ఎవ‌రీ మ‌స్క్‌?.. టెస్లా నుంచి ట్విట‌ర్ వ‌ర‌కూ...

Publish Date:Apr 26, 2022

Advertisement

ఎలాన్ మ‌స్క్‌. మ‌నిషి కాదు రోబోట్ అనిపిస్తారు. ఎవ‌రూ ఊహించ‌నిది ఊహిస్తారు. ఎవ‌రూ సాహ‌సించ‌నిది చేసి చూపిస్తారు. డ్రైవ‌ర్ లెస్‌ టెస్లా కారు త‌యారీ ఆయ‌న‌కే సాధ్య‌మైంది. స్పేస్‌ టూరిజం సైతం ఆయ‌న అంచ‌నాల‌ను అందుకుంది. ఇప్పుడు అంద‌రికీ షాక్ ఇస్తూ.. ట్విట‌ర్ పిట్ట‌ను త‌న పంజ‌రంలో బంధించేసుకున్నారు. ఇలాంటి అద్భుతాలు, సాహ‌సాలు చేయ‌గ‌లిగేది మ‌స్క్ మాత్ర‌మే. అందుకే, ఆయ‌నో బిజినెస్ టైకూన్‌. అయినా, ఆయ‌న‌కు ఓ సొంతిల్లు కూడా లేదంటే న‌మ్మాల్సిందే. ఎలాన్ గురించి మ‌రిన్ని వివ‌రాలు, విశేషాలు.....

>> తనకు ఉన్న 7 లగ్జరీ బంగ్లాలను అమ్మేస్తున్నట్టు 2020లో మస్క్ ప్రకటించి సంచలనం రేకెత్తించాడు. జీవితంలో వైభవాన్ని తగ్గించుకుంటున్నానని చెప్పి తన 7 విలాసవంతమైన భవనాలను అమ్మేశాడు. ప్రస్తుతం మ‌స్క్‌ ఓ చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బోక్సబుల్ అనే స్టార్టప్ కంపెనీ ఈ ఇంటిని నిర్మించింది. ఈ ఇంటిని మడిచి ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకెళ్లవచ్చు. 

>> న్యూరాలింక్ టెక్నాలజీతో ఒక యంత్రాన్ని మస్క్ అభివృద్ధి చేయిస్తున్నాడు. ఇది మానవ మెదడును కంప్యూటర్‌కు కనెక్ట్ చేస్తుంది. దాంతో మనిషి ఆలోచనలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి నమ్మశక్యంగా లేకున్నా.. మస్క్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. ఈ అద్భుతం అసాధ్యం కాదేమో అనిపిస్తోంది.

>> 2004లో ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లాను స్థాపించాడు. టెస్లా కారంటే ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచానికి మోజు. ఆధునిక టెక్నాల‌జీ దీని సొంతం. డ్రైవ‌ర్‌తో ప‌ని లేకుండా.. జీపీఎస్ ఆధారంగా, సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో ప్రయాణించ‌గ‌ల‌గ‌డం ఈ కార్ స్పెషాలిటీ. `భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్‌లతో సహా అన్నీ విద్యుత్‌తోనే నడుస్తాయి. ఆ మార్పును తీసుకురావడంలో టెస్లా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంద'ని మస్క్ అంటారు.  

>> మానవుల గ్రహాంత‌ర ప్ర‌యాణమే ల‌క్ష్యంగా 'స్పేస్-ఎక్స్' అనే సంస్థను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అణుయుద్ధం లేదా ఏదైనా గ్రహశకలం ఢీకొనడం వల్ల భూమి ఉనికికే ప్రమాదం ఏర్పడితే, అలాంటి పరిస్థితుల్లో అంగారక గ్రహమే మానవులకు అత్యంత అనుకూలమని మస్క్ భావిస్తున్నాడు. మస్క్ అంచనా ప్రకారం 2050 నాటికి అంగారక గ్రహంపై మానవుల నివాసాలు ఏర్పడతాయి. ఆ నివాసాలను `స్పేస్ ఎక్స్` సంస్థ నిర్మిస్తుందని మస్క్ ప్రకటించారు. 

>> 1999లో రూ.77 కోట్లతో `ఎక్స్ డాట్‌కామ్` అనే సంస్థని ప్రారంభించాడు. తర్వాత దానిని `కన్ఫినిటీ` అనే కంపెనీకి అమ్మేశాడు. అదే ఇప్ప‌టి 'పేపాల్‌'.

>> 12 ఏళ్ల వయస్సులో మస్క్ ఓ వీడియో గేమ్‌ రూపొందించి దానిని రూ.38 వేలకు ఓ కంపెనీకి అమ్మేశాడు. ఆ గేమ్ పేరు `బ్లాస్టర్`.

>> మస్క్ తన సోదరుడు కింబ్లేతో కలిసి `జిప్-2` అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాడు. ఆ సంస్థ‌ను డెవ‌ల‌ప్ చేసి రూ.170 కోట్లకు అమ్మేశాడు.

>> మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టాడు. త‌ల్లి అమెరికాన్‌. తండ్రి సౌత్ఆఫ్రిక‌న్‌. 

By
en-us Political News

  
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.