ఏవరా 19 మంది..ఏమా కథ!

Publish Date:Jun 22, 2023

Advertisement

తన పార్టీలో అసమర్ధ ఎమ్మెల్యేకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు.. మీ పనితీరు మెరుగు పరుచుకోవాలి.. లేదంటే నా నిర్ణయం తీసుకుంటా. మీరందరూ మళ్ళీ గెలవాలి.. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే నా భావన. కానీ, మీ పనితీరు బాగాలేకపోతే నేనేం చేయలేను.. ఆ మాటకొస్తే నా చేతిలో కూడా ఏమీ లేదు. మీ పనితీరు బాగుంటే సర్వేలలో మంచి మార్కులు వస్తాయి. ఆ మార్కులే మీకు టికెట్లు తెస్తాయి. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి నేను కార్యకర్తలకు అన్యాయం చేయలేను. కనుక మీ పనితీరు మెరుగు పరుచుకొని టికెట్లు తెచ్చుకోండి. ఇదీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గడపగడపకు కార్యక్రమం సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేకు చెప్పిన మాట. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల జాబితా ప్రకారం ఓ 19 మంది ఎమ్మెల్యేలకు జగన్ ఈ అల్టిమేటం ఇచ్చారు. అయితే, మీకు టికెట్లు ఇచ్చి కార్యకర్తలకు అన్యాయం చేయలేనని జగన్ చెప్పినా దాని అర్ధం మీరు ఓడిపోతే పార్టీకి, నాకు నష్టమనే.

గడపగడపకు కార్యక్రమం సమీక్షా సమావేశం అనంతరం కొందరు ఎమ్మెల్యేలు బయటకి వచ్చి మీడియా ముందే జగన్ అల్టిమేటం గురించి చెప్పగా.. మరికొందరు నియోజకవర్గాలలో నేతలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఈ సమావేశాన్ని ఒక్కసారి తేరిపార చూస్తే ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఆపరేషన్ మొదలైందని అనిపించకమానదు. నా చేతిలో ఏమీ లేదు.. సర్వేల ఫలితాలే మీకు టికెట్లు తెస్తాయని చెప్పారంటే దాని అర్ధం తెలియనిదేమీ కాదు. ఆ మాటకొస్తే ఒక్క వైసీపీ మాత్రమే కాదు చాలా వరకు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నాయి. తెలంగాణలో ఈ మధ్యనే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ మధ్యనే కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు చెప్పిన వారికే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ మోహన్ రెడ్డి అదే చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ఎవరికి చెప్తే వారికే టికెట్లు దక్కనున్నాయి.

ఈ మధ్యనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో సమావేశమైనట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు విషయం బయటకి వచ్చింది. పార్లమెంట్ భవనం ప్రారంభం సమయంలో కూడా ప్రశాంత్ కిషోర్ తో జగన్ భేటీ అయినట్లు కథనాలొచ్చాయి. రాష్ట్రంలో ఐ ప్యాక్ టీం ఇప్పటికే నాలుగు దఫాలుగా నియోజకవర్గాలలో సర్వేలు నిర్వహించింది. ఇప్పుడు కూడా మరో సర్వే జరుపుతోంది. వీటన్నిటి ఫలితాల ఆధారంగానే టికెట్ల జాబితాలు సిద్ధం కానున్నాయి. క్యాండిడేట్ల మీద యాంటీ ఇన్ కంబినెన్సీ పార్టీకి సోకకుండా జాగ్రత్తలు మొదలు పెట్టిన జగన్ త్వరలోనే తదుపరి పీకే మార్క్ ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది. 

