‌‌కు అవకాశం దక్కొచ్చు. అదే, కేంద్ర నిబంధనల ప్రకారమైతే నీలం సాహ్నికి ఆ పదవి వరిస్తుంది. ముగ్గురిలో ఎవరికి వచ్చినా.. వారు ప్రభుత్వానికి అనుకూలమే అంటున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది త్వరలోనే తేలనుంది. 

By
en-us Political News

  
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.