మూడు రాజధానుల అంశం దగ్గర నుండి ఇంగ్లీష్ మీడియం చదువుల వరకు ఇకపై ఓటర్లను ఎమోషనలైజ్ చేసే దేన్నైనా వదిలే అవకాశం ఉండదు. ఇప్పటికే చంద్రబాబు కుప్పం సహా వై నాట్ 175 అంటూ నినాదం అందుకున్న వైసీపీ.. ఇప్పుడు ఆ టార్గెట్ గా వ్యూహాలు మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అమరావతిని నాశనం చేయడం దగ్గర నుండి ఎక్కడ వరకు వచ్చిందో తెలియని పోలవరం నిర్మాణం.. నెల్లూరు పెద్దారెడ్లు పార్టీలో రగిల్చిన చిచ్చు, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికలలో వేసిన వ్యతిరేక ఓటు వరకు.. నాలుగేళ్ళలో ఒక్కటంటే ఒక్కటి కూడా రాష్ట్రానికి రాని చెప్పుకోదగిన కంపెనీలు, వైజాగ్ నుండే పరిపాలన అని డజను సార్లు చెప్పినా జగన్ తాడేపల్లి నుండి కదలకపోవడం.. ఇలా చెప్పుకుంటూపోతే కోకొల్లుగా వ్యతిరేక అంశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ ఓవర్ కమ్ చేసేలా ఐ ప్యాక్ టీమ్ ఎలాంటి  ప్రణాళికలు రచిస్తుందో చూడాల్సి ఉంది. 
అదలా ఉంచితే   జగన్ అల్టిమేటమ్ ఇచ్చిన ఆ 19 ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది.

పార్టీ వర్గాలలో ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.  గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ  దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్,   భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినఅప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పేర్లు వినిపిస్తున్నాయి.  వీరెవరి పేర్లూ జగన్ బయట పెట్టలేదు. కానీ పార్టీలో అంతర్గత సంభాషణల్లో ఈ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో బహిష్కృత ఎమ్మెల్యేలను తీసివేయడా.. పని చేయని ఎమ్మెల్యేలు 19 మంది మాత్రమేనా అన్న మీమాంస అందరిలోనూ వ్యక్తమౌతోంది.    

ఎందుకంటే గతంలో కూడా జగన్ పలుమార్లు గడపగడపకు వర్క్ షాప్ నిర్వహిం మ్మెల్యేలను పేరు పేరున పిలిచి పని తీరు బాగాలేదని హెచ్చరించారు.ఎమ్మెల్యేలనే కాదు. మంత్రులను హెచ్చరించారు. అయినా వారి పనితీరు మెరుగుపడిన దాఖలాలేం లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం తరువాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. వైసీపీ మానవసంబంధాలకు విలువ నిచ్చే పార్టీ అన్నారు. ఎవరినీ దూరం చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అందరం కష్టపడి పని చేసి మళ్లీ అధికారంలోకి వద్దామన్నారు. అంతేనా తనకు ఎవరి మీద ఆగ్రహం లేదనీ, ఎమ్మెల్యేలు, మంత్రులూ అంతా బాగా పని చేస్తున్నారనీ కూడా చెప్పారు. పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలనే తాను చెబుతున్నానన్నారు. అలా చెప్పిన  జగన్ మళ్లీ ఇప్పుడు మాట మార్చారు.

ఓ 19 మంది పని తీరు అస్సలు బాగాలేదనీ, ఇలా చెప్పడమంటే మిగిలిన వారంతా బ్రహ్మాండంగా పని చేస్తున్నారని కాదనీ అన్నారు. దీంతో జగన్ ఓ సంఖ్య చెప్పి మొత్తం పార్టీ ఎమ్మెల్యేలందరిపైనా గన్ గురిపెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించిన సమయంలో జగన్ పార్టీలో 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వైసీపీ శ్రేణుల నుంచే వినవచ్చాయి. దాదాపుగా అదే సంఖ్యను జగన్ కూడా పలు సందర్భాలలో చెప్పారు. రోజులు గడిచే కొద్దీ అధికార పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలే కనిపిస్తున్నాయి.జగన్ ప్రభుత్వంపై రోజు రోజుకూ తీవ్రమౌతున్న ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు జనం వద్దకు వెళ్లడానికి జంకుతుంటే.. మరి కొందరు తాము పోటీకి సిద్దంగా లేమంటూ వారసులకు టికెట్టివ్వాలని జగన్ ను కోరుతున్నారు. మొత్తంగా జగన్ హెచ్చరికలను ఎమ్మెల్యేలు లెక్క చేసే పరిస్థితి లేదని, జగన్ గాంభీర్యం అంతా మేడిపండు చందమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.